kennedy
-
ట్రంప్, ఇలాన్ మస్క్ తో కలిసి బర్గర్ తిన్న కెన్నెడీ జూనియర్
-
అమెరికా ఆరోగ్య మంత్రిగా... వ్యాక్సిన్ల వ్యతిరేకి
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’’ అని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ కుటుంబం కెనెడీ ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీకి తమ్ముడు. అమెరికాకు అటార్నీ జనరల్‌గా పని చేశారు. ఈసారి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అధ్యక్షుడు జో బైడెన్‌తో కెనెడీ పోటీ పడ్డారు. తర్వాత స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచారు. తాను గెలిస్తే ఆరోగ్య విధాన పర్యవేక్షణను అప్పగిస్తానని ట్రంప్ హామీ ఇవ్వడంతో ఆయనకు మద్దతుగా పోటీ నుంచి తప్పుతకున్నారు. అనంతరం ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎన్నికల చివరి దశలో ట్రంప్ కోసం కెనెడీ ముమ్మరంగా ప్రచారం కూడా చేశారు. వ్యాక్సిన్లకు ఫక్తు వ్యతిరేకి ప్రపంచంలోనే ప్రముఖ వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుల్లో కెనెడీ ఒకరు. ఆటిజం తదితర ఆరోగ్య సమస్యలకు టీకాలు కారణమవుతాయన్నది ఆయన వాదన. వ్యాక్సిన్ అస్సలు సురక్షితం కావని, ప్రభావవంతమైనవీ కావని తానిప్పటికీ నమ్ముతున్నానని చెబుతారు. పిల్లలకు టీకాలను సూచించే సీడీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించాలని 2021లో ప్రజలకు పిలుపునిచ్చారు. టీకాలకు వ్యతిరేకంగా ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించారు. అది టీకా సంస్థలతో పాటు వాటికి మద్దతిచ్చే పలు వార్తా సంస్థలపై కూడా కోర్టుల్లో పోరాడుతోంది. ప్రముఖ న్యాయవాది అయిన కెనెడీ పురుగుమందులు, ఫార్మా కంపెనీలపై కేసుల్లో స్వయంగా వాదిస్తుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, కలుపు మందుల వాడకానికి కూడా ఆయన ఫక్తు వ్యతిరేకి. అమెరికాలో ఆహార పరిశ్రమపై చిరకాలంగా పెత్తనం చలాయిస్తున్న భారీ వాణిజ్య కమతాలు, దాణా పరిశ్రమలను బాగా విమర్శిస్తుంటారు. దశాబ్దాలుగా దేశమంతటా నమ్మకమైన అనుచరగణాన్ని నిర్మించుకున్నారు. ఆహార పదార్థాల విషయంలో కఠిన నిబంధనలు విధించాలన్నది కెనెడీ వైఖరి. అమెరికాలో ఆహారాన్ని ఆరోగ్యకరంగా మారుస్తానని, ఈ విషయంలో యూరప్ తరహా నిబంధనలు తెస్తానని చెబుతున్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి పలు విభాగాల ఉద్యోగుల నేపథ్యాన్ని లోతుగా పరిశీలిస్తామని కూడా ప్రకటించారు. ఫార్మా తదితర కంపెనీల్లో చేసిన నేపథ్యమున్న వారిని ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పరిశోధనలను పర్యవేక్షించే వందలాది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పడం కలకలం రేపింది. వివాదాస్పదుడు కూడా పలు వివాదాల్లో కూడా కెనెడీ పతాక శీర్షికలకెక్కారు. ఎలుగుబంటి కళేబరాన్ని న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో పడేసి అది బైక్ ఢీకొని చనిపోయినట్టు చిత్రీకరించారు. దాన్ని ఆయనే కారుతో గుద్ది చంపారంటారు. బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచి్చన ఓ తిమింగలం తలను కత్తిరించి కారుకు కట్టి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తే వెల్లడించింది. దాంతో కెనెడీ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. తీవ్ర ఆందోళనలు కెనెడీ నియామకం ప్రజారోగ్య నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారులను మహమ్మారుల బారినుంచి కాపాడే టీకాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వ్యక్తి చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని బలి పెడుతున్నారంటూ వారంతా మండిపడుతున్నారు. ఆరోగ్య మంత్రి పదవికి అవసరమైన ఒక్క అర్హత కూడా ఆయనకు లేదని అమెరికాలోని ప్రఖ్యాత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ లురీ అన్నారు. ఆ పదవికి ఆయన పూర్తిగా అనర్హుడంటూ సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ మండీ కోహెన్ ధ్వజమెత్తారు. ‘‘ఆరోగ్యం విషయంలో అమెరికన్లు మళ్లీ తిరోగమన బాటను కోరుకోవడం లేదు. పిల్లలు, పెద్దలు ఆరోగ్య సమస్యల బారిన పడటం, ప్రాణాలు కోల్పోవడం వంటివి చూడాలనుకోవడం లేదు’’ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అంతర్గత వ్యవహారాల మంత్రిగా డౌగ్ బర్గమ్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బర్గమ్‌ను ట్రంప్ ఎంచుకున్నారు. నిజానికి ఆ యన ట్రంప్ రన్నింగ్‌మేట్ అవుతారని తొలుత అంతా భావించారు. 67 ఏళ్ల బర్గం రెండోసారి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. తొలుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో కూడా కొనసాగారు. తర్వాత తప్పుకుని ట్రంప్‌కు మద్దతుగా ముమ్మరంగా ప్రచా రం చేశారు. పూర్వాశ్రమంలో సాఫ్ట్వేర్ దిగ్గజమైన ఆయన అనంతరం ట్రంప్ మాదిరిగానే రియల్టీ వ్యాపారంలో కూడా రాణించారు. ‘హష్ మనీ’ లాయర్‌కు అందలం తన హష్ మనీ కేసును వాదిస్తున్న న్యాయ బృందం సారథి టాడ్ బ్లాంచ్‌ను దేశ డిప్యూటీ అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎంపిక చేశారు. న్యాయ శాఖలో ఇది రెండో అత్యున్నత పదవి. అటార్నీ జనరల్‌గా మాట్ గేట్జ్ ఆయన ఇప్పటికే ఎంచుకోవడం తెలిసిందే. కాంగ్రెస్ మాజీ సభ్యుడు డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ వ్యవహారాల మంత్రిగా ట్రంప్ ఎంచుకున్నారు. -
అతనికి ఉపాధ్యక్ష పదవి ఆఫర్ చేయలేదు: ట్రంప్ క్యాంపు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ పోరు ప్రస్తుతం జరుగుతోంది. రిపబ్లికన్ ప్రైమరీల్లో దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీల్లో ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్నారు. త్వరలో జరగనున్న సౌత్ కరోలినా ప్రైమరీలోనూ ఆయనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నారు. అయితే తాజాగా తనతో పాటు ఈ ఎన్నికల్లో రన్నింగ్ మేట్‌గా ఉండాల్సిందిగా రాబర్జ్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ కోరినట్లుగా వచ్చిన వార్తలపై కెన్నెడీ స్పందించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్ష పదవకి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ తనను అడినట్లు కెన్నెడీ ధృవీకరించారు. ఈ ఆఫర్‌తో తాను పొంగిపోయానని అని కెన్నెడీ పేర్కొన్నారు. అయితే తనకు ట్రంప్ రన్నింగ్మేట్గా ఉండేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. Although Trump denies it, RFK Jr says Team Trump did reach out to him to see if he would be Trump’s running mate, and he turned it down. pic.twitter.com/oUhqUD8eJH — Ron Filipkowski (@RonFilipkowski) January 29, 2024 ట్రంప్ సీనియర్ అడ్వైజర్ క్రిస్ లాసివిటా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ట్రంప్ క్యాంపు నుంచి ఎవరూ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సంప్రదించలేదని తెలిపారు. ఆయనను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ అడిగారని కెన్నెడీ చెప్పడం వంద శాతం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ సోదరుడు.. అమెరికా మాజీ అటార్నీ జనరల్ అయిన రాబర్ట్ కెనెడీ(అమెరికా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడ్డారు) తనయుడే ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్. This is 100% FAKE NEWS - NO ONE from the Trump Campaign ever approached RFK jr (or ever will) - one of the most LIBERAL and radical environmentalists in the country. For all the fake news- update your stories. https://t.co/HYBJLqSux0 — Chris LaCivita (@LaCivitaC) January 28, 2024 ఇదీచదవండి.. సైనీ హత్యను ఖండించిన భారత్ -
సీఎం సార్... ఆశీర్వదించండి
ఆంధ్రప్రదేశ్ గురుకులం విద్యార్థులు అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడ 10 నెలలు ఉండి పాఠాలు చదువుకోబోతున్నారు. ఈ గొప్ప అవకాశం వారి జీవితాలను మార్చనుంది. ఇందుకు కారణమైన ఏ.పి. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటున్నారు. ‘ఏ.పి గురుకులాలను సి.ఎం గారు ఆధునికంగా తీర్చిదిద్దడం వల్లే మాకు ఈ అవకాశం దక్కింది’ అంటున్నారు. ‘కెనడీ లుగర్–యూత్ ఎక్స్ఛేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్’ కింద అమెరికా వెళ్లిన విద్యార్థుల మనోగతాలు... మా దేశానికి అధ్యయానికి రండి అంటూ అగ్రదేశం అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం ఏ.పి. గురుకుల పాఠశాలల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదన లేని కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు అమెరికాను చూడటమే కాదు అక్కడ పది నెలలు ఉండి చదువుకునే అవకాశం పొందడం వారి జీవితాలను మార్చనుంది. ఇలా పేదపిల్లలకు పెద్ద అవకాశం దక్కడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన చదువుల మహాయజ్ఞం కీలకపాత్ర పోషించిందన్నది జగమెరిగిన సత్యం. ‘నాడు–నేడు’తో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు అధునాతంగా మారిపోవడంతోపాటు అన్ని వసతులూ సమకూరాయి. ఇంగ్లిష్ విద్య, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆన్లైన్ క్లాసులు, ట్యాబ్‌లు వంటి ఎన్నో సౌకర్యాలతో పేదపిల్లల పెద్ద చదువుకు కొత్త బాటలు పరుస్తున్నారు. తొమ్మిది దశల వడపోత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో అంతర్జాతీయ అవగాహనలో భాగంగా యూనైటెడ్ స్టేట్స్ (యూఎస్) గత కొన్నేళ్లుగా ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ (కేఎల్ – వైఈఎస్) ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి యేటా ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. దీనికి ఎంపిక కావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. మొదట బయోడేటా నుంచి చివరి ఇంటర్వ్యూల వరకు తొమ్మిది దశల్లో కఠినతరమైన వడపోత కొనసాగు తుంది. దాదాపు తొమ్మిది నెలలపాటు కొనసాగే అన్ని అర్హత పరీక్షల ప్రక్రియను విజయవంతంగా దాటుకుని రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు డి.నవీన, ఎస్. జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్. ఆకాంక్షలు అవకాశాన్ని దక్కించుకున్నారు. వారంతా ఇటీవలే అమెరికాకు పయనమై వెళ్లారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలోచేర్పిస్తారు. ఆ విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు అతిథ్యం ఇస్తాయి. విద్యార్థులు ఒక్కొక్కరికీ దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 16,500) నెలవారీ ఆర్థిక తోడ్పాటు (స్టైపెండ్)ను అందిస్తారు. సీఎంకు కృతజ్ఞతలు 2023–24 విద్యా సంవత్సరానికి ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ’ కోసం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని 38 దేశాల విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో మన దేశానికి చెందిన 30 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం గర్వకారణం. వీరికి కావలసిన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ఫోన్ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. కేఎల్–వైఈఎస్ ప్రోగ్రామ్‌లో అమెరికా చదువులకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు డి. నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్ ఆకాంక్ష సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆగస్టు 31న కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులు కె.అక్ష, సి.తేజ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ నేప«థ్యం తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. యూఎస్ఏ లో చదువులు పూరై్త వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ట్యాబ్‌లను అందజేశారు. థాంక్యూ సీఎం సార్ అమెరికా చదువులకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ మా ఊరు. మా నాన్న ప్రవీణ్ రాజ్ నెలకు రూ.7 వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగి. తల్లి సుకాంతి గృహిణి. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో గురుకులం ద్వారా ప్రభుత్వం నాకు మంచి విద్యావకాశాలు కల్పించింది. – రోడా ఇవాంజిలి, మధురవాడ గురుకులం, విశాఖ జిల్లా. విద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో బాగా తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి మా గ్రామం. మా నాన్న దార కేశయ్య పదవ తరగతి చదివి వ్యవసాయ పనులతో నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. ఐదవ తరగతి చదివిన అమ్మ ఆదిలక్ష్మమ్మ గృహిణి. పేదరికం కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకులంలో 5 వ తరగతిలో చేరిన నేను ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నా. – డి.నవీన, మార్కాపురం గురుకులం ఆనందంగా ఉంది ప్రభుత్వ గురుకులంలో చదివే నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విజయవాడ గుణదల ప్రాంతం మాది. మా నాన్న చొక్కా సురేష్ అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మ వనజ గృహిణి. – సీహెచ్ ఆకాంక్ష, ఈడ్పుగల్లు ఐఐటీ– ఎన్ఐటీ అకాడమి, కృష్ణా జిల్లా పేద పిల్లల చదువులకు సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు పేద పిల్లల ఉన్నత చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ శ్రద్ధ చూపిస్తున్నారు. పేదవర్గానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపిక అయ్యానంటే మా చదువులకు సీఎం సార్ అందించిన ప్రోత్సాహమే కారణం. చాలా సరదాగా మాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం గారు మాకు రూ.లక్ష సాయం, ట్యాబ్‌లు అందించారు. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, మల్లెనిపల్లి మా గ్రామం. మా నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. –హాసిని బలిగా, ఈడ్పుగల్లు ఐఐటీ– నీట్ అకాడమి, ఎస్సీ గురుకుల కలలో కూడా ఊహించలేదు నేను అమెరికా చదువుకు ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే ఈ అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జి.కొత్తూరు మా ఊరు. మా నాన్న ఎస్.కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము రోజువారీ కూలీగా నెలకు ఆరు వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 2017లో గురుకులంలో 6వ తరగతిలో చేరి ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. – ఎస్. జ్ఞానేశ్వరరావు, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా. – యిర్రింకి ఉమమాహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి, అమరావతి -
Cannes 2023: కాన్స్ లో ‘కెన్నెడీ’కి
ఆదరణ ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిశారు సన్నీ లియోన్ . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కెన్నెడీ’. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించింది యూనిట్. ‘కెన్నెడీ’ పూర్తయిన తర్వాత వీక్షకుల నుంచి ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ చిత్ర యూనిట్‌కు దక్కినట్లు తెలిసింది. ఇక కాన్స్ రెడ్ కార్పెట్‌పై సన్నీ లియోన్ నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘‘కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేయడం చాలా గౌరవంగా ఉంది’’ అన్నారు సన్నీ లియోన్ . సన్నీకి హెల్ప్ చేసిన అనురాగ్ కాన్స్ రెడ్ కార్పెట్‌పై పొడవాటి గౌనులో సన్నీ లియోన్ మెరిశారు. అయితే నడుస్తున్నప్పుడు ఆ గౌను ఆమె షూలో చిక్కుకోవడంతో ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న అనురాగ్ కశ్యప్ ఈ విషయాన్ని గ్రహించి సన్నీకి హెల్ప్ చేశారు. అలాగే మౌనీ రాయ్, అదితీరావ్ హైదరీలు కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పెవిలియన్ లో ‘లయనీస్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరి, సంధు ముఖ్య తారలు. -
కెన్నెడీకి కలామ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్ : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పురస్కారం 2019వ సంవత్సరానికి గాను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ పి కెన్నెడీ అందుకున్నారు. మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఆయనను ఈ పురస్కారం వరించింది. డాక్టర్ అబ్దుల్ కలామ్ రిసెర్చ్ సెంటర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కెన్నెడీకి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం హెచ్‌సీయూ మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగంలో అసోసియేట్ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్న కెన్నెడీ.. టెలివిజన్ రంగంలో సుమారు 20 ఏళ్ల పాటు పనిచేశారు. పలు టీవీ చానల్స్ కోసం.. విద్యాసంబంధ కార్యక్రమాలు, రియాలిటీ షోలు, గేమ్ షోలకు ఆయన దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్యుకేషనల్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్లో నిర్మాతగా కూడా సేవలు అందించారు. ఈ క్రమంలోనే యూజీసీ-సీఈసీకి అనేక విద్యారంగ కార్యక్రమాలను, ఇ- లెర్నింగ్ ప్రోగ్రాములను నిర్మించిన అనుభవాన్ని కెన్నెడీ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాలు అన్ని భారతదేశంలోని అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థుల కోసం ఉద్దేశించి రూపొందించబడ్డాయి. ఈ పాఠ్యాంశాల ఆధారిత కార్యక్రమాలు జాతీయ చానల్ డీడీ-1తోపాటు, వ్యాస్ చానల్లో ప్రసారమవుతున్నాయి. వీటిలో చాలా కార్యక్రమాలు పరిశోధన ప్రతిపాదికన రూపొందించబడినవే కావడం విశేషం. -
గత అధ్యక్షులు విఫలం
వాషింగ్టన్: కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం గతంలో అమెరికా చేసిన ప్రయ త్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆ విషయంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయా రు. 1960ల్లో కెన్నడీ, జాన్సన్ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఉత్తర కొరియాతో కొంతవరకు సత్సంబంధాలు కొనసాగాయి. 1968లో అమెరికా నిఘా నౌకల్ని నిర్బంధించడంతో పాటు గూఢచర్య విమానాల్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. ఆ తర్వాత రెండేళ్లకి ఉత్తర కొరియా తన ధోరణి మార్చుకుని శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 1974 అనంతరం అప్పటి ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇల్ సంగ్, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు చేశారు. అయితే చర్చల్లో ముందడుగు పడలేదు. 1981 లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దక్షిణా కొరియాను సమర్థిస్తూ మిలటరీ బలగాల్ని పెంచారు. ఆ తర్వాతి అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) దక్షిణకొరియా నుంచి భారీగా సైన్యాన్ని వెనక్కి రప్పించారు. అయితే ఉత్తరకొరియాతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. 1993–2001 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఉత్తర కొరియాతో సంక్షోభ పరిష్కారానికి కొంతవరకు ప్రయత్నాలు చేశారు. పదేళ్ల పాటు శాంతియుత సంబంధాలే కొనసాగినా, జార్జ్ బుష్(జూనియర్) అధ్యక్షుడయ్యాక మళ్లీ సంబంధాలు క్షీణించాయి. ఉ.కొరియాతో సంబంధాల విషయంలో ఒబామా సంయమనం పాటించారు. ఆంక్షలతో దారికి వస్తుం దని భావించారు. 2011లో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టిన కిమ్ ఆంక్షల్ని లెక్క చేయకుం డా అణుపరీక్షలు కొనసాగించారు. ఈ సారైనా ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు వెళ్తా యా? లేక గతంలో మాదిరిగా ప్రహసనంగా మారుతుం దా? అన్నది ట్రంప్ చేతుల్లోనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
కెన్నడీ హంతకుడితో సీఐఏకు లింకు లేదు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసుకు సంబంధించి మరికొన్ని దర్యాప్తు పత్రాల్ని అమెరికా తాజాగా విడుదల చేసింది. అయితే కెన్నడీ హంతకుడు లీ హర్వే ఒస్వాల్డ్కు సీఐఏతో సంబంధాలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఈ దర్యాప్తు పత్రాల్లో వెల్లడైంది. ఒస్వాల్డ్ను సీఐఏ పావుగా వాడుకుందా? ఆ నిఘా సంస్థతో అతనికి ఇతర సంబంధాలు ఉన్నా యా? అన్న విషయంపై అమెరికా లోపల, బయట విస్తృతంగా శోధించామని తాజా పత్రాల్లో వెలుగుచూసిన 1975 నాటి సీఐఏ మెమోలో పేర్కొన్నారు. -
‘ఎక్సయిటింగ్’ లీడర్!
విశ్లేషణం బిల్‌క్లింటన్... ప్రజానాయకుడు కావాలని పదహారేళ్ల వయసులోనే నిర్ణయించుకుని, కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్లనుంచి ప్రేరణ పొంది, ప్రజాజీవితంలోకి ప్రవేశించి, రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు. హిల్లరీని ప్రేమించి, పెళ్లాడిన ప్రేమికుడు. క్లింటన్ ఫౌండేషన్ స్థాపించి సేవ చేస్తున్న మానవతావాది. మరి మోనికా లూయిన్‌స్కీ విషయంలో తప్పుటడుగు ఎందుకు వేశాడు? అధ్యక్షుడిగా ఉండి క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి ఆయన వ్యక్తిత్వమే కారణమా? చాలామంది నాయకులు తమ ఉపన్యాసం తయారులో చూపించే శ్రద్ధ.. బాడీలాంగ్వేజ్ విషయంలో చూపించరు. కానీ నిజానికి ఎంత బాగా మాట్లాడాం, ఎంతమందిని ఆకట్టుకున్నామనేదానిలో భాష పాత్ర ఏడు శాతం మాత్రమే. మిగతా 93 శాతం బాడీ లాంగ్వేజ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం క్లింటన్‌కు బాగా తెలుసు. ఉపన్యాసకళలో ఆయన నిష్ణాతుడు. అందుకే మాట్లాడేటప్పుడు ఆయన నిల్చునే తీరు, కదలికల్లో ఈజ్ కనిపిస్తుంది. తరచుగా చిరునవ్వులు చిందిస్తాడు. మాట్లాడటాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ ఆయనో విజువల్ పర్సనాలిటీ అని చెప్తాయి. మాట్లాడేటప్పుడు చేతులు, వేళ్లు రిలాక్స్డ్గా ఉంటాయి. ఆ రిలాక్సేషన్ మొహంలో కూడా కనిపిస్తుంది. అలాగే హస్తాన్ని పైవైపుకు ఉంచి చూపుడువేలును చూపిస్తారు. ఇది ఆయన ఓపెన్‌గా, సపోర్టివ్‌గా ఉంటారని, తననుంచి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారని వెల్లడిస్తుంది. చేతులు ఓపెన్‌గా ఉండటమనేది ఆయన్ను సులువుగా చేరవచ్చనే భావనను కలిగిస్తుంది. మాటలు తెలిసిన నేత... ఉపన్యాసాన్ని ఎలా మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో క్లింటన్‌కి బాగా తెలుసు. ప్రజల మనసుల్లోకి చేర్చాలనుకున్న విషయం గురించి మాట్లాడేటప్పుడు పదాలను నిదానంగా, స్పష్టంగా పలుకుతారు. ఆ విషయాన్ని ఒకటికి నాలుగుసార్లు చెప్పి ప్రజల మనసుల్లో నాటుకుపోయేలా చేస్తారు. ‘‘మనందరం కలిస్తే మరింత సాధించగలం. మనమధ్య విభేదాలు నిజమే, కానీ మనందరిలోనున్న మానవత్వం మరింత నిజం’’ అంటూ ‘నేను’ అనే పదం కన్నా ‘మనం’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా తానూ అందరిలో ఒకడినే అన్న భావనను కలిగిస్తారు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా కాసిన్ని జోకులు వేసి బ్యాలెన్స్ చేస్తారు. జర్నలిస్టులా అందరికీ అర్థమయ్యేలా విషయాన్ని వివరిస్తారు. ప్రశ్నలు వేసి, తానే సమాధానం చెప్పి, అదే అందరికీ కావాల్సిందని ఒప్పిస్తారు. వీటన్నింటిలోనూ ఆయన శరీర కదలికలకు, మాటలకు మధ్య లయ కనిపిస్తుంది. ఇవన్నీ కలిసి ఆయన మాట్లాడేది నిజమేనన్న విశ్వాసాన్ని కలుగజేస్తాయి. అధికారంకన్నా లక్ష్యం ముఖ్యం క్లింటన్ ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన, కరిష్మా ఉన్న నాయకుడు. తన అప్పియరెన్స్‌తో, మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తారాయన. చుట్టూ ఉన్నవారిని నిరంతరం గమనిస్తుంటారు. వారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టి, తను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించకుండా చెప్పేస్తారు. ఆయనకు తన అధికారంకన్నా తానేమి సాధించాననేది ముఖ్యం. అలాగని లక్ష్యసాధనలో మొండిగా వ్యవహరించరు. అందరినీ కలుపుకుపోతారు. తనకు వచ్చిన సమాచారం, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా లక్ష్యసాధన మార్గాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. సాధించిన విజయాల నుంచి ప్రేరణ పొందుతారు. నిర్ణయాలు తీసుకునేప్పుడు తాను నిర్దేశించుకున్న ప్రమాణాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఎక్సయిట్మెంట్ కోసం ఆరాటం క్లింటన్ బహిర్ముఖుడు (ఎక్స్ట్రావర్ట్). కలివిడిగా మాట్లాడతారు. సెంటర్ ఆఫ్ అటెన్షన్‌గా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎదుటివారు ఇష్టపడేలా మాట్లాడతారు. ఈ క్షణంలో జీవించేందుకు ఇష్టపడతారు. ప్రతి క్షణాన్నీ ఆనందించాలనుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఆనందాలు, ఎక్సయిట్మెంట్స్ పొందాలనుకుంటారు. ఆ క్రమంలో అత్యుత్సాహంగా (ఇంపల్సివ్) వ్యవహరిస్తారు. తాను చేస్తున్నది ఓ సాహసమనుకుని, దాన్నుంచి ఆనందాన్ని పొందుతారు. ఈ ఆనందాన్ని, ఎక్సయిట్మెంట్ను పొందేందుకు అవసరమైతే సంప్రదాయాలను, అంతరాత్మను పక్కన పెట్టేయడానికి కూడా వెనుకాడరు. అలాంటి సాహసాల్లో ఒకటే మోనికా లూయిన్‌స్కీతో ప్రణయకలాపం. ఈ విషయంపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినా... అది ఆయన జీవితంలో ఓ మచ్చగానే మిగిలిపోయింది. - విశేష్, సైకాలజిస్ట్