lady fingers
-
ప్రొటీన్ పవర్‌హౌస్ బెండకాయ జిగురుతో మహిమలెన్నో!
బెండకాయతో బెనిఫిట్స్ జుట్టు, చర్మం, మోకాళ్ల నొప్పులు ఇంకా ఎన్నో బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రావు అనే సామెతవిన్నవారికి, దాని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో కాపాడటంలో ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందాం ఈ కథనంలో.బెండకాయ, భేండీ, లేడీ ఫింగర్ పేరు ఏదైనా లాభాలు మాత్రం మెండు. బెండకాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బెండకాయ తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకి బెండకాయ ఎక్కువగా పెడుతూ ఉంటారు. బెండకాయలో పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బెండకాయతో బోలెడన్ని రెసిపీలు చేసుకోవడం మాత్రమే కాదు, అలాగే మోకాళ్ల నొప్పులుతో బాధపడేవారు, వీర్యకణాలు తక్కువగా ఉండేవారు బెండకాయలను తీసుకోవాలని చెబుతారు. కెరటిన్ కూడా ఎక్కువే. అందుకే ఆరోగ్యకరమైన జుట్టుకు చర్మం సంరక్షణలో కూడా బెండకాయ బాగా పనిచేస్తుంది. బెండకాయ బాగా పనిచేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే కెరటిన్‌తో జుట్టు సిల్కీగా, హెల్దీగా ఎదుగుతుంది.బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ కే2సీ, ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది.పురాతన ఈజిప్టులోని స్త్రీలు బ్యూటీకోసం వాడేవారట. ఉపయోగించారు. బెండకాయలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌తో చర్మం మెరిసిపోతుంది. యాంటీ ఏజింగ్ సొల్యూషన్‌లా పనిచేస్తుంది. వీటిల్లోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , రీ-హైడ్రేటింగ్ లక్షణాల మొఖం మీద మొటిమలను విజయవంతంగా నిర్మూలిస్తుంది. బెండకాయ నీరుబెండకాయను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే, సుగర్వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సల్యూబుల్ ఫైబర్, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. వీర్యపుష్టికి పనిచేస్తుంది.బెండకాయలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించి, మలబద్దకానికి మంచి మందులాగా కూడా పనిచేస్తుంది. బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ అనే పదార్ధం గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలకుచెక్ పెబుతుంది. ఓక్రా పౌడర్‌తో ప్యాక్మెరిసే చర్మం కావాలంటే ఫేస్ ప్యాక్‌ను వాడవచ్చు. దీనికి కావాల్సిందల్లా రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రీయంగా పండించిన బెండకాయలు. వీడిని ఎండబెట్ట పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. దానిని గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.బెండకాయలు ముక్కలుగా చేసి 10 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి. ఇందులో కొద్దిగా యోగర్ట్, ఆలివ్ నూనె కలిపి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ముఖానికి రాసుకొని ,15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ను ఒక వారం పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.ప్రొటీన్ల పవర్‌హౌస్ లేడీఫింగర్‌తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. దురదలు, జుట్టు పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫ్రింజీగా ఉండే గిరిజాల జుట్టును మృదువుగా మారుస్తుంది. ఏం చేయాలంటే! కట్ చేసిన బెండకాయలను కాసేపు నీళ్లలో ఉడికించాలి. దీన్ని చల్లారేదాకా అలాగే ఉంచాలి. తరువాత ఈ వాటర్‌ను ఒక గాజు సీసాలోకి వడ బోసుకోవాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీళ్లను జుట్టంతా పట్టించాలి. 25 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి ఎలాంటి జిట్ట జుట్టునైనా మృదువుగా మార్చేస్తుంది. -
శ్రావణ బెండకాయల గురించి విన్నారా..? గణేషోత్సవంలో..!
బెండకాయలు ఆరోగ్యానికి మంచివని తెలిసి. జ్ఞాపశక్తి కావలంటే బెండకాలయని తినమని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు. బెండకాయాల్లో మరో రకం ఉన్నాయని విన్నారా. అదే శ్రావణ లేదా నవధారి బెండకాయలు గురించి విన్నారా. ఈ బెండకాయలకి సాధార బెండీలకు చాలా భేదం ఉంది. ఈ బెండకాలయను గణేషుడి నవరాత్రల్లో నైవేద్యంగా మహారాష్ట్రీయలు పెడతార కూడా. అసలేంటి బెండకాయ? ఆ పేరు ఎలా వచ్చింది? దీని వల్ల కలిగే లాభలేంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!మహారాష్ట్రలో గణేష్ నవరాత్రుల్లో ఈ శ్రావణ లేదా నవధారి బెండకాయకు అత్యంత డిమాండ్ ఉంటుందట. దీన్ని కూరగా వండి గణేషుడికి నైవేద్యంగా సమర్పిస్తారట. ఇక సాధారణ బెండకాయకి దీనికి ఉన్న భేదం దానిపై ఉండే చారలు, ఆకృతి. ఈ బెండకాయ తొమ్మిది చారలతో పెద్దగా ఉంటుంది. అందుకే ఈ బెండకాయ నవధారి అనే పేరు వచ్చింది. ఇవి శ్రావణ మాసం నుంచి వస్తాయి కాబట్టి దీన్ని శ్రావణ బెండీ అని పిలవడం జరిగింది. ఇవి ఆగస్టు నెలాఖరు నుంచి ప్రారంభమై అక్టోబర్ వరకు వస్తాయి. ముఖ్యంగా గణేషుడి నవరాత్రుల నుంచి మార్కెట్లో ఈ బెండకాయలకి అత్యంత డిమాండ్ పెరుగుతుందట. ఇక ఈ బెండకాయతో కలిగే లాభల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ రుజుతా దివేకర్ మాటల్లో చూద్దాం. సాధారణ బెండకాయల కంటే నవధారి బెండకాయలే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ఈ బెండకాయలకు జిగురు ఉండకపోవడం విశేషం. అలాంటి ఈ బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కొలస్ట్రాల్ రోగులకు ఈ బెండకాయలు వరం అని చెప్పొచ్చు. ఇవి కొలస్ట్రాల్‌ని తగ్గించడంలో సమర్థవంతంగా ఉంటాయట. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. జీర్ణక్రియకు, జీవక్రియకు మేలు చేస్తుందట.ఇందులో డైటరీ ఫైబరీ కంటెంట్ సాధరణ బెండకాయల కంటే ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తోపాటు బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. నవధారి బెండకాయలను రెగ్యులర్‌గా తీసుకుంటే అధిక రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ బెండకాయ నీరు బరువు తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుందట.(చదవండి: 60ల నాటి చీరలతో రూపొందించిన లెహంగాలో సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!) -
ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు!
రైతులు బెండసాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొంటున్నారు. హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్. దీనివలన భూసారంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. రసాయన ఎరువుల ఖర్చులను ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. వచ్చే వేసవి బెండ సాగుకు అనుకూలమని, పంట సాగుకు అవలంబించాల్సిన పద్ధతులు ఆయన మాటల్లోనే.. వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందు వలన పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది. నేలలు : సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగు నీటి సౌకర్యం గల తేలికపాటి రేగడి నేలలు అనుకూలం. విత్తే సమయం : వర్షాకాలపు పంటకు జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు : వేసవి పంటకు ఎకరాలకు 7 నుంచి 8 కిలోల విత్తన సరిపోతుంది. రకాలు : పర్భని క్రాంతి, అర్కఅనామిక, అభయ విత్తన శుద్ధి.. విత్తనాలను విత్తే ముందు 12గంటలు నీటిలో నాన బెట్టాలి. ఆవు మూత్రం ద్రావణంలో (1:5 నిష్పత్తిలో నీటిలో కలిపి) 30 నిమిషాలు శుద్ధి చేయాలి. విత్తనశుద్ధికి 100 మి.లీ. ఆవు మూత్రం, 100 గ్రాములు ఆవు పేడ, 100 గ్రాములు గట్టుమట్టి, లేదా పుట్ట మట్టి కలిపిన నీటిలో ఒక గంట వరకు నానబెట్టి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. భీజామృతం లేదా అమృత జలం లేదా పంచగవ్యం ద్రావణంలో 8గంటలు నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. పొలం తయారీ, విత్తే పద్ధతి.. నేలను 4–5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెం.మీ ఎడంలో బోదెలపై 30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. నేలను మళ్లుగా చేసి, వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 నుంచి 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో రంధ్రానికి 2–3 విత్తనాలను విత్తుకోవాలి. పోషకాల యాజమాన్యం.. 10 నుంచి 15 మి.లీ. కోడిగుడ్లు, నిమ్మకాయ రసం ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దిగుబడులు పెంచవచ్చు. మొక్కలు మొలిచిన 3–4 రోజుల్లో తొలిసారి 3 శాతం పంచగవ్య ద్రావణం పిచికారీ చేయాలి. పూత దశకు ముందే 5 శా తం పంచగవ్య పిచికారీ చేయాలి. పంట రెండు వారాల వయస్సులో 400 లీటర్ల జీవామృతం సాగు నీటిలో అందించాలి. మొక్క 4–6 ఆకుల దశలో తులసీ–కలబంద కషాయం పిచికారీ చేయాలి. పంటపై 2 శాతం పంచగవ్య పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి. రక్షణ పంటలు : తోట చుట్టూ జొన్న, సజ్జ, బంతి మొక్కలను పెంచాలి. అంతర పంటలు : పైరు మధ్యలో బంతి మొక్కలను ఎర పంటగా వేయాలి. అంతర పంటలుగా ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. నీటియాజమాన్యం : గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తరువాత 4–5 రోజులకు రెండోసారి నీరు పారించాలి. వేసవి పంటకు అయితే ప్రతి 4–5 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీరు పెట్టాలి. దిగుబడి : 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. భూసార యాజమాన్యం ఇలా.. దబోల్కర్ పద్ధతిలో వివిధ రకాల విత్తనాలను విత్తి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నాలి. ఎకరానికి పశువుల ఎరువు 10 టన్నులు, 500 కిలోల ఘనజీవామృతం, వేప పిండి 100 కిలోలు, వేరుశనగ పిండి 32–40 కిలోలు, 2 కిలోలు అజోస్పైరిల్లం, 2 కిలోలు పాస్పోబ్యాక్టీరియా, ఆఖరి దుక్కిలో వేసి, కలియదున్నాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం, 15 రోజుల వ్యవధిలో సాగు నీటిలో అందించాలి. -
బెండతో అనేక వ్యాధుల నివారణ
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని మధుమేహం(డయాబెటిస్), గుండె జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులు గడగడలాడిస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మధుమేహ బాధితులు ఇప్పుడు ప్రతి పల్లెలోనూ దర్శనమిస్తున్నారు. ముఖంగా పట్టణ ప్రాంత ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి, ఆహార నియమాలు పాటించక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధులతో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల వారు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. కాగా, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయల రారాజు బెండకాయ(లేడీ ఫింగర్)అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. బెండలో సీ,ఈ, కే, ఏ, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాగా, అధనంగా ఫైబర్, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మానవులకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. బెండ వల్ల కలిగే ప్రయోజనాలను విశ్లేషిద్దాం బరువు తగ్గడం బరువు తగ్గాలనుకునే వారికి బెండ సంజీవనిగా పనిచేస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాలు లబించడంతో పాటు, బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు డయాబెటిస్‌ను అదుపు చేయడం బెండలో గ్లైసెమిక్ ఇండెక్స్ (రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేది) చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మధుమేహాన్ని అదుపు చేసే మైరెసిటీన్ ఉంటుంది. కాగా ఇది కండరాల ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది. గుండె వ్యాధుల నియంత్రణకు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాద ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు (ఊబకాయం)తో బాధపడే వారికి బెండ మేలు మరువలేనిది. ముఖ్యంగా పెక్టిన్ అనే ఫైబర్ గుండె జబ్బులు కలగజేసే చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుందని అధ్యయానాల్లో తేలింది. మరోవైపు బెండలో ఉన్న పాలిఫినాల్స్ ఆర్టరీ బ్లాకులను నివారిస్తుంది. క్యాన్సర్ నివారణకు బెండలో ఉన్న లెక్టిన్ రొమ్ము క్యాన్సర్ రిస్క్‌ను 65శాతం మేర నివారిస్తుందని ఇటీవలే ఓ బయోటెక్నాలజీ నివేదిక తెలిపింది. మరోవైపు బెండతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి అందమైన చర్మం కోసం బెండలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, కెరటోనాయిడ్స్ పదార్థం లభించడం వల్ల వయస్సు తక్కువగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చెడు చర్మ గ్రంథులను తొలగించే శక్తి బెండలో ఉన్నాయి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి బెండలో ఉన్న డయిటరీ ఫైబర్ వల్ల మలబద్దకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణశక్తికి బెండ ఎంతో మేలు చేస్తున్నట్లు అధ్యయనాలున్నాయి బెండతో గర్భిణి స్త్రీలకు ఎంతో మేలు బెండకాయను గర్భిణి స్త్రీలు నిత్యం తినడం వల్ల గర్భిణిలకు అతిముఖ్యమైన ఫోలేట్(విటమిన్ 9) పోషకం లభిస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల కొత్తగా జన్మించే శిశువులకు జన్యుపరమైన నరాల జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల బెండను నిత్యం మన ఆహార అలవాట్లలో వాడడం వల్ల మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బెండలో అత్యధికంగా లభించే విటమిన్ సీ వల్ల భయంకరమైన వైరస్(కరోనా వైరస్) లను ఎదుర్కొవచ్చు. రుచి కోసం చూసుకోకుండా బెండను నిత్యం వాడడంతో ఎన్నో భయంకరమైన రోగాలను నివారించవచ్చు -
బెండ.. ఎంతో అండ
సాగుతో బోలెడు లాభాలు మంచి ఫలితాలను సాధిస్తున్న రైతులు జిల్లాలో పెరుగుతున్న విస్తీర్ణం గజ్వేల్ ఉద్యాన శాఖాధికారి చక్రపాణి సలహాలు, సూచనలు గజ్వేల్: బెండసాగుతో రైతులు మంచి ఫలితాలు పొందుతున్నారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు కురగాయల సాగువైపు మళ్లుతుండగా.. ఇందులో బెండ కీలకమైనదిగా మారుతున్నది. ఈ పంట సాగు విస్తీర్ణం రోజురోజూకు పెరుగుతున్నది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అనుకున్న ఆదాయం పొందవచ్చని గజ్వేల్ ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి (8374449345) తెలిపారు. ఈ పంట సాగుకు సంబంధించి సలహాలు, సూచనలు అందించారు. వాతావరణం వేడి వాతావరణం అనుకూలం. అతిచల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడమే శ్రేయస్కరం. విత్తన మోతాదు వర్షాకాలపు పంటకు ఎకరానికి 4-6 కిలోలు, వేసవి పంటకు 7-8కిలోలు, సంకరజాతి రకాలైతే 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన రకాలు పర్బనిక్రాంతి: కొమ్మలు వేయకుండా మొక్క బలంగా పెరుగుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. ఎకరాకు 4, 4.5 టన్నుల దిగుబడి వస్తుంది. అర్కఅనామిక: విత్తిన 55రోజుల్లో కాపుకు వస్తుంది. శంఖు రోగాన్ని కొంతవరకు తట్టుకోగలదు. కాయలు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. ఈ రకం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడు వస్తుంది. అర్కఅభయా: అర్కఅనామిక రకాన్ని పోలివుండి శంఖు రోగాన్ని బాగా తట్టుకుంటుంది. ఈ రకం ఎకరాకు 4-5 టన్నుల దిగుబడిని ఇచ్చే అవకాశముంది. ఈ రకాలతో 90 రోజుల్లోపు పంట చేతికి వస్తుంది. ఇవే కాకుండా సంకరజాతికి చెందిన వర్ష, విజయ్, విశాల్, నా«ద్శోభ, మహికో హైబ్రిడ్ 10, 64, ప్రియా, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్, యూఎన్ 7109, తులసి తదితర రకాలు కూడా సాగుచేసుకోవచ్చు. విత్తే పద్ధతి నేలను 4-5సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60సె.మీల ఎడంతో బోదెల మీద 30సెం.మీ దూరంలో విత్తుకోవాలి. వేసవికాలం పంటలో నేలను మళ్లుగా చేసి వరుసల మధ్య 45సెం.మీ, మొక్కల మధ్య 15-20 సెం.మీ దూరం ఉండేట్లు విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4-5 రోజులకు రెండో తడి నీరు ఇవ్వాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్, 4గ్రా.ల ట్రైకోడెర్మావిరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు చివరి దుక్కిలో ఎకరాకు 6-8టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24కిలోల భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 45 కిలోల నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి 1/3వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3వంతును రెండు భాగాలుగా విత్తిన 30, 45వ రోజున వేయాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదును సుమారు 50శాతం పెంచాలి. కలుపు నివారణ, అంతర కృషి పెండిమిథాలిన్ 30శాతం ఎకరాకు 1.2లీటర్ చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటిరోజునగానీ పిచికారి చేయాలి. విత్తిన 25, 30రోజులపుడు గొర్రు లేదా గుంటుకతో అంతర కృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు సరిచేయాలి. పంట పూత దశలో లీటరు నీటికి 10గ్రా. యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20-25శాతం నత్రజని ఆదాతో పాటు అదిక దిగుబడి పొందవచ్చు. నీటి యాజమాన్యం వర్షాకాలంలో సక్రమంగా వర్షాలు రాకపోతే 7-8 రోజులకోసారి నీరు పెట్టాలి. వేసవి పంటకు ప్రతి 4-5 రోజులకొకసారి నీరు పెట్టాలి. సమగ్ర సస్యరక్షణ ఒక ఎకరాకు 100కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయ తొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున అమర్చాలి. అంతే కాకుండా ఎకరానికి 4చొప్పున పసుపురంగు పూసిన రేకులకు ఆముదం, గ్రీసు పూసిపెట్టి తెల్లదోమను ఆకర్షింపజేయాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామ బదనికలను పూత దశలో వారానికి ఒకసారి చొప్పున 4సార్లు విడుదల చేయాలి. విడుదల సమయంలో పురుగు మందులు వాడొద్దు. రసం పీల్చే పురుగుల నివారణకు ఫాసలోన్, ఫిఫ్రోనిల్, డైమీతోయెట్ మందుల్లో ఏదేని ఒకదానిని లీటరు నీటికి 2మి.లీ.చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా.ల ఎసిఫెట్ను ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు కార్బరిల్ 3 గ్రా. లేదా ఫ్రొఫెనోఫాస్ 2మి.లీ ఒకలీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.