బాబొస్తే బతకలేం...
ప్రపంచబ్యాంకు అడుగులకు మడుగులొత్తుతూ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమయమవడం ఖాయమని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏలాగైనా గద్దెనెక్కాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నాడని, ఆయన పాలనలో పడిన అష్టకష్టాలు ఈనాటికీ మరచి పోలేకపోతున్నామని భయకంపితులవుతున్నారు.
తొమ్మిదేళ్లు ఏడిపించాడు
చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులు బతికే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రైతులు ఆయనకు ఎప్పటికీ ఓటు వేయరు. తొమ్మిదేళ్ల పాలనలో రైతుల్ని ఏడ్పించని రోజు లేదు. ప్రతినిత్యం రైతుల్ని దొంగలుగా చిత్రీకరించాడు. సాగునీరు ఇవ్వలేదు. రైతులకన్నా ప్రపంచ బ్యాంకు అధికారులే మిన్నఅనుకున్నాడు. ఇప్పుడేమో సింగపూర్ తెస్తానంటున్నాడు. అంటే మళ్లీ వ్యవసాయాన్ని పూర్తిగా మూసేస్తాడనే అర్థం. వ్యవసాయం వల్ల అంతా నష్టమేనని చెప్పేవాడు. సాగునీరు కావాలని అడిగితే తుంపర్ల వ్యవసాయం చేయమని సలహా ఇచ్చేవాడు. ఆనాటి పాలన రైతులు ఇంకా మర్చిపోలేదు.
- పూనూరు బుద్దారెడ్డి, రైతు , జనార్ధనపురం
రైతుల్ని పోలీసులతో కొట్టించాడు
కాలువలకు నీటిమీటర్లు పెట్టొద్దన్నందుకు రైతుల్ని పోలీసులతో కొట్టించాడు. విత్తనాలను సాంప్రదాయ బద్ధంగా కాకుండా డంకెల్ ప్రతిపాదనలకు తలొగ్గి మోన్‌శాంటో విత్తనాలు మాత్రమే వాడాలని చెప్పాడు. విత్తనోత్పత్తిలో మోనోపలీ విధానం తెచ్చిన ఘనుడు. అదేమని అడిగితే ప్రపంచం వైపు చూడండి అని సలహా ఇచ్చేవాడు. ఆయన తొమ్మిదేళ్ల పాలన రైతులకు మరపురాని గుర్తులుగానే ఉన్నాయి.
- పెద్దిబోయిన గరటయ్య, నందివాడ,
ఇంకా రైతులు మర్చిపోలేదు
చంద్రబాబు రైతువ్యతిరేక పాలనను రైతులింకా మర్చిపోలేదు. రైతులంటేనే గిట్టని చంద్రబాబు నేడు అధికారం కోసం రైతులకు స్వర్గం చూపిస్తానని చెబుతున్నాడు. ఆయన అధికారం కోసం రైతులపై ప్రేమ కురిపిస్తున్నాడు. ఆయన కపట నాటకాలు జనం మర్చిపోలేదు. ప్రపంచ బ్యాంకు జీతగాడని ఆనాడే కమ్యూనిస్టులు చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే రైతులు ఉరేసుకున్నట్లేనని ప్రతి ఒక్కరూ అంటున్నారు.
- వై. దుర్గారావు, నందివాడ.
విద్యుత్ కనెక్షన్ ఇచ్చేవారు కాదు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో రైతులకు అన్నీ ఇబ్బందులే. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే సంవత్సరానికి కూడా వచ్చేది కాదు. దీనికి తోడు విద్యుత్ బిల్లులు కట్టకపోతే ఫీజులు సైతం పీక్కుని వెళ్లేవారు. కళ్ల ముందు పంటలు ఏండిపోతున్నాయని కాళ్లా వేళ్లా పడి బతిమిలాడినా ఏవరూ పట్టించుకునే వారు కాదు. మళ్లీ అటువంటి చంద్రబాబు పాలన భవిష్యత్‌లో రైతులె వరూ చూడకూడదు.
-మెండ్యాల దుర్గారావు,రైతు,వెలగలేరు
అవన్నీ చీకటి రోజులు
బాబు పాలనలో రైతులకన్నీ చీకటి రోజులే. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ సరఫరా ఏప్పుడూ సక్రమంగా ఉండేది కాదు. కానీ బిల్లులు మాత్రం కట్టలేని విధంగా వచ్చేవి.ఒక వైపు గిట్టుబాటు కాని పంట ధర. మరో వైపు పట్టించుకోని ప్రభుత్వం వెరసి రైతులు అప్పుల ఊబిలోకి చేరి ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం చంద్రబాబు దండగ అంటే.. కాదు పండగని మహానేత వైఎస్ రైతుల కోసం అనేక సంక్షమ పథకాలు అమలు చేసి నిరూపించాడు.
-తమటం వెంకట్రామయ్య,రైతు,గుర్రాజుపాలెం సర్పంచి
మహానేత వల్లే పింఛన్
నాకు 78 ఏళ్లు. నరసింగపాలెంలో నివసిస్తున్నా. చంద్రబాబు ఉన్నప్పుడు రూ.75 పింఛను వచ్చేది. తమ సొమ్మేదో ఇస్తున్నట్లు పాలకులు భావించేవారు. రాజశేఖరరెడ్డి వచ్చాక పింఛన్ మొత్తాన్ని రూ.200కు పెంచారు. ఈ ముసలి వయసులో మందుల ఖర్చుకు ఆ సొమ్ము అక్కరకొస్తోంది.
- చింతగుంట దావీదు, నరసింగపాలెం (ఆగిరిపల్లి)