
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర దేశాల వనరులు దోచుకోవడం, ఇతర భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం భారత్‌కు లేనేలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తన సామర్థ్యం పెంపొందించుకోవడం, వనరులను అభివృద్ధి చేసుకోవడంపైనే భారత్ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు.
న్యూఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో జరిగిన మొదటి పీఐవో పార్లమెంటేరియన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభ సదస్సులో ప్రధాని మోదీ మంగళవారం ప్రసంగించారు. ‘ఇతరుల వనరులు దోచుకోవాలన్న ఉద్దేశంగానీ, ఇతరులు భాభాగంపై కన్నేయాలన్న ఉద్దేశం మనకు ఏనాడు లేదు. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వనరులను అభివృద్ధి చేసుకోవడంపైనే మన దృష్టి కేంద్రీకృతమైంది’ అని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో చైనాతో తరచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.