ప్రజలను ఓటర్లుగా మాత్రమే కొనసాగించినంతకాలం రాజకీ య నేతలు అభివృద్ధి చెందుతూనే ఉంటారు.
ప్రజలను ఓటర్లుగా మాత్రమే కొనసాగించినంతకాలం రాజకీ య నేతలు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్న వారు ప్రభుత్వాల ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారు. కాని ఏ మంత్రి కాని, ఆధికారి కాని ప్రజలను పొదుపు చేయడానికి శ్రమించాలని కానీ, పరిమిత సంతానాన్ని పాటించాలని కాని చెప్పిన పాపానపోవడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షేమంపై పెడుతున్న ఖర్చు, ప్రజలను ఓటర్లుగా మిగిలిస్తూ వారిని నొప్పిలేని దారిద్య్రంలో కొనసాగేవారిగా మలుస్తోంది. మన వెనుకబాటుతనానికి ఇదే ముఖ్య కారణం.
- డా. టి. హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్