అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన చిన్ననాటి భారత పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భాతరదేశ వారసత్వాన్ని ప్రతిబింబించే ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 10న) సందర్పంగా అమ్మమ్మ తాతయ్యలు పీవీ గోపాలన్-రాజమ్మలతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. భారత్ వెళ్లినప్పుడల్లా తాత తనను మార్నింగ్ వాక్‌కు తీసుకెళ్లేవారని తెలిపారు. అలాగే భారత స్వతంత్ర పోరాటంలో తాత పాత్రను వివరించారు.
సమానత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం గురించి తాత మాట్లాడేవారని అన్నారు. ఆయన భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అని సోషల్ మీడియా ఎక్స్ రాశారు. అలాగే తన అమ్మమ్మ సహకారాన్ని కూడా హైలెట్ చేస్తు రాశారు. ఆమె మహిళకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించేలా భారతదేశం అంతటా ప్రయాణించేదని అన్నారు. అందువల్లే తనకు ప్రజాసేవ పట్ల నిబద్ధతగా ఉండటం, మంచి భవిష్యత్తు కోసం పోరాడటం వంటివి వారసత్వంగా వచ్చాయని అంటోంది. ఇలా హారిస్ తాను తన అమ్మమ్మ తాతయ్యల నుంచి సామాజికి విలువలు గురించి ఎలా నేర్చుకున్నానో చెప్పుకొచ్చారు.
తరువాత తరాలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా కీలకం అంటూ స్ఫూర్తిని కలిగించే తాతాయ్య అమ్మమ్మలందరికీ జాతీయ గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది ఆమె కుటుంబ వారసత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం మీ తాత బ్రిటిష్ ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీస్‌లో ఉన్నప్పుడూ ఆ ప్రభుత్వాన్నే వ్యతిరేకించేలా తన సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడగలరని ప్రశ్నించారు. అంతేగాక ఆ సర్వీస్ స్వాత్రంత్య్రం అనంతరమే సెక్రటేరియట్ సర్వీస్‌గా మారిందని విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాదు క్షమించండి మిమ్మల్ని నమ్మలేం. ఇది కేవలం భారత సంతతి వ్యక్తులను బుట్టలో వేసుకునే రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శలు చేశారు.
(చదవండి: శ్రావణ బెండకాయల గురించి విన్నారా..? గణేషోత్సవంలో..!)
Comments
Please login to add a commentAdd a comment