Massive Discount
-
హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్
సాక్షి,ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ తన పాపులర్ కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా హ్యుందాయ్ తొలి ఈవెహికల్ కోనా ఎలక్ట్రిక్‌తో పాటు హ్యుందాయ్ ఐ20, ఆరా, ఐ10 నియోస్, లాంటి కొన్ని కార్ల కొనుగోలుపై లక్ష రూపాయల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.1.2L NA పెట్రోల్, 1.2L Bi సీఎన్జీ 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాల్యూ ఫర్ మనీ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) హ్యుందాయ్ ఆరా హోండా అమేజ్, టాటా టిగోర్ లాంటి కార్లకు గట్టిపోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఆరాపై రూ. 25,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) హ్యుందాయ్ ఐ20 హ్యుందాయ్ ఐ20 మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్స్ కొనుగోళ్లపై రూ. 13 వేల వరకు నగదు రాయితీ, ఇతరప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంకా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 తగ్గింపు కూడా. హ్యుందాయ్ i20 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ , 1.2L NA పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం. హ్యుందాయ్ కోనా EV దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ తొలి ఈవీ కోనా ఇప్పుడు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇందులో ఎలాంటి ఎక్స్ఛేంజ్ డీల్స్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు అందుబాటులో లేవు. -
ధంతేరస్ : కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: ధంతేరస్ సందర్భంగా కొత్త కారును కొందామని ప్లాన్ చేస్తున్నారా. లేదంటే ప్రస్తుత కారును మార్పిడి చేసి కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని యోచిస్తున్నారా? అయితే ఇది మంచి సమయం త్వరపడండి. ధనత్రయోదశి సందర్భంగా ప్రముఖకార్ల కంపెనీలుపండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవటానికి, అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. హోండా, మారుతి సుజికి, టాటా మోటార్స్ తమ టాప్ మోడల్ కార్లపై వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్జేంజ్ బోనస్‌తో పాటు భారీ ఆఫర్లను అందిస్తోంది. హోండా ఆఫర్లు హోండా అమేజ్, జాజ్, సిటీ ఇలా ఏడు మోడల్స్కార్లపై ధరలను తగ్గించింది. రూ.9.78 లక్షల కారుపై 42వేల దాకా డిస్కౌంట్.రూ. 12వేల రూపాయల విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ (4 వ & 5 వ సంవత్సరం). రూ .30,000 విలువైన కార్ల మార్పిడిపై అదనపు తగ్గింపు. రూ .16 వేల విలువైన హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం (మూడేళ్లు) ఉచితం. హోండా జాజ్‌లో రూ .25 వేల వరకు డిస్కౌంట్ రూ .25 వేల విలువైన కార్ ఎక్స్ఛేంజ్లో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. హోండా జాజ్ అసలు ధర రూ .9.41 లక్షలు. హోండా సిటీ: రూ. 32,000 ఆఫర్, కార్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ .30,000 అదనపు తగ్గింపు. అసలు ధరరూ .14.16 లక్షలు హోండా బిఆర్-విలో, కంపెనీ మొత్తం 1,10,000 రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది, ఇందులో నగదు తగ్గింపు (రూ .33,500), కార్ ఎక్స్ఛేంజ్ (రూ .50,000) ఇతరాలు (రూ .26,500) ఉన్నాయి. హోండా సివిక్ 250,000 రూపాయల వరకు తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తరువాత, కారు కొత్త ధర 17.94 లక్షలు. ఈ కారు అసలు ధర. రూ .22.35 లక్షల కారు. హోండా సివిక్ విత్ పెట్రోల్ ఇంజన్ (విసివిటి) రూ .200,000 వరకు నగదు తగ్గింపుతో లభిస్తుంది. హోండా సివిక్ (విఎక్స్ సివిటి, జెడ్ఎక్స్ సివిటి) మోడళ్లలో రూ .75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. మారుతి సుజుకి : మారుతి సుజుకి తన కార్లపై అధిక డిస్కౌంట్లను అందిస్తోంది. విటారా బ్రెజ్జా (డీజిల్) రూ .45,000 నగదు తగ్గింపు, 5 సంవత్సరాల వారంటీ రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ .10వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. మొత్తం రూ .96,100 వరకు తగ్గింపు. మారుతి సుజుకి డిజైర్ (డీజిల్) : రూ .83,900 వరకు ఆఫర్ కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి సుజుకి డిజైర్ (పెట్రోల్ వెర్షన్ అన్ని వేరియంట్లలో) 55,000 రూపాయల వరకు ఆఫర్. దీంతోపాటు చాలా సంవత్సరాలుగా కంపెనీ బెస్ట్ సెల్లర్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్, పెట్రోల్ వేరియంట్‌కు రూ .50 వేలు, డీజిల్ వేరియంట్‌కు రూ .77,600 వరకు, డీజిల్ వెర్షన్ కోసం కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజీతో పాటు ఆఫర్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, ఆల్టో కె 10, సెలెరియోలపై వరుసగా రూ .60 వేలు రూ. 55వేలు, రూ .60వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో ఎక్స్ఛేంజ్ , కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. టాటా మోటార్స్ కొత్త టాటా కారు కోసం తమ పాత కార్లను మార్పిడి చేసుకోవాలనుకునే వారికి డిస్కౌంట్లను అందిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం కంపెనీ నిర్దిష్ట పథకాలను ప్రారంభించింది. టాటా హెక్సా కొనుగోలుపై రూ .1.65 లక్షల వరకు ఆఫర్. టాటా నెక్సాన్ రూ .87,000 వరకు తగ్గింపు టాటా టియాగో , టాటా టియాగో ఎన్ఆర్జి రెండూ రూ .70 వేలదాకా ఆఫర్స్ . టాటా టైగర్‌పై 1.17 లక్షల రూపాయల తగ్గింపు టాటా హారియర్ 65,000 రూపాయల వరకు ఆఫర్ -
ఆ ఫోన్ ధరపై రూ.11వేల డిస్కౌంట్!
చైనీస్ హ్యాండ్సెంట్ తయారీదారి కూల్‌ప్యాడ్, వినియోగదారుల ముందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో వార్షికోత్సవ సేల్‌ను పురస్కరించుకుని తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కూల్‌ప్యాడ్ మ్యాక్స్ ధరపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. రూ.24,999గా ఉన్న ఈ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ధరపై 11వేల రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ భారీ డిస్కౌంట్ అనంతరం కూల్‌ప్యాడ్ మ్యాక్స్ ఫోన్ రూ.13,999కే వినియోగదారుల చెంతకు వచ్చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ డిస్కౌంట్ ఆఫర్, మూడు రోజుల్లో ముగియనుంది.. మొదటిసారి అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో ఈ వార్షికోత్సవాన్ని ఒక మిలియన్ కస్టమర్లతో జరుపుకోనున్నట్టు కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ధర తగ్గింపు కేవలం తాత్కాలికమేనని కంపెనీ తెలిపింది. కూల్‌ప్యాడ్ మ్యాక్స్‌పై ఈ భారీ డిస్కౌంట్‌తో పాటు రూ.6,999ల కూల్‌ప్యాడ్ మెగా 2.5డీ ఫోన్‌ను కొన్నవారికి వంద శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందించనున్నట్టు పేర్కొంది. గత మేలో ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పైనా రోజ్ గోల్డ్, రాయల్ గోల్డ్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను కూల్‌ప్యాడ్ మ్యాక్స్‌ను కంపెనీ ఆవిష్కరించింది. కూల్‌ప్యాడ్ మ్యాక్స్ ఫీచర్లు... 5.5 అంగుళాల డిస్ప్లే 1.5గిగాహెడ్జ్ ఆక్టకోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 64 జీబీ వరకు విస్తరణ మెమెరీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫీచర్లతో పాటు డ్యూయల్ స్పేస్ సిస్టమ్ ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆకర్షణ. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇతర యాప్‌లను రెండు అకౌంట్లగా ఈ ఫోన్లో వాడుకోవచ్చు.