ప్రత్యామ్నాయ వనరులందించే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్! | Make Alternative Energy Your Business | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ వనరులందించే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్!

Published Thu, Sep 11 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

ప్రత్యామ్నాయ వనరులందించే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్!

ప్రత్యామ్నాయ వనరులందించే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్!

ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు వనరులు అదేస్థాయిలో తరిగిపోతున్నాయి. ఫలితం.. కరవు కాటకాలు, ఆకలి, పేదరికం, యుద్ధాలు, అశాంతి వంటి సామాజిక రుగ్మతలు పంజా విసురుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు భయానకమే. ఈ నేపథ్యంలో మానవుడు చేయాల్సింది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను కాపాడుకోవడం, ప్రత్యామ్నాయ వనరులను తయారు చేసుకోవడం. ఈ రెండూ ఏకకాలంలో జరగాలి. భూగర్భంలో నీరు, చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి విలువైన వనరులు తగ్గిపోతుండడంతో ప్రత్యామ్నాయాలపై ఇప్పటికే పరిశోధన ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వనరులను, పర్యావరణ హితమైన వస్తువులను ప్రజలకు అందించేవారే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అన్నిదేశాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో హరిత వ్యాపారవేత్తలకు అవకాశాలు పెరుగుతున్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
 
 ప్రభుత్వాల ప్రోత్సాహం: అంతరిస్తున్న పచ్చదనం, పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత వంటి కారణాలతో జనం ఆలోచనల్లో మార్పు వస్తోంది. పర్యావరణ హితమైన వస్తువుల వాడకంపై అవగాహన పెరుగుతోంది. దీంతో గ్రీన్ బిజినెస్ ఊపందుకుంటోంది. కరెంటు కోతల నేపథ్యంలో సౌరశక్తి వినియోగం పెరుగుతోంది. సోలార్ పరికరాలకు, పర్యావరణ హిత వస్తువులకు అధిక డిమాండ్ ఉంది. వీటిని రూపొందించే సంస్థల్లో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దేశ విదేశాల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కెరీర్ ప్రారంభిస్తే.. ప్రస్తుతం అవకాశాలకు కొదవే లేదు. ఔత్సాహికులకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందుతోంది.
 
 కావాల్సిన నైపుణ్యాలు: గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వ్యాపార నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. తమ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించేందుకు, లావాదేవీలు నిర్వహించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాలి. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. నిత్య అధ్యయనమే ఇందుకు మార్గం. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఉండాలి. పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ వనరుల తయారీపై ఆసక్తి అవసరం. ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేందుకు మెరుగైన మార్కెటింగ్ నైపుణ్యాలు ఉండాలి.
 
 అర్హతలు:
 భారత్‌లో పలు విద్యాసంస్థలు పర్యావరణ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం బిజినెస్ స్కూళ్లలో కోర్సులు ఉన్నాయి. ఎంబీఏలో స్పెషలైజేషన్లుగా వీటిని అందిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైనవారు ఆయా కోర్సుల్లో చేరొచ్చు.
 
 వేతనాలు: హరిత వ్యాపారవేత్తలు తమ వ్యాపార ఆలోచనలను అమల్లో పెట్టి ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో నెలకు కనీసం రూ.30 వేలకుపైగానే ఆర్జించే వీలుంది. వినూత్నమైన ఆలోచనలతో మార్కెట్‌లోకి ప్రవేశిస్తే ఆదాయానికి హద్దే ఉండదు.  
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
     వెబ్‌సైట్: www.uohyd.ac.in/
     సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్
     ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.ceeindia.org/
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు), వెబ్‌సైట్:     www.iimcal.ac.in/,www.iimahd.ernet.in/, www.iimb.ernet.in/    
 www.iiml.ac.in/
     ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
     -న్యూఢిల్లీ.     వెబ్‌సైట్: www.imi.edu/
     ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,
 ఢిల్లీ యూనివర్సిటీ. వెబ్‌సైట్: http://fms.edu/
     ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్-అహ్మదాబాద్.     
 వెబ్‌సైట్: www.mica.ac.in/
 
 డీఎస్సీ సోషల్ మెథడ్‌‌సలోని ‘బోధన లక్ష్యాలు - స్పష్టీకరణాలు’ పాఠ్యాంశం నుంచి అడిగే ప్రశ్నల సరళిని వివరించండి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి?    
 - కె. మాళవిక, దిల్‌సుఖ్‌నగర్
 గత డీఎస్సీ పరీక్షలో ఆశయం, లక్ష్యం, స్పష్టీకరణాలపై విషయ అవగాహనను పరీక్షిస్తూ ప్రశ్నలు అడిగారు. కాబట్టి అభ్యర్థులు మెథడాలజీలో ఉన్న అంశాలను పాఠ్య విషయంలోని అంశాలతో అనుసంధానం చేస్తూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు గత పరీక్షలో కింది ప్రశ్నను అడిగారు.
 ప్రశ్న: ఇటీవల ఏర్పడిన తుఫానులు ఏ వర్షపాతానికి ఉదాహరణ అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు మాపనం చేయదల్చుకున్న లక్ష్యం?
 సమాధానం: అవగాహన. మెథడాలజీలోని లక్ష్యాలు - స్పష్టీకరణాలతో పాటు కంటెంట్‌ను కూడా అవగాహన చేసుకోవాలనే విషయం పై ప్రశ్న ద్వారా అర్థం అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఏడు లక్ష్యాలు, ఆ లక్ష్యాల్లోని నిర్దిష్ట లక్ష్యాలు, 66 స్పష్టీకరణాలను ఉదాహరణల పూర్వకంగా చదవడం వల్ల ‘లక్ష్యాలు - స్పష్టీకరణాలు’ పాఠ్యాంశంలో పట్టు సాధించవచ్చు.  
 ఇన్‌పుట్స్: డాక్టర్ ఎస్.ఎస్.మోజెస్, సీనియర్ ఫ్యాకల్టీ
 
 డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో పీజీ
 పాట్నాలోని డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్.. పీజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     పీజీ ఇన్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: రెండేళ్లు.
 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ 2013-14 స్కోరు ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 25
 వెబ్‌సైట్: www.dmi.brlps.in
 
 పీజీ డిప్లొమా
 బెంగళూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం).. పీజీ డిప్లొమాలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: రెండేళ్లు
 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. క్యాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ సీమ్యాట్ స్కోరు ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2015
 వెబ్‌సైట్: www.iipmb.edu.in   
 
 ఎస్పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
 ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్.. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     పీజి డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
 విభాగాలు: ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్.
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ (10+2+3) ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్ స్కోరు అవసరం.
 దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30
 వెబ్‌సైట్: http://www.spjimr.org
 
 పీహెచ్‌డీ ప్రోగ్రామ్
 భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో  ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     పీహెచ్‌డీ
 అర్హతలు:  55 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
     ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్
 విభాగం: మేనేజ్‌మెంట్
 అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5
 వెబ్‌సైట్: w3.ximb.ac.in
 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూకే 2015 అకడమిక్ సెషన్‌కు సంబంధించి గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు కోరుతోంది.
     ఆక్స్‌ఫర్డ్- అండర్సన్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్
 అర్హతలు: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో చేరినవారు అర్హులు.
 ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
 దరఖాస్తుకు చివరి తేది: జనవరి 23, 2015
 వెబ్‌సైట్: http://www.ox.ac.uk

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement