బీజింగ్ : చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 23న సియాటెల్‌లో జరిగే వ్యాపార చర్చల్లో ఆయనతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, పెప్సి ఇంద్రా నూయి, ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఆలీబాబా జాక్ మా తదితర టాప్ 30 సీఈఓలు పాల్గొననున్నారు. అమెరికా, చైనాలకు చెందిన చెరో 15 దిగ్గజ వ్యాపార కంపెనీల సీఈఓలు ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు.
ఈ రౌంట్ టేబుల్ సమావేశానికి అమెరికా మాజీ ఆర్థిక మంత్రి హెన్రీ పాల్సన్ అధ్యక్షత వహించనున్నారు. వ్యాపార, వాణిజ్యాంశాల్లో చైనా, అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, అవకాశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇరు దేశాల దైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది.
చైనా అధినేతతో టాప్ సీఈఓల భేటీ
Published Sat, Sep 19 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM
Advertisement