దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కొనియాడారు.
- గాంధీభవన్‌లో ఇందిరాగాంధీ 97వ జయంతిలో పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కొనియాడారు. ఇంది రాగాంధీ 97వ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరిక నిర్మూలన , దేశాభి వృద్ధి విషయంలో ఇందిరాగాంధీ విధానాలనే ప్రపంచంలోని సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాలు అనుసరించాయని పేర్కొన్నారు. అంతకు ముందు పొన్నాల నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.