Japan bank
-
అదానీ గ్రీన్‌కు రూ.1,630 కోట్ల రుణం
న్యూఢిల్లీ: అనుబంధ కంపెనీ అదానీ సోలార్ ఎనర్జీ ఏపీ సిక్స్ ద్వారా ప్రస్తుత రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి తాజాగా రూ.1,630 కోట్లను సమీకరించినట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ లోన్‌ను ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, సుమిటొమో మిట్సి బ్యాంకింగ్ కార్పొరేషన్ సమాన భాగస్వామ్యంతో సమకూర్చాయని కంపెనీ గురువారం తెలిపింది. -
మారుతీ సుజుకీకి భారీ నిధులు
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్థ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ (జేబీఐసీ) ఇప్పటి వరకు ఎస్బీఐకి రూ.11,400 కోట్లు సమకూర్చింది. ఈ మొత్తాన్ని మారుతీ సుజుకీ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఎస్బీఐ వినియోగిస్తోంది. మరో రూ.3,800 కోట్లు ఇచ్చేందుకూ జపాన్ సంస్థ సిద్ధమైంది. కోవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి దేశంలో సుమారు రూ.60,800 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్టు భారత్‌లో జేబీఐసీ కీలక ప్రతినిధి టొషిహికో కురిహరా తెలిపారు. ‘మారుతీ సుజుకీకి కావాల్సిన నిధులకై ఎస్బీఐకి రూ.15,200 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 2020 నవంబర్–డిసెంబర్ మధ్య సగం మొత్తం సమకూర్చాం. అలాగే రూ.3,800 కోట్లు అందించాం. మిగిలిన రూ.3,800 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాం. భారత్‌లో ఉన్న జపాన్ సంస్థలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చేందుకు ముందున్నాం’ అని వివరించారు. -
ప్రపంచబ్యాంకు, జేబీఐసీలతో మళ్లీ ఒప్పందాలు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పథకాల అమలు కోసం ప్రపంచ బ్యాంకు, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జేబీఐసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాలను తిరిగి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట ఒప్పందాలు ఉన్నందున, ఆ నిధులన్నీ ఆ రాష్ట్రానికి వెళ్తాయని, అందువల్ల రుణ ఒప్పందాలను రెండు నెలల్లోగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సోమవారం తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమయ్యారు.