ఆహారభద్రతతో పేదరికంపై గెలుపు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దేశంలో ఆహారభద్రత కల్పించబడడంతో పేదరికంపై గెలుపు సాధించగలిగామని జాయింట్ కలెక్టర్–2 సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కృష్ణాపుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్నచర్చల్లో భాగంగా శుక్ర వారం పేదరికంపై గెలుపు అనే అం శంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దేశంలో ఆహారభద్రత కల్పించబడడంతో పేదరికంపై గెలుపు సాధించగలిగామని జాయింట్ కలెక్టర్–2 సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కృష్ణాపుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్నచర్చల్లో భాగంగా శుక్ర వారం పేదరికంపై గెలుపు అనే అం శంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతా ల్లో వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులపై ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చేతి పని వృత్తుల వారల జీవనం ఆశించిన మేరకు లేదని అభిప్రాయపడ్డారు. సగటు ఆదాయం రూ.లక్షా 70వేలు ఉండగా విశాఖపట్టణం జిల్లా మొదటిస్థానంలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 19.2శాతం యువతీయువకులు ఉన్నారని తెలిపారు. వీరికి వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యానవన పంటలు, కోళ్లపెంపకం, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. డ్వామాపీడీ హరిత, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.