Affiliates
-
వైఎస్సార్సీపీ ఏదైనా సాధించగలదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీలో అనుబంధ విభాగాలు చాలా కీలకమని, వాటి కార్యకలాపాలు గ్రామస్థాయి వరకు విస్తరించాలని.. ప్రతీ కార్యకర్త, అభిమాని అందులో భాగస్వామ్యం కావాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయిన ఆయన.. కీలక సూచనలు చేశారు.‘‘పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడాలి. కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం. వైయస్సార్సీపీ మన పార్టీ. మనందరి పార్టీ. మనం కలిసికట్టుగా నిర్మించుకున్న పార్టీ. నేను మీ అందరి ప్రతినిధిని మాత్రమే’’ అని అన్నారాయన.ఏదైనా సాధించగలంYSRCPకి సంబంధించిన దాదాపు 24 అనుబంధ విభాగాలను యాక్టివేట్ చేస్తున్నాం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పోషించే పాత్ర చాలా కీలకమైనది. కారణం పార్టీకి కాళ్లు చేతులు ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్సే.. ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పోరాడగలదు. పరిగెత్తగలదు. పార్టీని పటిష్టపరిచేందుకు మనం శ్రీకారం చుడుతున్నాం. పదిహేను సంవత్సరాలుగా పార్టీ బలంగా ఉంది. మరింత ఆర్గనైజ్డ్గా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వీరిని ఆర్గనైజ్డ్గా అనుబంధ విభాగాల్లోకి తీసుకుని వస్తే.. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం.మనం చేసే కార్యక్రమాన్ని పద్ధతిగా తీసుకుని రావడంతో పాటు, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఏ పిలుపునిచ్చినా మొత్తం కేడర్ కదులుతుంది. ఎప్పుడైతే కేడర్ అగ్రెసివ్ గా కదులుతుందో అప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడగలుగుతాం. పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉంటనే మనం ఈ పోరాటం చేయగలుగుతాం. మనం పిలుపునిస్తే.. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరగాలి. అప్పుడే మనం ఆర్గనైజ్డ్గా పని చేస్తున్నట్లు అవుతుంది.అందరినీ కలుపుకుపోవాలిపార్టీ ఒక పిలుపు ఇస్తే అది గ్రామస్ధాయి వరకు మెసేజ్ పోవాలి. ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామస్ధాయి నుంచి పోరాటం చేయాలి. అలాంటి వ్యవస్ధను క్రియేట్ చేయాలి. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ నిర్మాణంలోకి తీసుకుని రావాలి. ఇందులో భాగంగా మిమ్నల్ని రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించాం. తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పూర్తైంది. ఇప్పుడు మీరు ఆయా జిల్లాల్లో అధ్యక్షులతో మమేకం కావాలి. ప్రతి జిల్లాలోనూ అనుబంధ విభాగాలకు సంబంధించి.. జిల్లా, నియోజకవర్గ, మండల స్ధాయి వరకు నియమించాలి. ముందుగా బలమైన జిల్లా అధ్యక్షుడిని నియమించాలి. ఆ తర్వాత నియోజకవర్గం, మండలాల ద్వారా ప్రతి గ్రామంపై దృష్టి పెట్టాలి.జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిస్తే ఆ జిల్లా అంతా కదలాలి. రాష్ట్రస్థాయి నుంచి పిలుపునిస్తే.. గ్రామ స్ధాయి నుంచి కదలిక రావాలి. అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి మిమ్మల్ని ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ లేనంత ధ్యాస పెడుతున్నాం. గ్రామస్ధాయి నుంచి తొలిసారిగా ఇంత ధ్యాస పెట్టి ఆర్గనైజ్డ్గా ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. వేగంగా అడగులు వేస్తున్నాం. మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ జిల్లాలో తిరగాలి. పర్యవేక్షణ చేయాలి. ఏం జరుగుతుందో చూడాలి. అందుకే ఇందులో అనుభవం ఉన్నవాళ్లను నియమించాం.సమన్వయంతో సమష్టి కృషిజిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా సమ్వయంతో పని చేయాలి. సంయుక్తంగా పార్టీని ఎలా గ్రామస్థాయికి తీసుకుని పోవాలి అన్నదానిపై ఒక వర్క్ షాప్ కూడా ఉంటుంది. ఇందులో గ్రామస్దాయికి పార్టీని ఎలా తీసుకుని పోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తారు. అందులో ప్రస్తుతం ఉన్న 24 విభాగాల్లో కొన్ని గ్రామస్థాయి వరకు విస్తరించాల్సిన విభాగాలు ఉంటాయి. వాటికి గ్రామస్ధాయి వరకు ప్రతినిధులు.. యువత, మహిళా, రైతు ఇలా అన్ని విభాగాల్లో ఉండాలి. ఈ కార్యక్రమాన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కలిసి చేయాలి.జిల్లా అధ్యక్షుడితో అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంత విస్తృతంగా మమేకమై తిరగగలిగతే.. అంత లోతుగా గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరిస్తుంది. అలాగే పార్టీకి కూడా అంత మేలు జరుగుతుంది. నేను కూడా అయా విభాగాలతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది.‘జగన్’ మీ అందరి ప్రతినిధి మాత్రమే:మీమీద నమ్మకంతో పెట్టిన ఈ బాధ్యతను మీరు అంతే బాధ్యతగా నెరవేరిస్తే.. మీక్కూడా మంచి జరుగుతుంది. పార్టీ మీ సేవలను గుర్తిస్తుంది. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు, జిల్లా అధ్యక్షులు సహా పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వారికే ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ మనది, మనందరిది అన్న విషయాన్ని గుర్తుంచుకొండి. మనం అందరం కలిసికట్టుగా పార్టీని నిర్మించుకున్నాం. జగన్మోహన్రెడ్డి మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. వారికే ప్రధమ ప్రాధాన్యత కూడా ఉంటుంది.క్షేత్రస్థాయి నుంచి బలోపేతంపార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం మూడు, నాలుగు నెలల్లో పూర్తి కావాలి. ఆ తర్వాత బూత్ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. పార్టీ నిర్మాణంలో ఉన్న వారందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలి. వారందరినీ పార్టీలో భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలి. వైఎస్సార్సీపీని దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా నిర్మించాలన్న ధృఢ సంకల్పంతో పని చేస్తున్నాం. క్షేత్రస్ధాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వారంతా పార్టీని నమ్ముకుని ఉన్నారు. వాళ్లందరికీ పార్టీ వ్యవస్ధలోకి తీసుకుని రావాలి. అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా పని చేయాలి. అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు.. ఇద్దరూ ఎలా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం చేసుకోవాన్న దానిపై త్వరలోనే వర్క్ షాప్ నిర్వహిస్తామని జగన్ తెలిపారు. -
YSRCP: మూడు అనుబంధ విభాగాలకు సహాధ్యక్షుల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అనుబంధ విభాగాలను మరింత విస్తృతం చేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో YSRCP మూడు అనుబంధ విభాగాలకు రాష్ట్ర సహాధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సేవాదళ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా డా.కట్టి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సహాధ్యక్షులుగా బసిరెడ్డి సిద్ధారెడ్డి నియమితులయ్యారు. సిద్ధారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన సిద్ధారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనపై నమ్మకముంచి తనకు కీలకమైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ ప్రచార బాధ్యతలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని సిద్ధారెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆర్. ధనుంజయ్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బసిరెడ్డి సిద్ధారెడ్డి, YSRCP రాష్ట్ర ప్రచారకమిటీ సహాధ్యక్షులు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, YSRCP పంచాయతీ రాజ్ విభాగం సహాధ్యక్షులు కట్టి వెంకటేశ్వర్లు, YSRCP సేవాదళ్ విభాగం సహాధ్యక్షులు ఇదీ చదవండి: జగన్ పదునైన ప్రశ్నలు.. ఇంకేం ఇద్దరూ గప్‌చుప్! -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. చదవండి: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
నాన్నను.. డూడ్ అంటూ క్లోజ్‌గా..
‘నాన్నా.. ఇక్కడ కొన్నాళ్లుంటాను’ అంటూ లగేజ్‌తో ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన కూతురిని సాదరంగా ఆహ్వానిస్తాడు తండ్రి. ‘అంతాబాగే కదా’, ‘అల్లుడు రాలేదేం’ వంటి ఆరా తీసే, ఇంటారాగేషన్ చేసే ప్రశ్నలు అడగకుండానే. కొన్నాళ్లున్నాక ‘నా భర్తను వదిలేశాను నాన్నా.. నన్ను చెంప దెబ్బ కొట్టినందుకు’ అని చెప్తుంది. ఆమె స్వాభిమానాన్ని అర్థం చేసుకుంటాడు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునే కూతురి పోరాటానికి మద్దతునిస్తాడు. ఇది ‘థప్పడ్’ సినిమాలో సన్నివేశం. ∙∙ ‘నీ చిన్నప్పటి ఫ్రెండ్స్‌ని కలవాలి అంతే కదా.. డన్’ అని తన అత్తగారికి అభయమివ్వడమే కాదు చెన్నైలోని తన అత్తగారిని, ఆగ్రాలో, ఆంధ్రలో ఉంటున్న ఆమె ప్రాణస్నేహితురాళ్లతో కలుపుతుంది. ఆ ముగ్గురిని ఒక్క మూడు రోజులు ఇల్లు, కుటుంబ బాధ్యతల నుంచి తప్పించి చిత్రకూట్‌కు తీసుకెళ్తుంది. ఆ ప్రయాణం ఆ ఫ్రెండ్స్‌లో జీవనోత్సాహాన్ని నింపడమే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యుల ఆలోచనా తీరునూ మార్చేస్తుంది. ఈ ముగ్గురి పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ‘ఆడవాళ్లకు మాత్రమే’ అనే సినిమా కథ. ∙∙ ‘అమ్మా.. అతను నాతో బ్రేకప్ చేసుకున్నందుకు బాధ లేదు. కాని వాళ్లమ్మతో నా ఫ్రెండ్షిప్ కట్ అయిపోయి ఓ మంచి ఫ్రెండ్‌ను కోల్పోయానన్న దిగులు వెంటాడుతోంది’ అని చెప్తుంది కూతురు. ‘బ్రేకప్ అయింది అతనితో.. వాళ్లమ్మతో కాదుకదా’ అంటూ తన కూతురి ఫోన్లోంచి ఆ అబ్బాయి తల్లికి ఫోన్ కలిపి మాట్లాడిస్తుంది. ఆ స్నేహం కొనసాగేలా ప్రోత్సహిస్తుంది ఆ అమ్మ. ఇది ‘వరనే ఆవశ్యముండ్’ అనే మలయాళ సినిమాలోని ఒక లేయర్. ఇవన్నీ కథలే. కాని అనుబంధాల్లో వచ్చిన మార్పులకు అద్దం పడ్తున్న చిత్రాలు. ఇదివరకున్న కుటుంబ బంధాలు వేరు. నవ్వును బలవంతంగా మీసాల చాటున దాచేసి, లేని కోపాన్ని కళ్లల్లో ప్రదర్శించే గంభీరమైన నాన్న, ఇంటెడు చాకిరీని ఒంటిచేత్తో సవరిస్తూ.. నాన్న నియమాలను ఇంటిల్లిపాది తుచతప్పకుండా పాటించేలా చూసుకునే అమ్మ, ఆ పాలనలో పెరగడం తప్ప తల్లిదండ్రులు పంచే స్నేహ మాధుర్యాన్ని ఆ తరం పిల్లలందరూ అనలేం కాని చాలామందైతే అందుకోలేదు. కుటుంబ పెద్ద ఎప్పుడూ చూపులతో కాఠిన్యాన్ని కురిపించాలనే భావన వల్ల కావచ్చు.. ఆలోచనా సారూపత్య లేమీ కారణం కావచ్చు.. ఆ అంతరం అలా ఉండిపోవడానికి. కాని ఇప్పుడు .. నాన్నను.. డూడ్ అంటూ స్నేహితుడి కన్నా క్లోజ్ చేసుకుంటున్నారు. అమ్మ... ఏ కాలంలోనైనా పిల్లల ఆప్తురాలే. ఈ కాలంలో ఐడెంటిటీ ఉన్న మహిళగానూ గౌరవం ఇస్తున్నారు. అందుకే ‘మసాబా మసాబా’లో అడుగుతుంది మసాబా తన తల్లి నీనా గుప్తాను ‘నీలా నేనెందుకు లేను?’అని. తల్లిదండ్రులూ పిల్లలకు అంతే దగ్గరగా ఉంటున్నారు. సంకోచాలు, బిడియాలు లేకుండా భేషజాలకు పోకుండా మెదులుతున్నారు. అమ్మ, నాన్న కాకపోతే పిల్లలకు ఇంకెవరు ఇస్తారు ఆసరా అనుకుంటున్నారు. పిల్లల ప్రేమకు రాయబారులగా మారుతున్నారు. వాళ్ల తొందరపాటు తప్పటడుగా మారకుండా అనుభవాన్ని చెలిమిగా మార్చి పంచుతున్నారు. బ్రేకప్‌లు, ఫెయిల్యూర్లు జీవితంలో భాగమని సంభాళించుకుని ముందుకు నడిచేలా వెన్ను తడుతున్నారు. కాబట్టే మసాబాకు సలహా ఇవ్వగలిగింది నీనా.. ‘యాంత్రికంగా మూడు ముళ్లను భరించే కంటే ఇష్టంగా లివిన్ రిలేషన్‌ను ఆస్వాదించడం మేలు’ అని. ఉద్యోగం మానేస్తాను అని పిల్లలు చెబితే గాబరా పడి మెలోడ్రామాను పండిచట్లేదు పెద్దలు. వాట్ నెక్స్›్ట అంటూ వాళ్ల ఐడియాలకు పదును పెడ్తున్నారు. పిల్లల నోట డైవోర్స్ అనే మాట విని మిన్ను విరిగి మీదపడ్డట్టుగా కుంగిపోవట్లేదు. భార్య, భర్తగా విడిపోతేనేం స్నేహితులుగా కొనసాగుతామనే పిల్లల పాజిటివ్ యాటిట్యూడ్‌ను చూసి విరిగిన వియ్యంతో నెయ్యం నెరపుతున్నారు. ఏదైనా పేరెంట్స్‌కు చెప్పొచ్చు అనే భరోసానిస్తున్నారు. కాబట్టే అమ్మానాన్నలకు తెలియకుండా జరిగే ఆర్యసమాజ్ పెళ్లిళ్లకన్నా అమానాన్నలను ఒప్పించి చేసుకుంటున్న పెళ్లిళ్లే ఎక్కువవుతున్నాయి. కులం, మతం కన్నా వధూవరుల మధ్య అవగాహన ముఖ్యమనుకుంటున్న పెద్దలూ ఉంటున్నారు. మిలేనియల్స్ హ్యాంగవుట్స్‌లో భాగమవుతున్నారు, వాళ్ల హ్యాంగోవర్‌నూ షేర్ చేసుకుంటు న్నారు. అచ్చంగా స్నేహితుల్లానే మెదులు తున్నారు. నిజజీవితంలోని ఈ దశ్యాలే న్యూ వేవ్‌గా తెరకెక్కుతున్నాయి. ఒక్కటవ్వడానికి.. అభిప్రాయలు, అభిరుచులే కాదు ప్యాషన్, ఫ్యాషన్‌నూ ఎక్స్చేంజ్ చేసుకునేంతగా తరాల అంతరం తగ్గడానికి కారణం సాంకేతిక విప్లవమే. నీనా గుప్తా అంటుంది ఓ ఇంటర్వ్యూలో ‘థాంక్ గాడ్... నా కూతురి చెప్పుల సైజ్, నా చెప్పుల సైజ్ ఒకటే’ అని. కాలాలు మాత్రమే కాదు ప్రాంతాలను ఒక్కటి చేసింది. పల్లె, పట్టణానికున్న దూరాన్ని చెరిపేసింది. కనుక ఈ పరిణామం అన్నిచోట్లా ఒకేలా ఉంది. మంచి, చెడుల ప్రస్తావనే లేదు. కుటుంబాలు చిన్నవైనా ఆలోచనా పరిధి విస్తృతం కావాలి... క్రమశిక్షణ కన్నా కలుపుగోలుతనానికే విలువ పెరగాలి. ఈ మార్పు కుటుంబంలోని హిపోక్రసీ ని గేటు బయటకు పంపిస్తుంటే ఇంతకన్నా ఆరోగ్యం ఏంటుంది! మహిళల సలహాలు, పిల్లల అభిప్రాయాలతో ఫ్యామిలీ పాలసీ తయారవుతుంటే అంతకు మించిన ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది!! -శరాది -
పూర్తిగా జూపల్లి చేతికి ‘మై హోమ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా ఐర్లాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ సీఆర్‌హెచ్ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్ ఇండస్ట్రీస్’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్ కన్స్ట్రక్షన్స్, జూపల్లి రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గ్రూప్ ప్రమోటరు జూపల్లి రామేశ్వరరావు కలిసి కొనుగోలు చేశారు. ఇందుకోసం వీరు దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెచ్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గురువారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించింది. 4 ప్లాంట్స్, 10 లక్షల టన్ను..: మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ‘మహా సిమెంట్’ బ్రాండ్ పేరిట గ్రే సిమెంట్ తయారీ, సరఫరాలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ పాండిచ్చేరి వంటి 11 రాష్ట్రాల్లో సిమెంట్ సరఫరా చేస్తోంది. సుమారు 5 వేల మందికి పైగా డీలర్లు ఉన్నారు. 10 లక్షల టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సంస్థకు తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విశాఖ జిల్లాల్లోనూ, అదేవిధంగా తమిళనాడులో కలిపి మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇక మై హోమ్ గ్రూప్... సిమెం ట్, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, పవర్, కన్సల్టెన్సీ, మీడియా, ఫార్మాసూటికల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో విస్తరించి ఉంది. -
సత్సంబంధాలు ఏర్పరచుకోవాలంటే సందేహిస్తున్నారా?
కొందరు ఇతరులతో స్నేహంగా ఉండాలంటే సంకోచిస్తారు. లేనిపోనివి ఊహించుకుంటూ భయపడతారు. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఇబ్బంది కలుగక పోవచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడే సహాయం అవసరమవుతుంది. అప్పటిదాకా ఇతరులతో పట్టీపట్టనట్లు ఉండి, అకస్మాత్తుగా సహాయం అడిగితే ఎవరూ చేయరు. మీరు ఎదుటివారితో స్నేహంగా ఉండటానికి సంకోచిస్తున్నారా? పరిచయాలు పెంచుకోవటానికి సందేహిస్తున్నారా? 1. ఎవరితోనైనా రిలేషన్ ఏర్పరచుకుంటే వారి వల్ల బాధపడవలసి వస్తుంది. ఎ. కాదు బి. అవును 2. మీ దృష్టిలో స్నేహం, ప్రేమ, అనుబంధాలు యాంత్రికమైనవి. ఎ. కాదు బి. అవును 3. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవటానికి మీరు వ్యతిరేకం. ఎ. కాదు బి. అవును 4. ఇతరులకు చాలా దగ్గరవ్వటం మీలో భయాన్ని పెంచుతుంది. ఎ. కాదు బి. అవును 5. అంత సులువుగా ఎవరినీ నమ్మరు. ఎ. కాదు బి. అవును 6. ఎవరితోనైనా క్లోజ్‌గా ఉంటే వారు నమ్మించి మోసం చేస్తారు. ఎ. కాదు బి. అవును 7. ఎదుటివారు మీకు దగ్గరవుతున్నా వారిని దూరంగా ఉంచుతారు. ఎ. కాదు బి. అవును 8. అందరికీ దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎ. కాదు బి. అవును 9. బాగా పరిచయస్తులతో కూడ చాలా తక్కువగా మాట్లాడతారు. ఎ. కాదు బి. అవును 10. గతంలో ఇతరులను నమ్మి నష్టపోయారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఎదుటివారితో స్నేహంగా, ప్రేమగా ఉండటానికి సంకోచిస్తారు. అనవసరమైన భయాలను వదలండి. ప్రపంచంలో అందరూ ఇతరులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుసుకోండి. స్నేహం విలువను గ్రహించటానికి ప్రయత్నించండి. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే మీ చుట్టుపక్కలవారితో మంచి రిలేషన్ కొనసాగించగలరు. -
ప్రతి బంధం... ప్రతిబింబం
మనిషికి మనిషికి మధ్య ఉండేది బంధం. మనిషికి అద్దానికి మధ్య ఉండేది బింబం. ఈ బంధాల కడలిలో... అనుబంధాల తీరంలో... ప్రతి అలా ఒక జ్ఞాపకం. అటువంటి ఎన్నో అలల ప్రతిబంబమే ప్రతీబంధం! మనల్ని మనం అద్దంలో చూసుకునే బదులు మన బింబాన్ని బంధాల్లో చూసుకుంటే... అనుబంధాలు బలపడతాయి. ప్రతిబింబాలూ అందంగా కనబడతాయి. అప్పుడు ప్రతిబంధం... ప్రతిబింబం. ఏడ్చి ఏడ్చి ఎంత సేపు పడుకుందో తెలియలేదు మాధవికి. మెలకువ వచ్చాక చూస్తే చీకటి ఆవరిస్తున్నట్టుగా అనిపించింది. టైమ్ చూస్తే సాయంత్రం ఆరు అవుతోంది. గదిలో ఒంటరిగా ఉంది. గదిలోనే కాదు ఆ ఇంటిలో ఒంటరిగానే ఉంటోంది రెండు రోజులుగా. ఆ గదిని వదిలి బయటకు రాలేకపోతోంది. అలాగని ఆ గదిలో ఉండలేకపోతోంది. ఎవరైనా పలకరిస్తే బాగుండు అనిపించింది. ఎవరైనా ఫోన్ చేశారేమో అని ఒకట్రెండు సార్లు ఫోన్ తీసి చూసింది. ఎవరూ ఫోన్ చేయలేదు. ‘అసలెవరున్నారు తనకు.. ఫోన్ చేయడానికి..!’ ఇలా అనుకోగానే మళ్లీ దుఃఖం కమ్ముకొచ్చింది. కిందటి రోజు జరిగిన సంఘటన గుర్తుకువచ్చి, మాధవి దుఃఖం రెట్టింపు అయ్యింది. ఒంటరితనం ఓ కష్టం! ‘ఎన్నెన్ని మాటలు అని వెళ్లాడు రవి. ఎంత ప్రేమించింది అతణ్ణి. పెళ్లై ఏడాదైనా కాలేదు. నాలుగేళ్లుగా చూపించిన ప్రేమంతా ఏమైపోయింది? తనతో తిరిగిన రోజులు... సంతోషంగా ఉన్న రోజులు... ఇప్పుడవన్నీ ఏమైపోయాయి?’ తనలో తానే మథనపడసాగింది. ‘‘నువ్వు స్వార్థపరురాలివి. ఒక్కదానివే ఉండు’’ అన్న రవి మాటలు పదే పదే సూదుల్లా గుండెను పొడుస్తున్నట్టుంది మాధవికి. ‘రవి ఇలా మాట్లాడడానికి కారణం వాళ్ల అమ్మనాన్న, చెల్లెలే కదా! వాళ్ల నుంచి దూరంగా వచ్చి, మేం సంతోషంగా ఉన్నామని కుళ్లు. వాళ్లే రవికి అన్నీ నేర్పి, ఇక్కడ్నించి తీసుకెళ్లిపోయారు’ అని ఏడుస్తూనే ఉంది. నాలుగేళ్ల క్రితం కాలేజీలో కలుసుకున్నారు ఇద్దరు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. మూడేళ్లు కలిసి తిరిగారు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రవి వాళ్ల అమ్మానాన్న ముందు ఒప్పుకోలేదు. కానీ, రవే ఒప్పించాడు. మాధవికి అమ్మానాన్న లేరు. ఉన్న నానమ్మ సరే అంది. అనుకున్న నెల రోజుల్లోనే పెళ్లయిపోయింది. కలిసుండడం ఓ కష్టం!! పెళ్లయ్యాక ఆరు నెలలు అత్తమామలతోనే కలిసి ఉంది మాధవి. ఆ ఇంటి బాధ్యత అంతా రవిదే అని తెలిసింది. భర్త చనిపోవడంతో రవి చెల్లెలు పుట్టింట్లోనే ఉంటుంది కూతురితో సహా. మరిదికి ఇంకా ఉద్యోగం లేదు. చుట్టపు చూపుగా వచ్చే పెద్దాడపడుచు ‘ఇద్దరూ ఉద్యోగస్థులే కదా! ఏదైనా సాయం చేయండం’టూ మాట్లాడేది. కొన్ని రోజుల్లోనే ఇల్లంతా రణ రంగమే అనిపించసాగింది మాధవికి. వీటన్నిటి నుంచి బయటపడా లనుకునేది. ఆఫీసు బాగోలేదని ఉద్యోగం మానేసింది. భర్తకు తన మీద చాడీలు చెబుతోందేమో అని ఆడపడుచుపై అనుమానం. అత్తగారు కొడుకునూ, తననూ విడదీసే ప్రయత్నం చేస్తున్నారని అపోహతో గొడవ. ఓ రోజు ‘ఈ ఇంట్లో నేనుండలేను’ అని భర్తతో అంది. దీంతో తప్పనిసరై వేరు కాపురం పెట్టారు. అన్నీ కఠిన పాఠాలే! వేరు కాపురం... తన ఇష్టం వచ్చినట్టు ఉండచ్చు అన్న ఆనందం మాధవికి ఎన్నో రోజులు లేదు. పదే పదే అత్తమామల ఖర్చుల కోసం రవికి ఫోన్ చేయడం, ఏవో సమస్యలు చెప్పడం... తరచూ వాళ్ళ దగ్గరికి రవి వెళ్లిరావడం మాధవి భరించలేకపోయేది. ఆ ఇంటితో పూర్తిగా తెగతెంపులు చేసుకోమని గొడవ. ఓ రోజు రాత్రి రవి వాళ్ల అమ్మ ఫోన్ చేసింది. ‘చెల్లెలికి ఒంట్లో బాగోలేదు... జ్వరం. అర్జెంటుగా రమ్మనమని. ఫోన్లో మాట్లాడిన విషయం రవికి చెప్పలేదు మాధవి. ‘జ్వరం వస్తే కంగారెందుకు? చీటికీ మాటికీ ఫోన్లు చేయడం, విసిగించడం?’ అనుకొని ఊరకుంది. ఉదయాన్నే చెల్లెలి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, ఫిట్స్ వచ్చాయనీ, చుట్టుపక్కల వారి సాయంతో ఆసుపత్రిలో చేర్చారనీ రవికి తెలిసింది. ఒంట్లో బాగా లేదని తెలిసీ మాధవి తనకు చెప్పలేదని మాధవి మీద కోపంతో విరుచుకుపడ్డాడు రవి. ‘నువ్వు ఒంటరిదానివి, ఒంటరిగానే బతుకు’ అంటూ వెళ్లిపోయాడు. కోపంలో రవి అన్న ప్రతీ మాటను గుర్తు తెచ్చుకొని ఏడుస్తోంది మాధవి. ఎవరో డోర్ తట్టిన శబ్దం రావడంతో రవి ఏమో అని ఆత్రుతగా వెళ్లింది. గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. వచ్చిన భరోసా! అమెరికాలో ఉన్న మాధవి మేనత్త పూర్ణ. పోల్చుకోవడానికే కొంత టైమ్ పట్టింది మాధవికి. ‘‘నానమ్మ ద్వారా అడ్రెస్ తెలుసుకొని వచ్చానే’’ చెప్పింది పూర్ణ. ‘‘మళ్లీ అమెరికా వెళుతున్నా, నీ పెళ్లికి కూడా రాలేదు. ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది. వచ్చా’’ అంది. చిన్నప్పుడు ఆమె దగ్గర తను మారాం చేసిన క్షణాలన్నీ గుర్తుకువచ్చాయి మాధవికి. ‘‘ఎలా ఉన్నావురా!’’ అని మేనత్త ఆప్యాయంగా అడిగేసరికి మాధవి భోరుమంది. బతకాలని లేదనీ, ఎప్పుడూ ఒంటరి బతుకే అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. మెల్లగా విషయమంతా తెలుసుకున్న పూర్ణ మాధవికి ధైర్యం చెప్పింది. ‘నీ సమస్యకు పరిష్కారం నేను చెప్పడం కన్నా నీవే స్వయంగా తెలుసుకుందువుగానీ’ అంటూ ఊరడించింది. మరుసటి రోజు పూర్ణ, మాధవిని తీసుకొని ఒక క్లినిక్‌కి వెళ్లింది. అది ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ క్లినిక్. గత జన్మ అనుభవాల నుంచి ఈ జన్మ జీవనవిధానం తెలుసుకునే చోటు. ఈ థెరపీ ప్రాధ్యాన్యాన్ని తెలుసుకుంది మాధవి. కౌన్సెలర్ దగ్గర తన సమస్యను వివరించింది. ‘‘మీ సమస్యను మీకై మీరుగా అద్దంలో చూసుకున్నట్టు చూడగలరు. మీరు సిద్ధమైతే ధ్యానప్రకియ ద్వారా ఆ అవకాశం ఉంది!’’ అని చెప్పారు కౌన్సెలర్. ‘‘సిద్ధమే’’ అంది మాధవి. అన్నీ ఆత్మీయ బంధాలే! థెరపీ మొదలైంది. మాధవి తన పాతికేళ్ల జీవితాన్ని కళ్లు మూసుకొని ధ్యానప్రకియలో దర్శిస్తోంది. ఒక్కో సంవత్సరం వెనక్కి వెళుతూ, తాను దర్శిస్తున్నవాటన్నిటి గురించి చెబుతోంది. కౌన్సెలర్ నోట్ చేసుకుంటున్నారు. తన పెళ్లి, హాస్టల్ జీవితం, అమ్మనాన్నలు గొడవపడి విడిపోవడం, బాల్యం, ఒంటరితనం.. అన్నీ మాధవి చూస్తోంది. ఆ దశలు అన్నింటిలోనూ తన వేదన గమనిస్తోంది. గర్భస్థ శిశువు దశ నుంచి గత జన్మకు ఆమె ప్రయాణం మొదలైంది. అక్కడ తనెవరితోనో గొడవపడుతోంది. ‘‘ఆవిడ ఎవరో కాదు... ఇప్పుడు అత్తగారు. కానీ ఆ జన్మలో నాకు అమ్మ. నన్ను పనులు చేయమని చెబుతోంది. నేను వినిపించుకోవడం లేదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి పడబోయాను. నన్ను పట్టుకుని లేపారెవరో.. ఆమె నా ఆడపడుచు. కాదు కాదు... గత జన్మలో అప్పుడు నా చెల్లెలు. ‘సరిగా చూసుకోవా!’ దెబ్బతగులుతుంది అని చెబుతోంది. నాకు జబ్బు చేసింది. బెడ్ మీద ఉన్న నాకు సపర్యలు చేస్తున్నారెవరో... ఎవరో కాదు రవి.’’ కళ్ళ ముందు కదలాడుతున్న గత జన్మ దృశ్యాలన్నీ చెబుతున్న మాధవి కళ్లు వర్షిస్తున్నాయి పశ్చాత్తాపంతో. ప్రేమ, బాధ్యత, ధైర్యం, త్యాగం.. ఇలా ఇవన్నీ నేర్పించడానికి గురువుల్లా తనతో కలిసి ఆత్మీయ బంధువులుగా వాళ్ళు ప్రతి జన్మలోనూ ప్రయాణం చేస్తున్నారని తెలుసు కుంది. కర్మ ప్రయాణం అర్థమెన మరుక్షణం వారందరినీ క్షమించమని వేడుకుంది. తాను ఎవరి వల్ల వేదనకు గురైందో వారిని మనస్ఫూర్తిగా క్షమించగలిగింది. మెల్లగా ప్రశాంత వదనంతో మేల్కొంది. ఈ జీవితాన్ని చక్కదిద్దుకునే బాధ్యత తనదే అనీ, తాను ఒంటరిని కాదనీ తెలుసుకుంది. దేవతలా వచ్చావంటూ మేనత్తకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు మాధవి ఒంటరి మనస్తత్వానికి స్వస్తి పలికింది. చుట్టూ ఉన్న బంధాలు, వాటిలోని సమస్యలను అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ ఆనందంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. బంధాలే గురువులు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సహోద్యోగులు... ఇలా మన చుట్టూ ఉన్న వ్యక్తులంతా అద్దాల్లాంటివారు. మన ప్రతిబింబాన్ని వాళ్లలో చూసుకోవచ్చు. మనలోని లోపాలను వారిలో చూసుకొని సరిదిద్దుకోవచ్చు. నైపుణ్యాలను పెంచుకోవచ్చు. మనకీ విషయాలను తెలియజేయడానికి, నేర్పడానికే బంధాల రూపంలో వ్యక్తులు కలుస్తుంటారు. కొంతమంది మాత్రమే వారి చర్యల ద్వారా (మంచి లేదా చెడు) మనల్ని ఆకర్షిస్తారు. అంటే ఆ గుణాలేవో మనలోనూ ఉన్నట్టు గుర్తించాలి. ‘ఎదుటివారిని తప్పుబట్టడం, విమర్శించడం’ అనే సమస్య చాలా మందిలో ఉంటుంది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పి కొన్నాళ్లు గమనించండి. అందరూ మంచివాళ్లుగా కనిపిస్తారు. స్నేహబంధాలు కూడా పెరుగుతాయి. ‘ఎదుటి వ్యక్తి ఏ విషయం నేర్పడానికి వచ్చారు? అనే ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి నుంచి నేను ఏం నేర్చుకుంటాను?’ అని ప్రశ్నించుకోవాలి. కర్మన్యాయం ఏంటంటే ‘నేర్చుకునేంతవరకు మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలు, ఆ వ్యక్తులు కలుస్తూనే ఉంటారు. కొన్ని సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయంటే అవి గత జన్మల నుంచి కూడా మోసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాయి. ‘కార్మిక్ రిలేషన్ షిప్స్’లో పాఠాలను అర్థం చేసుకోవడం, క్షమించడం, దయ చూపడం. వీటిని పాటిస్తేనే కర్మలు నశిస్తాయి. ఎదుటివారు మనం చూసుకునే అద్దం మాధవి ఈ జన్మ ప్రయాణంలోనే కాదు గత జన్మలోనూ బాధ్యత, భావోద్వేగాలు, బంధాలు, త్యాగానికి సంబంధించిన పాఠాలను అర్థం చేసుకునే క్రమంలోనే ఉంది. గత జన్మలోనూ భర్త, అత్తమామ, ఆడపడుచులు తనకు ఇవన్నీ నేర్పించడానికి బంధువులయ్యారని తెలుసుకుంది. ఇవన్నీ తెలియక వీటన్నింటి నుంచి దూరం అవ్వాలనుకుంది. అంటే, తన కర్మను పూర్తిచేయడానికి ఆమె సిద్ధంగా లేదు. అందుకే ‘ఒంటరితనం’లో కూరుకుపోయింది. రిగ్రెషన్ థెరపీలో తనను తాను తెలుసుకుంది. ‘తను ఇవ్వగలిగింది ఏమిటి? తిరిగి పొందగలిగేదేమిటి?’ అని అనే రియలైజేషన్‌కు వచ్చింది. అప్పుడే తన జీవితం పట్ల సానుకూల దృక్ఫథం ఏర్పడింది. తిరిగి అన్ని బంధాల మధ్య ఆనందంగా జీవించగలిగింది. - న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చి అకాడమీ - నిర్మల చిల్కమర్రి -
అనుబంధాలకు రక్తపువురకలు!
=ఏడాదిలో జిల్లాలో 65 హత్యలు =ఇందులో సగం రక్తసంబంధికులవే... =క్షణికావేశంలోనే అనర్థాలు పేగు పంచుకుని పుట్టిన తల్లిని ఒకరు....వేలు పట్టుకుని నడిపించిన నాన్నను వురొకరు....అవ్మూనాన్నలను ఒకేసారి చంపిన కొడుకు...పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడు నీడగా ఉండాల్సిన వారు బంధాన్ని వురిచిపోరుు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 65 హత్యలు చోటు చేసుకోగా... అందులో సగం వరకు పేగు బంధం పంచుకున్న వారివే. నర్సంపేట డివిజన్లో ఏడాదిలోనే ఎనిమిది సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. నర్సంపేట, న్యూస్‌లైన్ : రక్తసంబంధీకుల మధ్య బంధాలు తెగిపోతున్నారుు. క్షణికావేశంలో అనర్థాలు చోటుచేసుకుంటున్న ఘటనలు జిల్లాలో విపరీతంగా పెరిగిపోయూరుు. భార్యను భర్త చం పడం... భర్తను భార్య చంపడం వంటి ఘా తుకాలు కొనసాగుతూ అనుబంధానికి విఘా తం కలిగిస్తున్నారుు. ఈ క్రమంలో పేగు బం ధం సైతం మరిచి ఉన్నాదిలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముగ్ధంపురంలో జరిగిన ఘ టనజిల్లావాసులను కలవరానికి గురిచేసింది. అనుబంధాల వుధ్య జరిగిన హత్యల వివరాలు... చెన్నారావుపేట వుండల కేంద్రానికి చెందిన కోరె సవ్ముయ్యు అనే వ్యక్తిని అతడి కువూరు డు కువూరస్వామి పారతో కొట్టి చంపాడనే నెపంతో జైలు జీవితం గడుపుతున్నాడు. ఇదే వుండలం కోనాపురం గ్రావూనికి చెంది న గనపాకరవి అనే వ్యక్తిని 2012లో అతడి తం డ్రి రాంబాబు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇదే వుండలం పాతవుుగ్దుంపురం గ్రావూనికి చెందిన అన్న లింగయ్యు అనే వ్యక్తిని ఆస్తి తగాదా విషయుంలో అతడి భార్య అన్న కట్టవ్ము కూర్చునే పీటతో హత్య చేసి జైలులో ఉంది. నల్లబెల్లి వుండలానికి చెందిన కోర్నేని అవుృతవ్ము ఒంటిపై ఉన్న నగలను దోచుకునేందుకు ఆమె వునువడే హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దుగ్గొండి వుండలం గిర్నిబావికి చెందిన గిన్నె సునీత అనే వుహిళను ఆమె భర్త ప్రభాకర్ గొడ్డలితో నరికి చంపినట్లు కేసు నమోదు కాగా.. వారి పిల్లలు తల్లిలేని వారయ్యూరు.