పరీక్ష రాయకపోయినా.. పాస్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పరీక్షలు రాయకపోయినా వందలాది మంది విద్యార్థులను తరగతులను పాస్ చేయించేశారు అధికారులు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్‌స్కూల్‌లో 10, 11 తరగతులకు ఈ మార్చి - ఏప్రిల్‌లో పరీక్షలు జరిగాయి. సుమారు 2 లక్షల మంది విద్యార్థుల పరీక్షలకు హాజరయ్యారు. అయితే రాత్లామ్, ఉమేరియా, సీషోర్ ప్రాంతాల్లోని సెంటర్లలో వందలాదిమంది పరీక్షలకు విద్యార్థులు హాజరు కాలేదు. అయితే వారిని కూడా పాస్ చేయించారు అధికారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అటానమస్ బాడీ అయినప్పటికీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది.
విద్యార్థులు హాజరుకాకపోయినా.. పాస్ చేసిన ఘటనపై పలు ఫిర్యాదులు హెచ్‌ఆర్‌డీకి రావడంతో విజిలెన్స్ బృందాలను అక్కడకు పంపి సమాచారాన్ని తెప్పించుకుంది. ఈ ఘటనపై స్పందించిన ఎన్‌ఐఓఎస్ ఛైర్మన్ చంద్ర ఎస్ శర్మ మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తమేనని చెప్పారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.