resources
-
Aqueduct Water Risk Atlas: ఇక కన్నీళ్లేనా..?
వానలు, వరదలతో ప్రపంచంలో కొన్ని దేశాలు అల్లాడిపోతుంటే, మరి కొన్ని దేశాల్లో గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లకి కరువు వచ్చి పడింది. ప్రపంచంలో 25 దేశాలు నీటికి కటకటలాడుతున్నట్టుగా వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అడ్వకేట్ వాటర్ రిస్క్ అట్లాస్ పేరుతో ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచ జనాభాలో 25% మంది ప్రస్తుతం అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నివేదిక ఏం చెప్పిందంటే.. ► ప్రపంచంలోని 25 దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిలో భారత్, సౌదీ అరేబియా, చిలీ, శాన్మెరినో, బెల్జియం, గ్రీస్ వంటి దేశాలున్నాయి. ► బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ప్రతీ ఏడాది నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. ప్రతీ ఏడాది కరువు బారిన పడుతున్నాయి. ► ప్రపంచంలో నీటి కొరత అత్యధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతాలు పశి్చమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా. ఈ ప్రాంతాల్లో 83% జనాభా అత్యధికంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. ► దక్షిణాసియా జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశాల్లో 74% మంది జనాభా నీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ► ప్రపంచ జనాభాలో 50% మంది అంటే 400 మంది కోట్ల వరకు ప్రతీ ఏడాది ఒక నెల రోజుల పాటు నీటికి కటకటగా ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 60 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయి. ► నీటి కొరత కారణంగా భారత్, మెక్సికో, ఈజిప్టు, టర్కీ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నాయి. ► 2010లో నీటి కొరత వల్ల ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 15 లక్షల కోట్ల డాలర్లు (ప్రపంచ జీడీపీలో 24%) నష్టపోతే, 2050 నాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 31% నష్టం వాటిల్లుతుంది. అంటే 70 లక్షల కోట్ల డాలర్ల నష్టం వస్తుంది. ► ఆసియా దేశాల్లో భారత్ అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొంటుంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో 80% మందికి సురక్షిత నీరు అందదు. ► ప్రపంచ వ్యవసాయ రంగం 60% నీటి కొరతను ఎదుర్కొంటోంది. దీని వల్ల వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకు పంటలపై ప్రభావం పడుతోంది. నీటి కటకటకి కారణాలివే..! జనాభా పెరుగుదల , పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణ సమర్థంగా చేయకపోవడం వంటివెన్నో నీటి కటకటకి కారణాలు. భూమ్మీద 70% నీటితో నిండి ఉన్నా మన అవసరాలు తీర్చే నీరు అందులో 3% మాత్రమే. అందులో రెండింట మూడొంతులు మంచు రూపంలో ఉంది. జనాభా పెరిగిపోతూ ఉండడంతో నీటికి డిమాండ్ పెరుగుతోంది. 1960తో పోల్చి చూస్తే నీటికి డిమాండ్ రెట్టింపు కంటే ఎక్కువైంది. యూరప్, అమెరికాలో నీటికి డిమాండ్ స్థిరంగా ఉంటే ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోంది. 2050 నాటికి నీటికి డిమాండ్ మరో 25% పెరుగుతుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలో సగం దేశాల్లో అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు పెరిగిపోతూ ఉండడంతో నీటి వినియోగం అధికమవడమే కాకుండా, కలుíÙత నీరు పెరిగిపోయే ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది. చేయాల్సింది ఇదే..! ప్రతీ వాన బొట్టుని సంరక్షించడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేయాలి. వ్యవసాయ, పారిశశ్రామిక రంగాలకే 70% నీటిని వాడాల్సి వస్తోంది. 2050 నాటికి పెరిగే జనాభాకి 2010 కంటే 56% అధికంగా పంటలు పండించాలి. తక్కువ నీటి వాడకంతో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల 2050 నాటికి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు గణనీయంగా తగ్గుతాయని ఒక అంచనా. చిత్తడి నేలలు పెంచడం, భూగర్భ జలాల పెంపొందించే చర్యలు చేపట్టడం వంటివి చెయ్యాలి. ఇక గ్లోబల్ వారి్మంగ్ అదుపు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సి ఉంది. ఆ 25 దేశాలు ఇవే..!: భారత్, బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, యెమన్, బోత్సా్వనా, ఇరాన్, జోర్డాన్, చిలీ, శాన్ మారినో, బెల్జియం, గ్రీస్, టునిషియా, నమీబియా, దక్షిణాఫ్రికా, ఇరాక్, సిరియా నీరు మనకి జీవనాధారం. భూమ్మీద లభించే అత్యంత ముఖ్యమైన వనరు అదే. అయినా దాని నిర్వహణలో మనం విఫలమవుతూ వస్తున్నాం. జల సంరక్షణ అనే అంశంలో నేను 10 ఏళ్లుగా పని చేస్తున్నాను. దురదృష్టవశాత్తూ ప్రతీ ఏడాది అదే నివేదిక, అదే కథనం ఇవ్వాల్సి వస్తోంది. ఈ సంక్షోభ పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రపంచ దేశాధినేతలు చిత్తశుద్ధితో పని చేస్తూ నీటి వనరుల సంరక్షణకి ఆర్థిక వనరులు కేటాయించాలి’’ –సమంతా కుజ్మా, డబ్ల్యూఆర్ఐ నివేదిక రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ (కాంపెన్సేషన్ కాకుండా) పన్నుల వసూళ్లు జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరినట్లు అధికారులు వెల్లడించారు. జూన్ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే.. తగ్గిన మద్యం అమ్మకాలు. ► 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు. ►2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులుకాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు. ►2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు వెల్లడించగా..ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలని, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. పెరిగిన రిజస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు ఉండగా.. ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. రీసర్వే పూర్తిచేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం అయ్యాయని, దాదాపు 5వేల రిజిస్ట్రేషన్ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రూ. 8.03 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ సాధ్యమైందని అధికారులు సీఎంకు వివరించారు. 2018–19లో ఈ శాఖనుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని తెలిపారు. కార్యకలాపాలను నిర్వహించిన 2724 మైనింగ్ లీజుల్లో 1555 చోట్ల తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ ఏపీఎండీసీ ఆర్థిక పనితీరు మెరుగుపడిందన్న అధికారులు. 2020–21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22–23లో రూ.1806 కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం పెరగిందన్నారు అధికారులు. 2023–24 నాటికి రూ.4వేల కోట్లకు ఏపీఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా వేశారు. మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గుగనుల నుంచి ఏపీఎండీసీ భారీగా ఆదాయం తెచ్చుకుంటోందని, సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. గణనీయంగా ఆదాయల పెంపు: సీఎం జగన్ గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని అన్నారు సీఎ జగన్. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతంలో ఆదాయాలపరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతోపాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని తెలిపారు. రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని, అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు. కలెక్టర్లతో భాగస్వామ్యం కావాలి: సీఎం జగన్ వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలని సీఎం జగన్ సూచించారు. ఇవి కొనుగోలు దారులకు ఎంకరేజ్ చేసేలా ఉండాలని తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు.. జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించాలని, ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. ఆర్ధికశాఖ అధికారులు కూడా కలెక్టర్లతో నిరంతరం మాట్లాడాలన్నారు. దీనివల్ల ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతం అవుతాయని, ఎక్కడా లీకేజీలు లేకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని సీఎ జగన్ తెలిపారు. ఇదీ చదవండి: విద్యుత్ పొదుపునకు కేరాఫ్ జగనన్న ఇళ్లు -
ఆరోగ్య వనరుల అడ్డాగా భారత్ - ప్రపంచ అవసరాలను కూడా..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ, 2023 భారత్‌ను సమగ్ర ఆరోగ్య సంరక్షణ వనరుల కేంద్రంగా మారుస్తుందని పరిశ్రమ భావిస్తోంది. భారత్ అవసరాలు తీర్చడమే కాకుండా ప్రపంచానికి కావాల్సిన వనరులను అందించే స్థాయికి ఎదుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం మన దేశ వైద్య అవసరాలకు కావాల్సిన పరికరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేశీయంగా వీటి తయారిని ప్రోత్సహించేందుకు, ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లుగా ఉన్న పరిశ్రమను 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో బుధవారం కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చింది. సమగ్ర విధానం.. అసోచామ్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. వివిధ రకాల లైసెన్స్‌ల జారీకి సింగిల్ విండో, స్థిరమైన ధరల నిబంధనలు, తయారీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ పరంగా పురోగతి సాధించడం నూతన విధాన లక్ష్యాలుగా ఉన్నట్టు చెప్పారు. భారత్ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మసీ కేంద్రంగా ఉండగా, వైద్య ఉపకరణాల విషయంలోనూ సమ ప్రాధాన్యం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘‘నూతన పాలసీని విస్తృతమైన సంప్రదింపుల తర్వాత తీసుకొచ్చారు. మన దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా భారత్‌ను మార్చాలనే లక్ష్యం ఇందులో ఉంది’’అని అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఆర్‌అండ్‌డీకి ప్రోత్సాహం ‘‘పరిశోధన అభివృద్ధిపై (ఆర్అండ్డీ)పై దృష్టి పెట్టడం ప్రోత్సాహనీయం. ప్రపంచ వైద్య ఉపకరణాల మార్కెట్లో భారత్ కేవలం 1.5 శాతం వాటా కలిగి ఉండగా, మెడికల్ టెక్నాలజీ ఆర్అండ్డీలో 8 శాతం వాటా మన దేశం సొంతం’’అని మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ పవన్ చౌదరీ పేర్కొన్నారు. ఆరోగ్య రంగ నిపుణులకు నైపుణ్యాలు, అదనపు నైపుణ్యాలపై శిక్షణ ద్వారా రోగుల సంరక్షణ అవసరాలు తీర్చడంతోపాటు, మానవ వనరుల ఎగుమతులకు తోడ్పడుతుందన్నారు. మారుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా వైద్య ఉపకరణాల రంగంలో వృద్ధిని వేగవంతం చేయడాన్ని ప్రభుత్వ నూతన విధానం లక్ష్యంగా చేసుకున్నట్టు పీహెచ్‌డీసీసీఐ మెడికల్ డివైజ్ కమిటీ సహ చైర్మన్ భార్గవ్ కొటాడియా పేర్కొన్నారు. -
సిబ్బందే.. అటవీ సంరక్షకులు
సాక్షి, అమరావతి: అటవీ సంపదను కాపాడడంలో సిబ్బందిదే కీలకపాత్ర అని అటవీ శాఖ ముఖ్య ప్రధాన సంరక్షణాధికారి ఎన్ ప్రతీప్ కుమార్ అన్నారు. ఇప్పటికే అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరులోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అటవీ శాఖలో కొందరు ఉద్యోగులు అడవులను, అటవీ సంపదను కాపాడుతూ.. విధి నిర్వహణలో అసువులు బాసారని తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకోవడంతోపాటు వారికి రావలసిన బెనిఫిట్స్ త్వరితగతిన అందజేస్తామని చెప్పారు. కోవిడ్ సమయంలో దురదృష్టవశాత్తూ 38 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందించామని తెలిపారు. -
అమ్మకు వందనం.. గురువుకు ఎగనామం!
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తినడానికి తిండి లేదు, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు ఉంది ప్రభుత్వ తీరు. విద్యారంగ ఉన్నతికి, పాఠశాలల అభివృద్ధికి కావలసిన నిధులు విడుదల చేయడంలో ఏ మాత్రం స్పందించని ప్రభుత్వం అమ్మకు వందనం, పాఠశాలల వార్షికోత్సవాలు అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి నిర్వహణకు ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం, పాఠశాలల అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల విడుదలలో కోత పెట్టడంతో ప్రభుత్వ విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జిల్లాలో పాఠశాలల వివరాలివీ జిల్లాలో ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మొత్తం 3,297 ఉన్నాయి. వాటిలో 2,550 ప్రాథమిక, 251 ప్రాథమికోన్నత, 496 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో రూ. 2,500 నిధులతో విద్యార్థుల తల్లులకు పూలదండలు వేసి సత్కరించి, విద్యార్థుల చేత వారి మాతృమూర్తులకు పాదాభివందనాలు చేయించి ఆశీర్వచనాలు ఇప్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేయాలని ఆదేశాలు జారీచేసినా కేవలం 545 పాఠశాలలకు మాత్రమే రూ.2,500 చొప్పున రూ.13.62 లక్షల బడ్జెట్ విడుదల చేసింది. అయితే కొన్ని పాఠశాలలకు సంబంధించిన మొత్తాన్ని మండల విద్యాశాఖాధికారి ఖాతాకు వేయడంతో ఆయా పాఠశాలలకు వారి నుంచి ఆ మొత్తం ఇంకా సంబంధిత పాఠశాలలకు అందలేదు. మిగిలిన పాఠశాలలు మాత్రం వాటి స్కూల్ గ్రాంటుల్లోని నిధులను ఉపయోగించుకోవాలని సూచించింది. దీంతో మిగిలిన 2,752 పాఠశాలలకు సంబంధించి ఈ కార్యక్రమ నిర్వహణకు రూ.68.80 లక్షలు ఖర్చు అయింది. ఆ భారమంతా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడిందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వార్షికోత్సవాలకూ చిల్లిగవ్వ ఇవ్వలేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యా సంస్థల తరహాలో వార్షికోత్సవాలు నిర్వహించి విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించాలనేది ప్రభుత్వ యోచన. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో విధిగా వార్షికోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకూ ఖర్చుపెట్టి ఈ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఎలాగూ కొంత మొత్తాన్ని ప్రకటించింది కాబట్టి విద్యార్థులను ఉత్సాహపరచడానికి వారికి క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడానికి స్థానిక దాతల నుంచి కూడా కొంత మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించి ఆ తంతు ముగించారు. కార్యక్రమం ముగిసి నెల రోజులు గడిచినా దీనికి ఖర్చుపెట్టిన మొత్తానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో డబ్బులు వేసుకోవాల్సి వచ్చిందనేది ఉపాధ్యాయ సంఘాల వాదన. ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలను బలవంతంగా రుద్దడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. కొన్ని పాఠశాలలకే నిధులా! అమ్మకు వందనం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని ఆదేశాలిచ్చిన విద్యాశాఖాధికారులు కొన్ని పాఠశాలలకే నిధులు విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి? మూడు వేలకు పైగా పాఠశాలలుంటే కేవలం 545 పాఠశాలలకు మాత్రమే నిధులిచ్చారు. అవి ఏ ప్రాతిపదికన ఇచ్చారో స్పష్టం చేయాలి. వాటిలో కూడా కొన్ని పాఠశాలలకు ఇప్పటివరకూ నిధులు చేరలేదు. వెంటనే ఆ నిధులు సంబంధిత పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలి.–గుగ్గులోతు కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ -
కంటే కలలే కనాలి
మధ్యతరగతి జీవితానికి జీతం సరిపోదు.అయితే అరకొరా... ఇల్లాలి కొరకొరా.వనరులు పెంచుకోవాలంటే స్టార్స్ కనిపిస్తాయి.ఇక పెంచుకోదగ్గది... అలా పెంచుకునే వీలైనది ఒక్కటే ఒకటి... ఆశ.చుట్టూ కష్టాలు కనపడుతుంటే ఏం ఆశించగలం?అందుకే ఒక కునుకు తీయండి. ఒక కల కనండి. 1990ల కాలం అంటే అప్పటికి ఇందిరా గాంధీ చనిపోయింది. రాజీవ్‌గాంధీ ఓడిపోయాడు. వి.పి.సింగ్, అతని తర్వాత చంద్రశేఖర్... వీరి పాలనలో దేశం ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి గురించి చర్చలు జరుగుతున్నాయి. కాని అవకాశాలు ఎక్కడా లేవు. సంపద లేదు. సామాన్యుడు సూపర్‌స్టార్ అవడానికి వీలయ్యే పరిస్థితులు లేవు. సగటు మగాడి జీవితం జానా బెత్తెడుగా ఉంది. ఏదో ఒక పని చేయడం, భార్యాపిల్లలను పోషించుకోవడం, రాత్రిళ్లు ముడుచుకుని పడుకోవడం... పెద్ద పెద్ద కలలు కనేందుకు కూడా ఎవరూ సాహసం చేయని పరిస్థితి (దేశంలో 2000 సంవత్సరం తర్వాత ఆర్థిక సరళీకరణల ఫలితంగా ధనం అందుబాటులోకి రావడం, సాఫ్ట్వేర్ రంగం ఊపందుకోవడం, ఆ తర్వాతి కాలంలో అబ్దుల్ కలామ్ లాంటి వాళ్లు వచ్చి కలలు కనండి అని పిలుపు ఇవ్వడం మనకు తెలుసు. కాని 1990ల నాటికి కలలు కనడం కూడా ఖరీదైన వ్యవహారమే).ఇటువంటి సమయంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ సీరియల్ జనం తమ కష్టాలను కాసేపు నవ్వుకుని మర్చిపోయే వీలు కల్పించినట్టే చాలామంది సామాన్యులను మీకు కష్టాలు చుట్టుముడితే కళ్లు మూసుకొని కలల్లోకి వెళ్లండి... అక్కడైనా వాటిని తీర్చుకుని సేద తీరండి అని చెప్పింది.ఈ సీరియల్ ‘ముంగేరిలాల్’గా చేసిన రఘువీర్ యాదవ్ ట్రిపుల్ ఎం.ఏ చేశాడు. కాని ఉద్యోగం రాదు. అతడికి పిల్లనిచ్చిన మావ ఢిల్లీలో రికమండేషన్ చేసి ఏదో ప్రయివేటు కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంచుతాడు. ఇంట్లో భార్య, మామగారూ... ఆఫీసులో సాటి క్లర్కు, ఎప్పుడూ మేకప్ సరి చేసుకుంటూ పని ఎగ్గొట్టే లేడీ టైపిస్టూ, అవసరం లేకపోయినా చిందులు తొక్కే బాసు... వీరి మధ్య ముంగేరిలాల్ జీవితం మొదలవుతుంది.ముంగేరిలాల్ (అంటే ఇది మనవైపు సుబ్బయ్య వంటి ఒక కామన్ నేమ్) దుర్బలుడు. బలహీనంగా ఉంటాడు. భౌతికంగా కూడా అతడు హీరోగా జనం కళ్లకు ఆనడు. కాని అతడికి అదృష్టవశాత్తు ఒక జబ్బు ఉంది. నిలబడి కాని, పడుకుని కాని, ఆఫీసులో కాని, ఇంట్లో కాని అప్పటికప్పుడు కలల్లోకి వెళ్లిపోతాడు. ఆ క్షణంలో అతడి కుడి కన్ను, కుడి భుజం అదురుతాయి. ఆ తర్వాత కలలో క్షణాల్లో ప్రవేశిస్తాడు. ఆ కలల్లో తన నిజ జీవిత పాత్రలే మరో విధంగా తారసపడుతుంటాయి. ఆ పాత్రల మీద అతడు ఆధిపత్యం చెలాయిస్తుంటాడు.ఉదాహరణకు ఒక ఎపిసోడ్లో అతడి భార్య అతడితో సాయంత్రం ఊరిలోని కళాక్షేత్రంలో లతా మంగేశ్కర్ కచేరీ ఉందని దానికి వెళ్లే భాగ్యం తమకు లేదని వాపోతుంది. వెంటనే ముంగేరిలాల్ కలలోకి వెళ్లిపోతాడు. ఆ కలలో ముంగేరిలాల్ తన అసిస్టెంట్‌తో (నిజ జీవితంలో ఆఫీసులో టైపిస్ట్) కూచుని ఉంటాడు. హాల్ కిటకిటలాడుతుంటుంది. కాని లతా మంగేష్కర్‌కు ఏదో అవాంతరం వచ్చి కచేరీకి రాదు. నిర్వహాకుడు అంటే నిజ జీవితంలో ముంగేరిలాల్కు బాస్‌గా ఉన్న వ్యక్తి చాలా హైరానా పడుతుంటాడు. లతా రాకపోతే ప్రేక్షకులు పందిరి పీకి ఇల్లు కడతారని హడలిపోతాడు. ఇంతలో ఎవరో ఆ నిర్వాహకుడికి ఒక వార్త చెబుతారు. ప్రేక్షకుల్లో ముంగేరిలాల్ అనే మహా గానపండితుడు ఉన్నాడని ఆయన లతా మంగేష్కర్ కంటే గొప్పవాడని ఆయనను గనక బతిమిలాడుకుంటే ఆయన పాడితే గట్టెక్కేస్తామని చెబుతారు. అంతే. నిర్వాహకుడు వెళ్లి ముంగేరిలాల్ కాళ్ల మీద పడతాడు. ముంగేరిలాల్కు ఇది మొహమాటంగా ఉంటుంది. అరె.. నాకేదో నాలుగు ముక్కలు వస్తే ఏంటి మీరిలా ఇబ్బంది పెడతారు అన్నట్టుగా చూస్తాడు. కాని చివరకు స్టేజీ ఎక్కి అసిస్టెంట్‌తో కలిసి అద్భుతంగా పాటలు పాడి చప్పట్ల మోత మోగిస్తాడు. అలా ఇంట్లో ఉండే ముంగేరిలాల్ ఆ ఫంక్షన్ చుట్టి వస్తాడు.ముంగేరిలాల్ ఎపిసోడ్స్ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. పొందేది కూడా మంచి. మంచి కోరుకుంటూ కలలు కనడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిదే అని ఈ సీరియల్ చెబుతుంది. నిజ జీవితంలో నిస్పృహ కొంచెమైనా తీర్చుకోండి అని పిలుపు ఇస్తుంది.‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ 1990లో 13 ఎపిసోడ్లు ప్రసారం అయ్యింది. పెద్ద హిట్ అయ్యింది. ఇంట్లో పిల్లలూ పెద్దలూ హాయిగా ఆ సీరియల్‌ను చూశారు. ఆ పరంపర మన జానపదంలో కూడా ఉండటం వల్ల సులభంగా కనెక్ట్ అయ్యారు. పంచతంత్రంలో ఒక కుమ్మరి తాను మధ్యాహ్నం కునుకు తీస్తూ వందల కుండలు తయారు చేసి ఐశ్వర్యవంతుడు అయినట్టుగా భావించి కాలు తాటించి ఉన్న ఒక్క కుండనూ పగల గొట్టుకుంటాడు. అయితే అది పగటి కలలు చేటు అని చెప్పే కథ. ఇక్కడ మాత్రం పగటి కలలు పాజిటివ్ ఎనర్జీకి ఉపయోగపడతాయి అని చెప్పే కథ.రఘువీర్ యాదవ్ హీరోగా చేసిన తొలి సీరియల్ ఇది. ఈ సీరియల్‌తో అతడు దేశానికంతా పరిచయం అయ్యాడు. దీనికి ముందు ‘సలామ్ బాంబే’ సినిమాలో అతడు నటించినా జన సామాన్యానికి చేరువైంది ముంగేరిలాల్ తోనే.ఇక ఈ ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించింది నేటి ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘గంగాజల్’, ‘రాజనీతి’, ‘అపహరణ్’ వంటి భారీ రాజకీయ చిత్రాలు తీసే ప్రకాష్ ఝా తన కెరీర్ ప్రారంభంలో ఒక మధ్యతరగతి జీవనాన్ని సున్నిత హాస్యంతో తీయడం మంచి జ్ఞాపకం అనుకోవాలి. మన దగ్గర పూరీ జగన్నాథ్ కూడా తొలి రోజుల్లో సరదా సీరియల్స్ దూరదర్శన్ కోసం తీశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.1990లలో మధ్యతరగతి సంతోషాలను, చిన్నపాటి సంఘర్షణలను, ఒకరిలో మరొకరి పట్ల ఉండే ఆత్మీయతను ఆర్తిని సీరియల్స్‌గా తీసేవారు. ఇవాళ టీవీలో మధ్యతరగతి అనేది ఒకటి కనిపించకుండా పోయింది. అందరూ ఖరీదైన చీరలు నగలు పెట్టుకుని, మగవారైతే జుబ్బాలు దిగవిడుచుకుని కుట్రలు చేయడం ఎలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. వంట గదిలో మొగుడూ పెళ్లాల చిర్రుబుర్రులు, పిల్లల స్కూళ్ల ఎంపిక దగ్గర చర్చోపచర్చలు, అయినవారి పెళ్లి కానుక విషయంలో ఒకరితో మరొకరు పడే పేచీలు, ఇంట్లో పెద్దవారు ఉంటే వారితో పిల్లలు పడే గారాలు, ఆఫీసులో కలీగ్స్‌తో చిన్నపాటి స్నేహాలూ స్పర్థలూ ఇవి లేకుండా పోయాయి.జాతీయ చానళ్లలో లేవు.ప్రాంతీయ చానళ్లలో కూడా లేవు.అందుకే అందమైన మధ్యతరగతి జీవితం ఒక కలలా మిగిలింది.మనం కూడా పగలో, రాత్రో ఒక కల గని ముంగేరిలాల్ వలే ఆ జీవితాన్ని దర్శించి ఆనందిద్దాం. ఊరట చెందుదాం. ►ముంగేరిలాల్ ఎపిసోడ్స్ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. -
ఎవరి భూభాగంపై మేం కన్నేయలేదు: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర దేశాల వనరులు దోచుకోవడం, ఇతర భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం భారత్‌కు లేనేలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తన సామర్థ్యం పెంపొందించుకోవడం, వనరులను అభివృద్ధి చేసుకోవడంపైనే భారత్ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో జరిగిన మొదటి పీఐవో పార్లమెంటేరియన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభ సదస్సులో ప్రధాని మోదీ మంగళవారం ప్రసంగించారు. ‘ఇతరుల వనరులు దోచుకోవాలన్న ఉద్దేశంగానీ, ఇతరులు భాభాగంపై కన్నేయాలన్న ఉద్దేశం మనకు ఏనాడు లేదు. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వనరులను అభివృద్ధి చేసుకోవడంపైనే మన దృష్టి కేంద్రీకృతమైంది’ అని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో చైనాతో తరచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వనరుల ఖిల్లా జయశంకర్ జిల్లా
భూపాలపల్లి/ములుగు : ఆచార్య జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, అపారమైన అడవులు, బొగ్గు నిక్షేపాలు, థర్మల్ విద్యుత్ కేంద్రం, కాకతీయుల కాలం నాటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, గిరిజన దేవతల జాతర ఇక్కడి ప్రత్యేకత. భౌగోళికంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు, గోదావరి నదీతీరం కలిగి ఉండి 20 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో జిల్లా అవతరించింది. రాష్ట్ర కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం అభివృద్ధికి ఇక తిరుగులేదని చెప్పవచ్చు. సిరులు కురిపించే సింగరేణి భూపాలపల్లి మండలం కాశీంపల్లి గ్రామ సమీపంలో 1983 జూలై 15న అప్పటి ముఖ్యమంత్రి ఎ¯ŒSటీ.రామారావు కేటీకే–1 గని తవ్వకాలను ప్రారంభించారు. అప్పుడు 250 మంది కార్మికులతో బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు. ప్రస్తుతం కేటీకే–1, 2, 5, 6, లాంగ్వాల్ భూగర్భగనులు, ఒక ఓపె¯ŒSకాస్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి. కేటీకే–3 భూగర్భగని, కేటీకే ఓసీపీ–2, కేటీకే–5 స్థానంలో లాంగ్వాల్ ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. మొత్తం 25 డిపార్ట్మెంట్లతో కలిపి 6,619 మంది కార్మికులు, 171 మంది అధికారులు మొత్తం 6,790 మంది సింగరేణి ఉద్యోగులు, 960 అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నారు. అపారమైన బొగ్గు నిల్వలు మల్హర్ మండలం తాడిచర్ల నుంచి భూపాలపల్లిలోని కేటీకే–1 ఇంక్లై¯ŒS వరకు, గణపురం మండలంలోని లాంగ్వాల్ ప్రాజెక్ట్ నుంచి మల్యాలపల్లి వరకు, వెంకటాపూర్, పస్రా మండలాల్లో అపార బొగ్గు నిక్షేపాలున్నాయి. కొత్త గనుల తవ్వకాలు చేపట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసింది. సూపర్ పవర్ స్టేషన్ కేటీపీపీ గణపురం మండలం చెల్పూరు శివారు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ)లో 500, 600 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా సాగుతోంది. రెండు ప్లాంట్లలో అధికారులు, సిబ్బంది, కార్మికులు సు మారు 3 వేల మంది వరకు పని చేస్తుంటారు. సింగరేణి, కేటీపీపీలతో జిల్లా కేంద్రం పరిశ్రమల ఖిల్లాగా మారింది. బొగ్గు, గోదావరి నీరు, విద్యుత్ ఇక్కడ సమృద్ధిగా లభిస్తుండటంతో భవిష్యత్‌లో మరిన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పడనున్నాయి. విస్తీర్ణం, అడవుల్లో ఫస్ట్.. విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా అతి పెద్దది. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం 6175.21 చదరపు కిలో మీటర్లు ఉంటుంది. ఇక్కడ అటవీ ప్రాంతం నాలుగు లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ములుగు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలు, ఇటీవల చేరిన భద్రాచలం నుంచి చేరిన వాజేడు, వెంకటాపుం(ఎం), మంథని నియోజకవర్గంలోని కాటారాం, మహదేవపూర్, మల్హల్రావు, ముత్తారం, భూపాలపల్లిలో వేలాది కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. ఆధ్యాత్మిక శోభ జాతర మేడారం : ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ ఈ జిల్లాకు ప్రత్యేకం. మేడారం జాతరను 1967లో దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు 1968 నుంచి ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. జాతరను 1996 జనవరి 1న అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా భక్త జనుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2016లో సుమారు కోటి మంది భక్తులు వన దేవతల సన్నిధికి వచ్చారు. కాళేశ్వరం త్రివేణీ సంగమం దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ఈ జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలువనుంది. గోదావరి నది ఒడ్డున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు అత్యంత దగ్గరలో కాళేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయానికి మూడు రాష్ట్రాల భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగా లున్నాయి. ఒకటి కాలుడు(యముడు), ముక్తీశ్వరుడిగా(శివుడు) పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరినది, అంతర్వాహిణి నుంచి సరస్వతీ నదులు కలసిన చోట త్రివేణి సంగమంగా విరాజిల్లుతోంది. ఈ మూడు నదులకు పుష్కర కాలంలో మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పుష్కరాలు నిర్వహించడం మరో విశేషం. పర్యాటక అందాలకు నిలయం వెంకటాపురం మండలం పాలంపేట పరిధిలోని రామప్ప, గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామ పరిధిలో ని లక్నవరం సరస్సులు నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటాయి. ఇక్కడి ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించడానికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. వీటితో పాటు గణపురం మండలంలోని గణపసముద్రం, రేగొండలోని పాండవులగుట్టలు, తాడ్వాయి అడవుల్లోని వనకుటీరాలు, వాజేడు మండలంలోని బొగత జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. జాతీయ రహదారితో రవాణా సులువు సహజ వనరుల ఖిల్లాగా ఉన్న భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారితో మరింత అభివృద్ధి చెందనుంది. గుడెపహడ్ నుంచి భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాటారం నుంచి మహాముత్తారం మీదుగా మణుగూరు, కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మించడానికి ప్రభుత్వం యోచిస్తున్నది. జమ్మికుంట నుంచి భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వేలై¯ŒS ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కాళేశ్వరం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. ఇది పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు రాకపోకలు సులువై పలువు కానున్నాయి. వ్యవసాయానికి ఇరిగేషన్ దన్ను రామప్ప, లక్నవరం, మల్లూరు ప్రాజెక్టు, గణపసముద్రం కింద వేలాది ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మహదేవ్పూర్, మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయితే మహదేవపూర్, కాటారం, మల్హల్రావు, మహాముత్తారం మండల పరిధీలో, వెంకటాపురం(ఎ) పాలెం ప్రాజెక్టు, ప్రతిష్టాత్మక దేవాదుల(చొక్కారావు) ప్రాజెక్టు, గోవిందరావుపేట గుండ్లవాగు ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగు నీరందుతుంది. ఏటూరునాగారం గోదావరి నదీ పరవాహక ప్రాంతాలు మిరప పంటకు ప్రత్యేకం. మల్హర్ మండలంలో పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో ప్రాధాన్యత ఉంది. వీటితో పాటు జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయ పంటలు ప్రధాన పండిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతాలు గోదావరి నది కాటారం మండలం దామెరకుంట వద్ద ప్రారంభం అయి మహదేవపూర్ మండలం అన్నారం, కాళేశ్వరం, అంబట్పల్లి మీదుగా సుమారు 25 కిలో మీట ర్లు ప్రవహించి వాజేడు మండలం సరిహద్దుల నుంచి ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మంగపేట మీదుగా భద్రాద్రి జిల్లాలోకి అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడుతుంది. -
వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి
అర్వపల్లి : పాలకుల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మలో భాగంగా శుక్రవారం రాత్రి తిమ్మాపురంలో మన భూములు మనవే–మన వనరులు మనవే అనే నినాదంతో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన వనరులను బహుళజాతి కంపెనీలకు పాలకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వనరులను కాపాడుకోవడానికి అంతా కలిసి పోరాడాలన్నారు. బతుకమ్మ పండుగతో బహుజనులు ఏకం కావాలన్నారు. ఆడపిల్లలను ఎదగనివ్వాలని, మద్యాన్ని తరిమికొట్టాలని కోరారు. ఈసందర్భంగా ఆమె బతుకమ్మ పేర్చి ఆతర్వాత ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు జరిపారు. అనంతరం గ్రామ చావడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ రైతుకూలి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణదాసు, రాష్ట్ర నాయకులు మల్సూరు, బొమ్మకంటి కొమురయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆవుల నాగరాజు, తీగల పూలన్, పటేల్ మధుసూధన్‌రెడ్డి, సైదులు, మిడసనమెట్ల వెంకన్న, బైరబోయిన జానయ్య, బండి యాదయ్య, అంబటి సైదులు, రవి, కిరణ్ పాల్గొన్నారు. -
‘మురుగు’ నీటి బొట్టుని.. ఒడిసిపట్టు!
