
ఆధార్‌తో ఏటా 6,700 కోట్లు ఆదా: ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: ఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)ఆదా అవుతాయని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఆధార్ డిజిటల్ గుర్తింపు కార్డ్ వల్ల అవినీతి తొలగి ఈ స్థాయిలో ప్రభుత్వానికి సొమ్ములు ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పారు. వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2016: డిజిటల్ డివిడెండ్స్ పేరుతో ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికను విడుదల చేస్తూ బసు ఈ విషయాలు వెల్లడించారు.