యాపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) ఇటీవల తన షేర్లలో భారీ భాగాన్ని విక్రయించి, గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద విక్రయాన్ని నమోదు చేసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనం చూసేద్దాం.
రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, కుక్ 5,11,000 షేర్లను (శుక్రవారం 2,70,000 షేర్లు, సోమవారం 2,41,000 షేర్లు) విక్రయించి దాదాపు 41.5 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 345 కోట్లు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం, అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 88 మిలియన్ డాలర్లు, మొత్తం టాక్స్ తరువాత అతనికి 41.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు తరువాత కుక్ విక్రయించిన అతిపెద్ద ఆపిల్ షేర్లు ఇవే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: అదే నిజమైతే బిలియనీర్‌కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?
టిమ్ కుక్ తన యాపిల్ షేర్లలో కొన్నింటిని విక్రయించినప్పటికీ, తన వార్షిక ప్రణాళికలో భాగంగా అతను అదే సంఖ్యలో షేర్లను అందుకోవడం వల్ల కంపెనీలో అతని మొత్తం వాటా మారలేదు. ఇప్పటికి కూడా ఇతడు 3.3 మిలియన్ యాపిల్ షేర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం సుమారు 565 మిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment