అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారతీయ సంతతికి చెందిన ''శ్రీలా వెంకటరత్నం'' రాజీనామా చేశారు. సుమారు 11 సంవత్సరాలు టెస్లా కంపెనీలో అనేక కీలక బాధ్యతలు చేపట్టిన ఈమె ఉద్యోగానికి రాజీనామా చేశారు.
శ్రీలా వెంకటరత్నం టెస్లాలో ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్‌గా తన ఉద్యోగం ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. అయితే తన కుటుంబం, స్నేహితులతో కాలం గడపటానికి ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.
టెస్లాలో ఆమె ప్రారంభ రోజుల నుంచి ప్రాజెక్ట్‌లను మ్యాపింగ్ చేస్తూ కంపెనీ ఉన్నతికి తోడ్పడింది. మేము కలిసి ఇంత సాధించినందుకు గర్విస్తుంన్నాను అంటూ వెల్లడించింది. తానూ కంపెనీలో చేరిన తరువాత సంస్థ 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందని, ఇది తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.
శ్రీలా వెంకటరత్నం లింక్డ్‌ఇన్ పోస్ట్‌కు, టెస్లా మాజీ సీఎఫ్ఓ జేసన్ వీలర్ స్పందిస్తూ.. మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రీలా.. కంపెనీలో అద్భుతమైన విజయాలను సాధించినందుకు అభినందనలు అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment