ముంబై : పేదరికం, నిరక్షరాస్యత , లక్షలాది పిల్లలను బలి తీసుకుంటున్నాయని యూనిసెఫ్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 2030 కల్లా 69 లక్షల మంది పిల్లలు 5 ఏళ్ల లోపు చనిపోతారని, 1.67 కోట్ల మంది పిల్లలు పేదరికంతో బాధపడతారని తెలిపింది. అలాగే 7.5 కోట్ల బాల్యవివాహాలు జరుగుతాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఈ సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చింది.
దీన్ని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ముంబైలో విడుదల చేశారు. ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు పిల్లల అవసరాలను తీర్చడానికి ప్రయత్నించడం లేదని, పేదరికం నుంచి వారిని బయటపడేసి, వారిని పాఠశాలకు వెళ్లేలా చూడాలని యూనిసెఫ్ కోరింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.24 కోట్ల మంది పిల్లలు ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను అభ్యసించడం లేదని నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లలను ఆదుకోండి: యూనిసెఫ్
Published Tue, Jul 5 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement