ఫార్ములాని మించి నిధులు ఇవ్వడానికి సిద్ధం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
వాషింగ్టన్: వినూత్నమైన ఆర్థిక సొల్యూషన్లను అందించడానికి ప్రపంచ బ్యాంక్ తన సభ్య దేశాలతో కలసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. భారత వృద్ధి సాధనలో సాధించిన ఎన్నో చెప్పుకోదగ్గ ఘన విజయాలకు ప్రపంచబ్యాంక్ తగిన తోడ్పాటునందించిందని ఆయన పేర్కొన్నారు. మూలధనం పెంపు కోసం అనుసరిస్తున్న డైనమిక్ ఫార్ములా(జీడీపీ ఆధారిత, అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని)కు మించి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌కు, ప్రపంచ బ్యాంక్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)ల వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన కెనడా నుంచి వాషింగ్టన్‌కు వచ్చారు.