ఆ ఫోన్ ధరపై రూ.11వేల డిస్కౌంట్!
ఆ ఫోన్ ధరపై రూ.11వేల డిస్కౌంట్!
Published Wed, Sep 21 2016 3:00 PM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM
చైనీస్ హ్యాండ్సెంట్ తయారీదారి కూల్ప్యాడ్, వినియోగదారుల ముందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్ను తీసుకొచ్చింది. అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో వార్షికోత్సవ సేల్ను పురస్కరించుకుని తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ కూల్ప్యాడ్ మ్యాక్స్ ధరపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. రూ.24,999గా ఉన్న ఈ మ్యాక్స్ స్మార్ట్ఫోన్ ధరపై 11వేల రూపాయల డిస్కౌంట్ను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ భారీ డిస్కౌంట్ అనంతరం కూల్ప్యాడ్ మ్యాక్స్ ఫోన్ రూ.13,999కే వినియోగదారుల చెంతకు వచ్చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ డిస్కౌంట్ ఆఫర్, మూడు రోజుల్లో ముగియనుంది.. మొదటిసారి అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో ఈ వార్షికోత్సవాన్ని ఒక మిలియన్ కస్టమర్లతో జరుపుకోనున్నట్టు కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ధర తగ్గింపు కేవలం తాత్కాలికమేనని కంపెనీ తెలిపింది. కూల్ప్యాడ్ మ్యాక్స్పై ఈ భారీ డిస్కౌంట్తో పాటు రూ.6,999ల కూల్ప్యాడ్ మెగా 2.5డీ ఫోన్ను కొన్నవారికి వంద శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ను అందించనున్నట్టు పేర్కొంది. గత మేలో ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్ఫామ్పైనా రోజ్ గోల్డ్, రాయల్ గోల్డ్ కలర్స్లో ఈ ఫోన్ను కూల్ప్యాడ్ మ్యాక్స్ను కంపెనీ ఆవిష్కరించింది.
కూల్ప్యాడ్ మ్యాక్స్ ఫీచర్లు...
5.5 అంగుళాల డిస్ప్లే
1.5గిగాహెడ్జ్ ఆక్టకోర్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
64 జీబీ వరకు విస్తరణ మెమెరీ
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2800 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ ఫీచర్లతో పాటు డ్యూయల్ స్పేస్ సిస్టమ్ ఈ ఫోన్ను ప్రత్యేక ఆకర్షణ. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇతర యాప్లను రెండు అకౌంట్లగా ఈ ఫోన్లో వాడుకోవచ్చు.
Advertisement
Advertisement