పోషించలేక.. విక్రయానికి
బాలుడిని బాల సదనం చేర్చిన అధికారులు
ఇందూరు : పేదరికం కారణంగా ఓ తండ్రికి కుమారుడు భారమయ్యాడు. అతడిని పోషించే మార్గం కానరాక.. విక్రయానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని బాలసదనానికి చే ర్చారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన రాజుకు చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు రెండేళ్ల కుమారుడితో పాటు మతి స్థిమితం లేని భార్య ఉంది.
పేదరికం కారణంగా కుమారుడిని ఎలా పోషించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. ఆరోగ్యం, ఆర్థి క పరిస్థితి సహకరించకపోవడం తో బాలుడిని అమ్మాలని నిర్ణయిం చుకున్నాడు. కాలూరు రోడ్డు శివారులో నివసించేవారికి విషయం తెలిపాడు. వారు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ విభాగం సిబ్బంది జ మ్రు, బాబు, గంగామోహన్, నిజామాబాద్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
తండ్రితో పాటు బాలుడిని సుభాష్‌నగర్‌లోని బాల సదనానికి తరలించారు. రాజుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తన భార్యకు మతి స్థిమితంలేదని, కుమారుని తరచూ కొడుతుందని అతడు పేర్కొన్నాడు. కుమారుడిని పో షించే శక్తి లేకపోవడంతో అమ్మాల నుకున్నానని, ఎవరైనా దత్తత అడిగినా ఇవ్వాలనుకున్నానని తెలిపాడు. ఇతరులకు అప్పగిస్తే వారైనా బాగా చూసుకుంటారని భావించానంటూ కన్నీరుపెట్టాడు. తన కుమారుడిని పెంచి, మంచి భవిష్యత్ ఇవ్వాలని అధికారులను కోరాడు.