బ్లాంటైర్: ఆఫ్రికా దేశం మలావీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ షిలిమాతోపాటు మరో 9 మంది దుర్మరణం పాలయ్యారు. దేశ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించినట్లు మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం వెల్లడించారు.
ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని అన్నారు. ఉపాధ్యక్షుడు షిలిమా సహా మొత్తం 10 మంది సోమవారం ఉదయం సైనిక విమానంలో మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలోని మజుజు సిటీకి బయలుదేరారు. ముజుజులో ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో వెనక్కి వెళ్లాలని విమానం పైలట్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమాచారం ఇచ్చారు. 45 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment