కొందరు ఇతరులతో స్నేహంగా ఉండాలంటే సంకోచిస్తారు. లేనిపోనివి ఊహించుకుంటూ భయపడతారు. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఇబ్బంది కలుగక పోవచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడే సహాయం అవసరమవుతుంది. అప్పటిదాకా ఇతరులతో పట్టీపట్టనట్లు ఉండి, అకస్మాత్తుగా సహాయం అడిగితే ఎవరూ చేయరు. మీరు ఎదుటివారితో స్నేహంగా ఉండటానికి సంకోచిస్తున్నారా? పరిచయాలు పెంచుకోవటానికి సందేహిస్తున్నారా?
1. ఎవరితోనైనా రిలేషన్ ఏర్పరచుకుంటే వారి వల్ల బాధపడవలసి వస్తుంది.
ఎ. కాదు బి. అవును
2. మీ దృష్టిలో స్నేహం, ప్రేమ, అనుబంధాలు యాంత్రికమైనవి.
ఎ. కాదు బి. అవును
3. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవటానికి మీరు వ్యతిరేకం.
ఎ. కాదు బి. అవును
4. ఇతరులకు చాలా దగ్గరవ్వటం మీలో భయాన్ని పెంచుతుంది.
ఎ. కాదు బి. అవును
5. అంత సులువుగా ఎవరినీ నమ్మరు.
ఎ. కాదు బి. అవును
6. ఎవరితోనైనా క్లోజ్‌గా ఉంటే వారు నమ్మించి మోసం చేస్తారు.
ఎ. కాదు బి. అవును
7. ఎదుటివారు మీకు దగ్గరవుతున్నా వారిని దూరంగా ఉంచుతారు.
ఎ. కాదు బి. అవును
8. అందరికీ దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది.
ఎ. కాదు బి. అవును
9. బాగా పరిచయస్తులతో కూడ చాలా తక్కువగా మాట్లాడతారు.
ఎ. కాదు బి. అవును
10. గతంలో ఇతరులను నమ్మి నష్టపోయారు.
ఎ. కాదు బి. అవును
‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఎదుటివారితో స్నేహంగా, ప్రేమగా ఉండటానికి సంకోచిస్తారు. అనవసరమైన భయాలను వదలండి. ప్రపంచంలో అందరూ ఇతరులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుసుకోండి. స్నేహం విలువను గ్రహించటానికి ప్రయత్నించండి. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే మీ చుట్టుపక్కలవారితో మంచి రిలేషన్ కొనసాగించగలరు.
Comments
Please login to add a commentAdd a comment