యాపిల్‌ ఐఫోన్‌10 వచ్చేసింది.. | Apple unveils new iPhone X, iPhone 8 models, smartwatch | Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఐఫోన్‌10 వచ్చేసింది..

Published Wed, Sep 13 2017 1:07 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

యాపిల్‌ ఐఫోన్‌10 వచ్చేసింది..

యాపిల్‌ ఐఫోన్‌10 వచ్చేసింది..

► 5.8 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లోకి
► ఐఫోన్‌ 8, 8ప్లస్‌ కూడా... యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 3, 4కే యాపిల్‌ టీవీ సైతం  8 సిరీస్‌ ధరలు 699 డాలర్ల నుంచి 
► ఐఫోన్‌10 ఆరంభ ధర 999 డాలర్లు అక్టోబర్‌ 27 నుంచి ప్రీ–బుకింగ్‌... నవంబర్‌ 3 నుంచి డెలివరీలు


క్యుపర్టినో, అమెరికా: కొత్త ఐఫోన్‌ సిరీస్‌కు సంబంధించిన ఊహగానాలకు తెరవేస్తూ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన తాజా ఫోన్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ‘ఐఫోన్‌గీ (రోమన్‌ 10)’ పేరిట తన తాజా సంచలనాన్ని మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటితో పాటు ఐఫోన్‌8, ఐఫోన్‌8 ప్లస్‌ పేరిట మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసింది. ఐఫోన్‌ 10ను యాపిల్‌ అధినేత టిమ్‌ కుక్‌ విడుదల చేయటం విశేషం.

ఇవీ ప్రత్యేకతలు...
యాపిల్‌ ఐఫోన్‌ 10 స్క్రీన్‌ పరిమాణం 5.8 అంగుళాలు. ఓఎల్‌ఈడీ టెక్నాలజీతో పాటు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీ, గ్లాస్‌ బ్యాక్, త్రీడీ టచ్, ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలు దీని సొంతం. 64, 256 జీబీ సామర్థ్యాల్లో లభ్యం. ఇక ఐఫోన్‌ 8లో స్క్రీన్‌ 4.7 అంగుళాలు, ఐఫోన్‌ 8 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. వీటిలో 3డీ టచ్, ట్రూ టోన్‌ డిస్‌ప్లే ఫీచర్స్, ఏ11 ప్రాసెసర్‌ (సిక్స్‌ కోర్‌)  ఉంటాయి. సిల్వర్, స్పేస్‌ గ్రే, బంగారం రంగుల్లో ఇవి లభిస్తాయి. ఐఫోన్‌ 8లో రియర్‌ కెమెరా 12 ఎంపీగాను, 8 ప్లస్‌లో 12 ఎంపీ సామర్ధ్యంతోను డ్యుయల్‌ కెమెరాలు ఉంటాయి. ఐఫోన్‌–8 ధర 699 డాలర్ల నుంచీ ఆరంభమవుతుండగా... 8 ప్లస్‌ ధర మాత్రం 799 డాలర్ల నుంచీ మొదలవుతోంది.

ఐఫోన్స్‌తో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 3, వాచ్‌ ఓఎస్‌4, 4కే హెచ్‌డీఆర్‌ వీడియో ఫీచర్‌తో కొత్త యాపిల్‌ టీవీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్‌ ఆవిష్కరించింది. కొత్తగా నిర్మించిన యాపిల్‌ పార్క్‌ కార్యాలయంలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో వీటిని ఆవిష్కరించారు. 2007 జనవరి 9న అప్పటి యాపిల్‌ సీఈవో స్టీవ్‌ జాబ్స్‌ తొలి ఐఫోన్‌ను ప్రవేశపెట్టి.. మొబైల్‌ కంప్యూటింగ్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అదే ఏడాది జూన్‌ 29 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాక ఐఫోన్‌ రాత్రికి రాత్రే సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. స్టీవ్‌ జాబ్స్‌ ఎప్పటికీ తమ జ్ఞాపకాల్లో ఉండిపోతారని టిమ్‌ కుక్‌ చెప్పారు. యాపిల్‌ పార్క్‌ కార్యాలయంలోకి ఈ ఏడాది ఆఖరునాటికి కార్యకలాపాలను తరలిస్తామని తెలియజేశారు.

యాపిల్‌ వాచ్‌..: యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 3లో ఎల్‌టీఈ టెక్నాలజీ ఆధారిత బిల్ట్‌ ఇన్‌ ఎలక్ట్రానిక్‌ సిమ్, డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ మొదలైనవి  ప్రత్యేకతలు. దీని ధర 329 డాలర్ల నుంచి 399 డాలర్ల దాకా (సెల్యులార్‌ ఆప్షన్‌తో) ఉంటుంది. సెప్టెంబర్‌ 15 నుంచి ఆర్డర్లు స్వీకరించనుండగా, 22 నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది.  రోలెక్స్, ఫాసిల్, ఒమెగా, కార్టియర్‌ మొదలైన వాటిని దాటేసి యాపిల్‌ వాచ్‌ ప్రస్తుతం నంబర్‌ వన్‌ వాచ్‌గా ఉందని టిమ్‌ కుక్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement