DC Vs KKR: Apple CEO Tim Cook And Sonam Kapoor Spotted At Arun Jaitley Stadium, Pics Viral - Sakshi
Sakshi News home page

IPL 2023 DC Vs KKR: ఢిల్లీ, కేకేఆర్‌ మ్యాచ్‌లో సందడి చేసిన యాపిల్ సీఈవో.. ఫోటోలు వైరల్‌

Published Fri, Apr 21 2023 10:48 AM | Last Updated on Fri, Apr 21 2023 11:06 AM

Apple CEO Tim Cook, Sonam Kapoor spotted at Arun Jaitley Stadium  - Sakshi

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 57 పరుగులతో రాణించాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 127 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్‌ బ్యాటర్లలో జాసన్‌ రాయ్‌(43), రస్సెల్‌(38) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో చాన్నాళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్‌ శర్మ అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, నోర్జే తలా రెండు వికెట్లు సాధించారు.

మ్యాచ్‌ను వీక్షించిన యాపిల్ సీఈవో
ఇక యాపిల్ రిటైల్ స్టోర్ల ప్రారంభోత్సవం కోసం ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టిమ్‌ కుక్‌ తమ రిటైల్ స్టోర్‌ను దేశ రాజధాని ఢిల్లీలో గురువారం(ఏప్రిల్‌ 20)న ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ కుక్‌ సందడి చేశారు. బాలీవుడ్‌ నటి సోనమ్ కపూర్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో కలిసి ఆయన మ్యాచ్‌ వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. చెన్నైకి గుడ్‌ న్యూస్‌! 16 కోట్ల ఆటగాడు రెడీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement