గతేడాది పారిస్‌లో చేసుకున్న పర్యావరణ ఒప్పందానికి ఆదివారం భారత్ ఆమోదం తెలిపింది.
న్యూయార్క్: గతేడాది పారిస్‌లో చేసుకున్న పర్యావరణ ఒప్పందానికి ఆదివారం భారత్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన ఒప్పందం ఆమోద ప్రతిని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ యూఎన్ ఒప్పందాల విభాగ చీఫ్ విల్లపాండోకు అందజేశారు. మహాత్మాగాంధీ 147వ జయంతి సందర్భంగా యూఎన్ అధికారులు, దౌత్యవేత్తలతో కలసి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దీన్ని అందించారు.
ఈ ఒప్పందం వల్ల వాతావరణంలో కీలక మార్పులకు తొలి అడుగుపడనుందని, ఒప్పందంపై ప్రపంచదేశాలను ఏకం చేయటంలో భారత్ కీలకంగా వ్యవహరించిందని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ప్రశంసించారు. ప్రపంచ మూడో అత్యధిక కర్బన ఉద్గార దేశంగా ఉన్న భారత్.. అహింసా దినోత్సవం నాడు ఒప్పంద పత్రాన్ని అందించడం అద్భుతమన్నారు.