
మిల్వాకీ: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌వాల్జ్‌కు ప్రమాదం తప్పింది. సోమవారం(సెప్టెంబర్2) మిల్వాకీలో లేబర్ డే కార్యక్రమానికి వెళ్తుండగా టిమ్‌వాల్జ్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాల్జ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనశ్రేణిలో ఉన్న పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు.
తమ వాహనాలను కాన్వాయ్‌లో వెనుక వచ్చే వాహనాలు బలంగా ఢీకొన్నాయని మీడియా సిబ్బంది తెలిపారు. ప్రమాదం అనంతరం టిమ్‌వాల్జ్‌తో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిమ్‌వాల్జ్ ప్రస్తుతం మిన్నెసోటా గవర్నర్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment