క్లీన్ ఎనర్జీకి ప్రపంచ బ్యాంక్ రుణం
సోలార్ ప్రోగ్రామ్‌కు 625 మి. డాలర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వపు గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌కు ప్రపంచ బ్యాంక్ సాయమందిస్తోంది. ఇందుకు సంబంధించి 625 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి ప్రపంచ బ్యాంకు బోర్డు అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో కనీసం 400 మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవోల్టిక్ ఏర్పాటు జరగనున్నది. ప్రపంచ బ్యాంక్ బోర్డు దీనితోపాటు 120 మిలియన్ డాలర్ల కో-ఫైనాన్సింగ్ లోన్‌కు, క్లైమెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు చెందిన క్లీన్ టెక్నాలజీ ఫండ్ నుంచి 5 మిలియన్ డాలర్ల గ్రాంట్‌కు కూడా ఆమోద ముద్ర వేసింది.