
లూసియానా : సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు. కానీ ఈ క్రమంలో పర్యావరణానికి జరుగుతోన్న నష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. తాజాగా పర్యావరణ పరిరక్షణపై ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో తులెన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న టిమ్ కుక్.. యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘పర్యావరణా న్ని పరిరక్షించడంలో మా తరం విఫలమైంది. మేమంతా కేవలం చర్చల పేరిట సమయాన్నంతా వృథా చేశాం. దీంతో మా తరంలో చర్చలు ఘనం, ఫలితాలు మాత్రం శూన్యం అన్నట్లుగా మారింది. మేం చేసిన తప్పు మీరు చేయకండి, ఈ తప్పు నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేయాల’ని కుక్ పిలుపునిచ్చారు.