
న్యూఢిల్లీ: భారత 14వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి జూలై 5న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్లను జూలై 19వరకు తేదీ వరకు స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూలై 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా నిర్ణయించారు.