
సాక్షి,అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. పోలీస్ స్టేషన్‌లు, జైళ్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1001 స్టేషన్‌లలోనే ఎందుకు సీసీ కెమెరాలు పెట్టారు? మిగిలిన స్టేషన్‌లలో ఎందుకు సీసీ కెమెరాలు పెట్టలేదు? సుప్రీంకోర్టు మార్గదర్శికాల ప్రకారం సీసీటీవీలు పెట్టరా..? పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తం కనిపించేలా సీసీటీవీలు ఏర్పాటు చేశారా..?అని ప్రశ్నలు సంధించింది.
సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లపై డీఎస్పీలందరి నుంచి నివేదిక తెప్పించుకోవాలని, ఆ నివేదికను కోర్టు ముందు ఉంచాలని సూచించింది. అదే సమయంలో జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాట్లపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment