
సాక్షి, హైదరాబాద్: దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహా దారు డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణియన్ అన్నారు. దేశంలో కొనసాగుతున్న సుస్థిరాభివృధ్ధి దశల వారీగా పేదరికాన్ని తగిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం మానవ వనరుల అభివృధ్ధి కేంద్రంలో జరిగిన ‘దేశ పురోగతి విధానం, భవిష్యత్తు’అన్న అంశంపై జరిగిన సద స్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై సుబ్రహ్మణియన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.