బెండకాయలు ఆరోగ్యానికి మంచివని తెలిసి. జ్ఞాపశక్తి కావలంటే బెండకాలయని తినమని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు. బెండకాయాల్లో మరో రకం ఉన్నాయని విన్నారా. అదే శ్రావణ లేదా నవధారి బెండకాయలు గురించి విన్నారా. ఈ బెండకాయలకి సాధార బెండీలకు చాలా భేదం ఉంది. ఈ బెండకాలయను గణేషుడి నవరాత్రల్లో నైవేద్యంగా మహారాష్ట్రీయలు పెడతార కూడా. అసలేంటి బెండకాయ? ఆ పేరు ఎలా వచ్చింది? దీని వల్ల కలిగే లాభలేంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!
మహారాష్ట్రలో గణేష్ నవరాత్రుల్లో ఈ శ్రావణ లేదా నవధారి బెండకాయకు అత్యంత డిమాండ్ ఉంటుందట. దీన్ని కూరగా వండి గణేషుడికి నైవేద్యంగా సమర్పిస్తారట. ఇక సాధారణ బెండకాయకి దీనికి ఉన్న భేదం దానిపై ఉండే చారలు, ఆకృతి. ఈ బెండకాయ తొమ్మిది చారలతో పెద్దగా ఉంటుంది. అందుకే ఈ బెండకాయ నవధారి అనే పేరు వచ్చింది. ఇవి శ్రావణ మాసం నుంచి వస్తాయి కాబట్టి దీన్ని శ్రావణ బెండీ అని పిలవడం జరిగింది.
ఇవి ఆగస్టు నెలాఖరు నుంచి ప్రారంభమై అక్టోబర్ వరకు వస్తాయి. ముఖ్యంగా గణేషుడి నవరాత్రుల నుంచి మార్కెట్‌లో ఈ బెండకాయలకి అత్యంత డిమాండ్ పెరుగుతుందట. ఇక ఈ బెండకాయతో కలిగే లాభల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ రుజుతా దివేకర్ మాటల్లో చూద్దాం. సాధారణ బెండకాయల కంటే నవధారి బెండకాయలే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ఈ బెండకాయలకు జిగురు ఉండకపోవడం విశేషం. అలాంటి ఈ బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
కొలస్ట్రాల్ రోగులకు ఈ బెండకాయలు వరం అని చెప్పొచ్చు. ఇవి కొలస్ట్రాల్‌ని తగ్గించడంలో సమర్థవంతంగా ఉంటాయట. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
జీర్ణక్రియకు, జీవక్రియకు మేలు చేస్తుందట.
ఇందులో డైటరీ ఫైబరీ కంటెంట్ సాధరణ బెండకాయల కంటే ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.
బరువు తోపాటు బీపీని కూడా అదుపులో ఉంచుతుంది.
నవధారి బెండకాయలను రెగ్యులర్‌గా తీసుకుంటే అధిక రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ బెండకాయ నీరు బరువు తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుందట.
(చదవండి: 60ల నాటి చీరలతో రూపొందించిన లెహంగాలో సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!)
Comments
Please login to add a commentAdd a comment