సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పథకాల అమలు కోసం ప్రపంచ బ్యాంకు, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జేబీఐసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాలను తిరిగి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట ఒప్పందాలు ఉన్నందున, ఆ నిధులన్నీ ఆ రాష్ట్రానికి వెళ్తాయని, అందువల్ల రుణ ఒప్పందాలను రెండు నెలల్లోగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సోమవారం తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమయ్యారు.