‘ఈ–పోస్’ పనితీరును పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం
ఆగిరిపల్లి :
మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో ఈ–పోస్ మిషన్ల పనితీరును ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గౌసియాబేగం, తహసీల్దార్ సీహెచ్ ఉమామహేశ్వరరావును పింఛన్ల పంపిణీ చేసే విధానం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ అమలు జరుగుతున్న తీరు, రేషన్ పంపిణీ విధానం, ఎరువుల దుకాణాల్లో పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్రం సెంటర్‌లో గల ఎరువుల దుకాణంలో ఈ–పోస్ విధానం ద్వారా ఎరువుల పంపిణీని దుకాణదారుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు సునీతచోప్రా, వసుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారిణి బి.త్రివేణి, ఏపీవో రాజు, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.