ఎవరో చేస్తే బాగుపడదాం అనుకోవద్దు
* మీకు బాధ్యత ఉండాలి.. కష్టపడి పనిచేయాలి
* శాశ్వతంగా పేదవారిగా ఉండకూడదు
* 'దిశ-నిర్దేశ' సదస్సులో ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: 'మీరు ఎవరో చేసిపెడితే బాగుపడదామనుకుంటున్నారు. శాశ్వతంగా పేదోళ్లుగా ఉండకూడదు. ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండాలి. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. రాజకీయ పార్టీలు ఏదో చేస్తాయని అనుకోవద్దు. మీకు బాధ్యత ఉండాలి. కష్టపడి పనిచేయాలి. అది మన నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలి. మీలో చైతన్యం రావాలి. మీ గ్రామంలో ఎలాంటి వనరులు ఉన్నాయి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అనేది మీ ఇంట్లో చర్చించుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది' అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో గురువారం 'దిశ - నిర్దేశ' సదస్సులో ఆయన మాట్లాడారు.
ఏ ప్రయోగమైనా కుప్పం నుంచే..
రాష్ట్రంలో ఏ ప్రయోగమైనా కుప్పం నుంచే ప్రారంభిస్తున్నామని, ఇక్కడ విజయవంతమయ్యాక రాష్ట్రంలో అమలు చేయడం ఆనవాయితీగా వస్తోందని బాబు తెలిపారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తామన్నారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
దామాషా పద్ధతిలో కృష్ణా జలాలు
కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో సమానంగా పంచుకోవాలని చంద్రబాబు అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణ కు 290 టీఎంసీలు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి రూ.171.16 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
భూముల స్వాధీనానికి నిరసనగా..
కుప్పం నియోజకవర్గంలో వివూనాశ్రయుం ఏర్పాటుకు రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఓ వుహిళ కిరోసిన్ క్యాన్‌తో బాబు పాల్గొన్న సభా ప్రాంగణానికి చేరుకుంది. విషయుం తెలుసుకున్న పోలీసులు సదరు వుహిళను వుండల సచివాలయుంలోని ఒక గదిలో బంధించారు. సదస్సు ముగిసిన అనంతరం విడిచిపెట్టారు.