
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ‘రాధా గోపాలం, అల్లరి బుల్లోడు’ చిత్రాలను కోనేరు అనిల్ కుమార్ నిర్మించారు. కాగా శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన రాధాగోపాలం చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. అలాగే నితిన్, త్రిష, రతి జంటగా నటించిన అల్లరి బుల్లోడు చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. కోనేరు అనిల్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment