
'ఇలాగే వదిలేస్తే 2030నాటికి పెనుప్రమాదం'
వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి ప్రపంచ బ్యాంకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ దేశాలు ఈ విషయంలో దృష్టి సారించకుంటే చాలామంది జీవితాలు పేదరికంలో నెట్టినట్లే అవుతుందని స్పష్టం చేసింది.
న్యూయార్క్: వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి ప్రపంచ బ్యాంకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ దేశాలు ఈ విషయంలో దృష్టి సారించకుంటే చాలామంది జీవితాలు పేదరికంలో నెట్టినట్లే అవుతుందని స్పష్టం చేసింది. 2030నాటికి ఇలాగే కొనసాగితే దాదాపు పది కోట్ల మంది పేదరికంలో కూరుకుపోవడం ఖాయం అని తీవ్రంగా హెచ్చరించింది. సముద్ర మట్టాలను, వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీత మార్పులను గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను ప్రపంచ దేశాలు పట్టించుకోవాలని, దీనిని రక్షించుకునేందుకు ఒక స్పష్టమైన ఒప్పందానికి వచ్చి దాని మేరకే నడుచుకోవాలని స్పష్టం చేసింది.
వాతావరణంలో సంభవిస్తున్న మార్పులపై ప్రపంచ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది సెప్టెంబర్ లో లక్ష్యంగా పెట్టుకున్న 17 అంశాల్లో ప్రపంచ దేశాల్లో పేదరికం రూపుమాపడమనేది కీలక అంశం అని, గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం నెరవేరడం అస్సలు సాధ్యం కాదని, బడుగుల జీవితంపై అది తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా కొత్తగా పేదవాళ్లను సృష్టిస్తుంది. ఇది ఓ రకంగా 2030నాటికి ఇదొక ఉపద్రవంగా పరిణమించే అవకాశం ఉందని కూడా ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది.