![Appointment Of State Vice Presidents For Three Affiliates Of Ysrcp - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/30/YSRCP.jpg.webp?itok=Uu5_MrWS)
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అనుబంధ విభాగాలను మరింత విస్తృతం చేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో YSRCP మూడు అనుబంధ విభాగాలకు రాష్ట్ర సహాధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సేవాదళ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా డా.కట్టి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సహాధ్యక్షులుగా బసిరెడ్డి సిద్ధారెడ్డి నియమితులయ్యారు.
సిద్ధారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన సిద్ధారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనపై నమ్మకముంచి తనకు కీలకమైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ ప్రచార బాధ్యతలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని సిద్ధారెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆర్. ధనుంజయ్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
బసిరెడ్డి సిద్ధారెడ్డి, YSRCP రాష్ట్ర ప్రచారకమిటీ సహాధ్యక్షులు
గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, YSRCP పంచాయతీ రాజ్ విభాగం సహాధ్యక్షులు
కట్టి వెంకటేశ్వర్లు, YSRCP సేవాదళ్ విభాగం సహాధ్యక్షులు
ఇదీ చదవండి: జగన్ పదునైన ప్రశ్నలు.. ఇంకేం ఇద్దరూ గప్‌చుప్!
Comments
Please login to add a commentAdd a comment