వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి
వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి
Published Fri, Oct 7 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
అర్వపల్లి : పాలకుల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మలో భాగంగా శుక్రవారం రాత్రి తిమ్మాపురంలో మన భూములు మనవే–మన వనరులు మనవే అనే నినాదంతో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన వనరులను బహుళజాతి కంపెనీలకు పాలకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వనరులను కాపాడుకోవడానికి అంతా కలిసి పోరాడాలన్నారు. బతుకమ్మ పండుగతో బహుజనులు ఏకం కావాలన్నారు. ఆడపిల్లలను ఎదగనివ్వాలని, మద్యాన్ని తరిమికొట్టాలని కోరారు. ఈసందర్భంగా ఆమె బతుకమ్మ పేర్చి ఆతర్వాత ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు జరిపారు. అనంతరం గ్రామ చావడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ రైతుకూలి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణదాసు, రాష్ట్ర నాయకులు మల్సూరు, బొమ్మకంటి కొమురయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆవుల నాగరాజు, తీగల పూలన్, పటేల్ మధుసూధన్‌రెడ్డి, సైదులు, మిడసనమెట్ల వెంకన్న, బైరబోయిన జానయ్య, బండి యాదయ్య, అంబటి సైదులు, రవి, కిరణ్ పాల్గొన్నారు.
Advertisement