
ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డైరెక్టర్‌గా జునైద్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డైరెక్టరుగా జునైద్ అహ్మద్ నియమితులయ్యారు. ఒన్నో రుహల్ నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో అతని స్థానంలో అహ్మద్‌ను నియమించారు. అహ్మద్ బంగ్లాదేశ్ జాతీయుడు. అహ్మద్ సమర్థవంతంగా పనిచేయగలడని ప్రపంచ బ్యాంక్ గ్రూపు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని పేర్కొన్నారు. అహ్మద్ 1991లో ప్రపంచ బ్యాంకులో చేరారని, అనేక విభాగాల్లో ఆయన పనిచేశారని ఆయన వివరించారు