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న నీటి అవసరాలు.. తగ్గుతున్న వనరుల కారణంగా భవిష్యత్తులో పొంచిఉన్న నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కొనేందుకు ‘మురుగు నీటి శుద్ధి’కి అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉందని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వ్యక్తిగత వినియోగం, ఉత్పాదక, ఇంధన రంగాల్లో పెరిగిన డిమాండ్, సాగు అవసరాలకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా నీటి వినియోగంలో గణనీయ మార్పులు అవసరమన్నారు. ఇందులో భాగంగా మురుగు నీటి లభ్యతను వినియోగంలోకి తేవాలని స్పష్టం చేస్తున్నారు. పట్టణాలకు మంచి నీటి సరఫరాలో ఇస్తున్న ప్రాధాన్యతనే మురుగునీటి శుద్ధికి ఇవ్వాలని, ఈ నీటి వినియోగా న్ని సాగునీటి రంగానికి ముడిపెడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భూతాపం, భూగర్భ జలాల తగ్గుదల తీవ్రమవుతున్న నేపథ్యంలో మురుగు జల శుద్ధిపై హనుమంతరావు ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఆయన మాటల్లోనే.. మురుగు నీరు అమూల్యమే.. పట్టణాలకు మంచినీటి సరఫరా చేసినప్పుడు అందులో 80 శాతం మురుగు నీటి లభ్యత ఉంటోంది. ఈ నీరు అమూల్యమే. ఈ మురుగు జలాన్ని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ నీటిని నీటిపారుదల ప్రాజెక్టులుగా మలుచుకుని వ్యవసాయం చేయవచ్చు. హైదరాబాద్‌నే తీసుకుంటే ప్రస్తుత ం తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్న నీటిలో 18 టీఎంసీల మేర మురుగు ద్వారా లభిస్తోంది. దీనికి కొత్తగా కృష్ణా ఫేజ్-3(5 టీఎంసీలు), గోదావరి ఫేజ్-1(10 టీఎంసీ) ద్వారా మొత్తంగా 15 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ జరుగుతోంది. ఈ నీటిలో 80 శాతం అంటే 12 టీఎంసీలు మురుగు నీటిగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఒక్క హైదరాబాద్‌లోనే 30 టీఎంసీల మురుగు నీటి లభ్యత ఉంది. దీనికి అదనంగా గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పూర్తయితే మరో 20 టీఎంసీల మంచినీటి సరఫరా జరిగితే అందులోనూ 16 టీఎంసీల మురుగు జలాల లభ్యత ఉంటుంది. అంటే భవిష్యత్తులో మొత్తంగా 46 టీఎంసీల మురుగు లభ్యత ఉంటుంది. అయితే ఇప్పటి వరకు లభ్యత ఉన్న 30 టీఎంసీల మురుగు నీటిలో కేవలం 8 టీఎంసీలనే రాష్ట్ర ప్రభుత్వం శుద్ధి చేస్తోంది. మరో 22 టీఎంసీల నీటి శుద్ధికి ప్రాధాన్యతనిచ్చి శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్యానికి భంగమే.. మురుగు నీటి శుద్ధికి కేంద్రాన్ని, జైకాని ప్రభుత్వం నిధులు కోరినా ఆశించిన స్పందన లేదు. దీంతో శుద్ధి చేయకుండానే నీరు వెళ్లిపోతోంది. ఈ నీటిని వాడుకుంటూ అక్కడక్కడ గడ్డి, ఇతర కూరగాయల సాగు జరుగుతోంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దృష్ట్యా మురుగు నీటి శుద్ధిని సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా చేసి నీటిపారుదలకు వినియోగించుకోవాలి. మొత్తంగా 30 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేగలిగితే నల్లగొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న ప్రక్రియలో ఎక్కడా డ్యామ్, రిజర్వాయర్ వంటి హెడ్‌వర్క్స్ లేవు. అంతా పైప్‌లై న్ ద్వారానే జరుగుతోంది. కావున నీటి పారుదల రంగానికి ఈ నీటిని మళ్లించే క్రమంలో నీటి శుద్ధి ప్లాంట్‌నే హెడ్వర్క్స్గా మలుచుకోవాలి. దానికి కావాల్సిన కాల్వలను నీటిపారుదల రంగంలో భాగంగానే నిర్మించాలి. అప్పుడు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టదు. మొత్తంగా శుద్ధి ప్లాంట్లకు రూ. 2,773 కోట్లు, కాల్వలకు రూ. 1,227 కోట్లు కలిపి మొత్తంగా రూ. 4 వేల కోట్లు వ్యయమవుతుంది. ఈ నిధుల ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరివ్వగలిగితే ఎకరాకు రూ.1.3 లక్షలు ఖర్చు చేసినట్లవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద ఎకరాకు రూ. 3 లక్షలు ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ విధానానికి సీడబ్ల్యూసీ, పర్యావరణ, అటవీ అనుమతులు అక్కర్లేదు. మురుగు జలాల లభ్యత ఎక్కువగా ఉన్న వరంగల్, నిజామాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖ, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి పట్టణాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసి సాగునీటికి ఊతం ఇవ్వవచ్చు. -
14 వేల మెగావాట్ల విద్యుత్‌పై ప్రభుత్వ దృష్టి
- సంప్రదాయేతర వనరుల ద్వారా ఉత్పత్తికి ప్రణాళిక - ఈ నెల 12న పునరుత్పాదక విధానంపై ప్రకటన ముంబై: సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో సంప్రదాయేత రఇంధన వనరుల ద్వారా 14,400 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మే 12న ఇందుకు సంబంధించి కొత్త పునరుత్పాదక శక్తి విధానాన్ని ప్రకటించనుంది. ఈ విధానం ద్వారా సౌర, పవన విద్యుత్ ఉత్పాదకాలకు ఊతమిచ్చినట్టవుతుంది. సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యం నిర్దేశించారని ఇంధన శాఖ మంత్రి చంద్రశేఖర్ బవన్కులే చెప్పారు. ఇందులో సౌర శక్తి ద్వారా 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. (ఒక గిగావాట్= 1,000 మెగా వాట్లు). ‘ప్రస్తుతం సంప్రదాయేత ఇంధన వనరుల ద్వారా 6,155 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ప్రభుత ్వం వచ్చే ఐదేళ్లలో 14,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది’ అని చెప్పారు. సంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే కాలుష్యం జరగదని అందుకే ప్రభుత ్వం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. 2008లో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విధానాన్ని రూపొందించిందని, అది 2013లో ముగిసిపోయిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధమైన సోలార్ విధానం లేదని చెప్పారు. ఈ 14,400 మెగావాట్లలో 7,500 మెగావాట్లు సౌరశక్తి ద్వారా, మిగిలిన 5,000 మెగావాట్లు పవన శక్తి ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. చెరకు పిప్పి ద్వారా 1,000 మెగా వాట్లు, ఇతర చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. వ్యవసాయ వ్యర్థాల ద్వారా మరో 300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. -
ప్రత్యామ్నాయ వనరులందించే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్!
ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు వనరులు అదేస్థాయిలో తరిగిపోతున్నాయి. ఫలితం.. కరవు కాటకాలు, ఆకలి, పేదరికం, యుద్ధాలు, అశాంతి వంటి సామాజిక రుగ్మతలు పంజా విసురుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు భయానకమే. ఈ నేపథ్యంలో మానవుడు చేయాల్సింది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను కాపాడుకోవడం, ప్రత్యామ్నాయ వనరులను తయారు చేసుకోవడం. ఈ రెండూ ఏకకాలంలో జరగాలి. భూగర్భంలో నీరు, చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి విలువైన వనరులు తగ్గిపోతుండడంతో ప్రత్యామ్నాయాలపై ఇప్పటికే పరిశోధన ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వనరులను, పర్యావరణ హితమైన వస్తువులను ప్రజలకు అందించేవారే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అన్నిదేశాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో హరిత వ్యాపారవేత్తలకు అవకాశాలు పెరుగుతున్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం: అంతరిస్తున్న పచ్చదనం, పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత వంటి కారణాలతో జనం ఆలోచనల్లో మార్పు వస్తోంది. పర్యావరణ హితమైన వస్తువుల వాడకంపై అవగాహన పెరుగుతోంది. దీంతో గ్రీన్ బిజినెస్ ఊపందుకుంటోంది. కరెంటు కోతల నేపథ్యంలో సౌరశక్తి వినియోగం పెరుగుతోంది. సోలార్ పరికరాలకు, పర్యావరణ హిత వస్తువులకు అధిక డిమాండ్ ఉంది. వీటిని రూపొందించే సంస్థల్లో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దేశ విదేశాల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కెరీర్ ప్రారంభిస్తే.. ప్రస్తుతం అవకాశాలకు కొదవే లేదు. ఔత్సాహికులకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందుతోంది. కావాల్సిన నైపుణ్యాలు: గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వ్యాపార నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. తమ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించేందుకు, లావాదేవీలు నిర్వహించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. నిత్య అధ్యయనమే ఇందుకు మార్గం. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఉండాలి. పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ వనరుల తయారీపై ఆసక్తి అవసరం. ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేందుకు మెరుగైన మార్కెటింగ్ నైపుణ్యాలు ఉండాలి. అర్హతలు: భారత్‌లో పలు విద్యాసంస్థలు పర్యావరణ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం బిజినెస్ స్కూళ్లలో కోర్సులు ఉన్నాయి. ఎంబీఏలో స్పెషలైజేషన్లుగా వీటిని అందిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైనవారు ఆయా కోర్సుల్లో చేరొచ్చు. వేతనాలు: హరిత వ్యాపారవేత్తలు తమ వ్యాపార ఆలోచనలను అమల్లో పెట్టి ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో నెలకు కనీసం రూ.30 వేలకుపైగానే ఆర్జించే వీలుంది. వినూత్నమైన ఆలోచనలతో మార్కెట్లోకి ప్రవేశిస్తే ఆదాయానికి హద్దే ఉండదు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in/ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.ceeindia.org/ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎంలు), వెబ్సైట్: www.iimcal.ac.in/,www.iimahd.ernet.in/, www.iimb.ernet.in/ www.iiml.ac.in/ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ -న్యూఢిల్లీ. వెబ్సైట్: www.imi.edu/ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ. వెబ్సైట్: http://fms.edu/ ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్-అహ్మదాబాద్. వెబ్సైట్: www.mica.ac.in/ డీఎస్సీ సోషల్ మెథడ్సలోని ‘బోధన లక్ష్యాలు - స్పష్టీకరణాలు’ పాఠ్యాంశం నుంచి అడిగే ప్రశ్నల సరళిని వివరించండి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? - కె. మాళవిక, దిల్సుఖ్నగర్ గత డీఎస్సీ పరీక్షలో ఆశయం, లక్ష్యం, స్పష్టీకరణాలపై విషయ అవగాహనను పరీక్షిస్తూ ప్రశ్నలు అడిగారు. కాబట్టి అభ్యర్థులు మెథడాలజీలో ఉన్న అంశాలను పాఠ్య విషయంలోని అంశాలతో అనుసంధానం చేస్తూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు గత పరీక్షలో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: ఇటీవల ఏర్పడిన తుఫానులు ఏ వర్షపాతానికి ఉదాహరణ అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు మాపనం చేయదల్చుకున్న లక్ష్యం? సమాధానం: అవగాహన. మెథడాలజీలోని లక్ష్యాలు - స్పష్టీకరణాలతో పాటు కంటెంట్‌ను కూడా అవగాహన చేసుకోవాలనే విషయం పై ప్రశ్న ద్వారా అర్థం అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఏడు లక్ష్యాలు, ఆ లక్ష్యాల్లోని నిర్దిష్ట లక్ష్యాలు, 66 స్పష్టీకరణాలను ఉదాహరణల పూర్వకంగా చదవడం వల్ల ‘లక్ష్యాలు - స్పష్టీకరణాలు’ పాఠ్యాంశంలో పట్టు సాధించవచ్చు. ఇన్పుట్స్: డాక్టర్ ఎస్.ఎస్.మోజెస్, సీనియర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో పీజీ పాట్నాలోని డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్.. పీజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఇన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ 2013-14 స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 25 వెబ్సైట్: www.dmi.brlps.in పీజీ డిప్లొమా బెంగళూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపీఎం).. పీజీ డిప్లొమాలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. క్యాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2015 వెబ్సైట్: www.iipmb.edu.in ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్.. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజి డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విభాగాలు: ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ (10+2+3) ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్ స్కోరు అవసరం. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30 వెబ్సైట్: http://www.spjimr.org పీహెచ్డీ ప్రోగ్రామ్ భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్.. పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీహెచ్డీ అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్ విభాగం: మేనేజ్మెంట్ అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5 వెబ్సైట్: w3.ximb.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే 2015 అకడమిక్ సెషన్‌కు సంబంధించి గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కు దరఖాస్తులు కోరుతోంది. ఆక్స్ఫర్డ్- అండర్సన్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ అర్హతలు: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో చేరినవారు అర్హులు. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేది: జనవరి 23, 2015 వెబ్సైట్: http://www.ox.ac.uk -
పడకేసిన పాలన
విశాఖ రూరల్/నర్సీపట్నం రూరల్: కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. గ్రామాల్లో అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. పంచాయతీకి నిధులు అరకొరగా రావడం.. పన్నుల వసూళ్లు సక్రమంగా జరగకపోవడం.. ఆదాయ వనరులు లేకపోవడం.. కారణంగా గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. పంచాయతీల్లో చిల్లిగవ్వ లేక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. మౌలిక సదుపాయల కల్పన పనులు ఏ విధంగా చేపట్టాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. రెండేళ్ల పాటు ప్రత్యేక పాలనలో మగ్గిన పంచాయతీల్లో గతేడాది ఆగస్టు 2న కొత్త సర్పంచ్‌లు కొలువుతీరారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పన్నుల ద్వారా వచ్చే ఆర్థిక వనరులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచ్‌లు భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడం.. ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు ఇవ్వకపోవడం.. పన్నులు వసూళ్లు మందగించడంతో గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. పంచాయతీల్లో నిధుల లేమి! గ్రామాల్లో అభివృద్ధి పనులకు అరకొరగా నిధులు మంజూరవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.1.34 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. తలసరి గ్రాంటుగా రూ.15.34 లక్షలు, వృత్తిపన్ను కింద రూ.55.64 లక్షలు, 13వ ఆర్థిక సంఘ నిధులు రూ. 4.32కోట్లు గతంలో మంజూరయ్యాయి. వీటితో పాటు రూ. 1.69లక్షలు సర్పంచ్ల జీత భత్యాలు కింద వచ్చాయి. దీర్ఘకాలంలో అభివృద్ధిదూరంగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు. పన్నుల వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం. దీంతో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఏజెన్సీలోని పంచాయతీల పరిస్థితి మరిరీ దయనీయం. ఒకటి, రెండు శాతం పన్నులు వ సూలుకావడమే గగనమవుతోంది. పేరుకు పోతున్న పన్ను బకాయిలు జిల్లాలో 925 పంచాయతీలకు 410 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కొక్కరికీ రెండు, మూడు పంచాయతీలను అప్పగించారు. ఫలితంగా వన్నుల వసూళ్లు మందగించాయి. వసూలు కావాల్సిన వాటి కంటే పాత బకాయిలు అధికంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా పన్నుల బకాయిలు రూ.14.24 కోట్లు ఉండగా, 2013-14కు సంబంధించి రూ.11.23 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. దీని ప్రకారం ప్రతీ ఏటా కనీసం 30 శాతం కూడా పన్నుల రాకపోవడంతో ఎరియర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఎరియర్స్ రూ.14.24 కోట్లకు గాను గతేడాది డిసెంబర్ వరకు రూ.5.06 కోట్లు వసూలైంది. ఇంకా రూ.9.17 కోట్లు రావాల్సి ఉంది. ఈఏడాదితో కలిపి మొత్తం రూ.17.17 కోట్లు బకాయిలు ఉన్నాయి. పాలకవర్గాలకు అన్నీ సవాళ్లే సర్పంచ్‌లుగా కొలువు తీరిన నాటి నుంచి వారిని వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. ఖజానా కూడా మూతపడడంతో నిధులు ఖర్చుచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత వరుసగా ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో ఎన్నికల కోడ్ ఒకవైపు, నిధుల ఫ్రీజింగ్ మరోవైపు ఉండడంతో ఉన్న కాస్త నిధులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో పగ్గాలు చేపట్టిన కొత్త పాలకవర్గాలకు నిరాశే మిగిలింది. -
వనరులు ఉన్నాయి.. ముందుకు సాగండి
కలెక్టరేట్: నిజామాబాద్ వ్యవసాయాధారిత జిల్లా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పునాది బాగుంటే మనం నిర్మించుకునే కట్టడం కూడా తరతరాలుగా బాగుంటుందని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణ కేంద్రంలో ఆయన జిల్లా కలెక్టర్, ముఖ్య అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో ఆపార అనుభమున్న మంత్రి కూడా సంబంధిత శాఖకు ఉండటం మంచిదన్నారు. ఆయన దగ్గర వ్యవసాయానికి సంబందించిన సలహలు, సూచనలు స్వీకరించి వ్యవసాయానికి పెద్ద పీట వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచాలని పిలుపునిచ్చారు. అక్రమాలపై దృష్టి పెట్టండి తెలంగాణలో ఉన్న పది జిల్లాలలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక క్షేత్ర స్థాయి నుంచి పనులు మొదలు పెట్టడమే కావాలని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ముందు శ్రీకారం చుట్టాలన్నారు. పంటలు, సాగునీరు, కరెంట్, ఇండ్ల నిర్మాణాలు, సీసీ, మెటల్ రోడ్లు, రోడ్లు,డ్రైనేజి, తాగు నీటి పథకాలు, పాఠశాలలు మరింత పటిష్ట పరుచడానికి అధికారులు కృషి చేయాలన్నారు. మండల స్థాయిలో, మున్సిపాలిటి కేంద్రాల పటిష్టతకు చర్యలు తీసుకోవా లని సూచించారు. క్షేత్ర స్థాయిలో పనులు నిలిచి పోతే అబివృద్ధి కుంటు పడుతుందన్నారు. అర్హులకు రేషన్ కార్డులు అందించాలన్నారు. ఇప్పటి వరకు బోగస్ కార్డుల ద్వారా బియ్యం తిన్నా వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల వ్యవహారం ఎక్కువగా ఉందని, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నందున రేషన్ బియాన్ని రీసైక్లింగ్ చేస్తూ అమ్ముకుంటున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లు, రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లర్లపై రికవరీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలన్నారు. జిల్లాలో హౌజింగ్ అక్రమాలుంటే గుర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి పోచారాం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వర్రావు, ఆర్డిఓలు, జిల్లా అదికారులు పాల్గొన్నారు. -
ఇతర నగరాల్లో రియల్ దూకుడు!
అభివృద్ధిలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏకైక ఆశాదీపం... పరిశ్రమలతో నిండిన విశాఖే. సింగపూర్‌ను పోలిన వనరులు, సౌకర్యాలూ ఇక్కడున్నాయి. చుట్టూ సముద్రం, భారీ నౌకలు కూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు, చమురు కంపెనీలు, షిప్‌యార్డ్, విమాన సేవలు, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు, వేల కోట్ల ఫార్మా ఎగుమతులు, ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు, ఏడాది పొడవునా బారులు తీరే పర్యాటకులు ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం అంటే. ఏడాదిగా విశాఖలో స్థిరాస్తి ధరల్లో కనీసం 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని క్రెడాయ్ విశాఖపట్నం సెక్రటరీ కోటేశ్వరరావు చెప్పారు. 2006లో రూ.25 వేలున్న గజం స్థలం ధర ఇప్పుడు రూ.50 వేలకు పైగానే పలుకుతోందని పేర్కొన్నారు. సిటీ నుంచి 15 కి.మీ. దూరంలో ఉండే మధురవాడ, ఎండాడ, మురళీనగర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,500గా, నర్సింహానగర్, అక్కయపాలెం, అబీద్‌నగర్ వంటి ప్రాంతాల్లో రూ.3,500లు, బీచ్‌రోడ్, బాలాజీనగర్, పాండురంగాపురం వంటి ప్రాంతాల్లో రూ.4000గా ఉందని తెలిపారు. అయితే రాజకీయ అనిశ్చితి కారణంగా విశాఖలో ధరలు పెరిగాయని, మరో ఆరేడు నెలల్లో ధరలు స్థిరపడే అవకాశముందని ఆయన చెప్పారు. ఐటీ జోరు.. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి ఎలాంటి ఢోకాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఐటీ పెట్టుబడులు వచ్చేది విశాఖకే. ఇప్పటికే ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, 90 ఫార్మా కంపెనీలున్నాయి. వీటి వార్షిక టర్నోవర్ ఏటా రూ.1,450 కోట్లుగా ఉంది. ప్రత్యేక హోదా కారణంగా భారీస్థాయిలో పన్ను మినహాయింపులు లభిస్తాయని కనుక కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. మరో 50 కంపెనీలు విశాఖకు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రుషికొండలో మూడు ఐటీ సెజ్‌లు ఏర్పాటు కానున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధికి ఢోకాలేదు.. విశాఖ నుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు ఆధారిత కంపెనీలు భారీగా రానున్నాయి. పది మండలాల్లో విస్తరించనున్న ఈ జోన్లో వివిధ కంపెనీలు రానున్నాయి. పీసీపీఐఆర్ కంపెనీలకు పన్ను రాయితీలు వర్తిస్తుండగా ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్ పెరగనుంది. వైజాగ్, గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి, భీమిలిలోనూ పోర్టులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. సిటీ నుంచి 20 కి.మీ. దూరంలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భవనాలూ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే అటవీ భూమిని సైతం డీ నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందువల్ల మరో 5 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. పారిశ్రామిక రాజధాని.. ‘విశాఖపట్నం’ జనాభా: 21 లక్షలు విస్తీర్ణం: 550 చ.కి.మీ. ఐటీ, ఫార్మా కంపెనీలు: 160 ఎస్ఈజెడ్లు: 4, పోర్టులు: 2 స్థిరాస్తి ధరలు 40 శాతం వరకూ పెరిగాయి {పాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2,000 నుంచి రూ.4,000 వరకూ ఉంది. -
వనరులుంటే ప్రాజెక్టులు చేపట్టవచ్చు గవర్నర్ శంకర్ నారాయణన్
ముంబై: వనరులు అందుబాటులో ఉంటే కొత్త నీటిపారుదల ప్రాజెక్టులను రాష్ట్ర సర్కార్ స్వేచ్ఛగా చేపట్టుకోవచ్చని గవర్నర్ కె.శంకర్ నారాయణన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన ఇంజీనీర్లకు నగరంలో గురువారం జరిగిన సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్కార్ చేపట్టే కొత్త ప్రాజెక్టులను గవర్నర్ ఆపుతారనే ప్రశ్నే లేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై రోజువారీ సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా దృష్టి సారించాలని సర్కార్‌కు ఆయన సలహా ఇచ్చారు. అన్ని విభాగాలతోని అనుసంధానమై ఉండే మౌలిక వసతులపై కచ్చితమైన ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లాలని అన్నారు. ఇలాంటివి గుర్తించడం వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం సులభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, నీటిపారుదల శాఖ మంత్రి సునీల్ తట్కరే, ప్రజా పనుల విభాగ మంత్రి జయదత్ క్షీర్సాగర్, నీటి పారుదల, పరిశుభ్రత శాఖ మంత్రి దిలీప్ సొపల్, గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజేంద్ర గవిత్ పాల్గొన్నారు.