ఆక్రా: ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి ప్రపంచ సంస్థల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నొక్కిచెప్పారు. కాలం చెల్లిన విధానాలను అనుసరిస్తున్న ఈ సంస్థలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేవన్నారు. ఘనా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సోమవారం ఘనా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్, సోషల్, ఎకనమిక్ రీసెర్చ్‌కు చెందిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
నేటి ప్రపంచ అవసరాలను రెండో ప్రపంచయుద్ధం ముగిసిన నేపథ్యంలో 1945లో ఏర్పాటు చేసిన ఐరాస తీర్చలేదని అన్నారు. ఐరాస ఏర్పాటైనప్పుడు కొన్ని దేశాలే సభ్యులుగా ఉన్నాయని, అయితే రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ఐరాసలో కీలకపాత్ర లేకుండా పోయిందన్నారు. ఘనా పర్యటన ముగించుకుని ప్రణబ్ ఐవరీ కోస్ట్ చేరుకున్నారు.
ప్రపంచ సంస్థల్లో సమూల మార్పులు అవసరం: ప్రణబ్
Published Wed, Jun 15 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement