
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై శుక్రవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై శుక్రవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై రిపబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు డబ్బు వాడుకున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్ కుమార్ కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.