
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాశీ విశ్వనాథుడుని దర్శించుకున్నారు. అంతుకు ముందు శుక్రవారం సాయంత్రం ఆయన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి కాశీ పర్యటన సందర్భంగా శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం తరఫున ఆశ్రమం చైర్మన్ పీవీఆర్ శర్మ , ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వీవీ సుందర శాస్త్రి, పీవీ రఘువీర్, వీవీఎస్‌పీ గణేష్ గౌరవపూర్వకంగా కలిశారు. ఆశ్రమం అభివృధి గురించిన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్ర పతి మాట్లాడుతూ గతంలో ఈ ఆశ్రమానికి వచ్చినట్టు చెప్పారు. ఎన్న ఏళ్లుగా ఈ ఆశ్రమం తెలుగు వారికి కాశీలో అనేక రకాల సేవలు అందిస్తోందని కొనియాడారు. ఆశ్రమం తరఫున ఉపరాష్ట్రపతిని సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment