వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ పోరు ప్రస్తుతం జరుగుతోంది. రిపబ్లికన్ ప్రైమరీల్లో దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీల్లో ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్నారు. త్వరలో జరగనున్న సౌత్ కరోలినా ప్రైమరీలోనూ ఆయనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నారు.
అయితే తాజాగా తనతో పాటు ఈ ఎన్నికల్లో రన్నింగ్ మేట్‌గా ఉండాల్సిందిగా రాబర్జ్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ కోరినట్లుగా వచ్చిన వార్తలపై కెన్నెడీ స్పందించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్ష పదవకి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ తనను అడినట్లు కెన్నెడీ ధృవీకరించారు. ఈ ఆఫర్‌తో తాను పొంగిపోయానని అని కెన్నెడీ పేర్కొన్నారు. అయితే తనకు ట్రంప్ రన్నింగ్‌మేట్‌గా ఉండేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
Although Trump denies it, RFK Jr says Team Trump did reach out to him to see if he would be Trump’s running mate, and he turned it down. pic.twitter.com/oUhqUD8eJH
— Ron Filipkowski (@RonFilipkowski) January 29, 2024
ట్రంప్ సీనియర్ అడ్వైజర్ క్రిస్ లాసివిటా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ట్రంప్ క్యాంపు నుంచి ఎవరూ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సంప్రదించలేదని తెలిపారు. ఆయనను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ అడిగారని కెన్నెడీ చెప్పడం వంద శాతం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ సోదరుడు.. అమెరికా మాజీ అటార్నీ జనరల్ అయిన రాబర్ట్ కెనెడీ(అమెరికా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడ్డారు) తనయుడే ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్.
This is 100% FAKE NEWS - NO ONE from the Trump Campaign ever approached RFK jr (or ever will) - one of the most LIBERAL and radical environmentalists in the country. For all the fake news- update your stories. https://t.co/HYBJLqSux0
— Chris LaCivita (@LaCivitaC) January 28, 2024
Comments
Please login to add a commentAdd a comment