
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం ఆపిల్ స్పందించింది. మహమ్మారి నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలకు టెక్ దిగ్గజం సహకరిస్తుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. "భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరి గురుంచి ఆలోచిస్తున్నాం. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా ఆపిల్ విరాళం ఇవ్వనుంది’’ అని టిమ్ కుక్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
Amid a devastating rise of COVID cases in India, our thoughts are with the medical workers, our Apple family and everyone there who is fighting through this awful stage of the pandemic. Apple will be donating to support and relief efforts on the ground.
— Tim Cook (@tim_cook) April 26, 2021
అంతకుముందు, మైక్రోసాఫ్ట్ భారతీయ-అమెరికన్ సీఈఓ సత్య నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కరోనాతో పోరాడుతున్న భారతదేశానికి వారి మద్దతును తెలిపారు. గూగుల్ తరఫున రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు పిచాయ్ ప్రకటించగా, దేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు తోడ్పడేలా ఆక్సిజన్ కాన్సంట్రేషన్ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామని నాదెళ్ల ప్రకటించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశంలో సోమవారం 3.52 లక్షల కొత్త కరోనా వైరస్ కేసులను నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఒకే రోజులో ఇంత అత్యదిక స్థాయిలో కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటి సారి.
చదవండి: