కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అఖిల్‌, హీరోయిన్‌గా జాన్వీ! | Akhil Akkineni Next Movie with Anil Kumar | Sakshi
Sakshi News home page

ఏజెంట్‌ పరాజయం.. అఖిల్‌ నెక్స్ట్‌ సినిమా ఏదో తెలుసా?

Published Mon, May 1 2023 6:48 AM | Last Updated on Mon, May 1 2023 6:48 AM

Akhil Akkineni Next Movie with Anil Kumar - Sakshi

యంగ్‌ హీరో అఖిల్‌ నటించిన ఏజెంట్‌ థియేటర్లలో సందడి చేస్తోంది. కాగా ఆయన నటించనున్న తర్వాతి చిత్రం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు అనిల్‌ ఇటీవల అఖిల్‌కు ఓ కథ చెప్పారు. ఈ స్టోరీ నచ్చడంతో అఖిల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ మూవీ నిర్మించనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కానుందనే టాక్‌ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ను చిత్రయూనిట్‌ సంప్రదించారని భోగట్టా.

కాగా అఖిల్‌ ఇటీవల నటించిన ఏజెంట్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే! భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఏజెంట్‌తో హిట్‌ కొట్టాన్న అఖిల్‌ గురి తప్పడంతో ఇప్పుడు తన నెక్స్ట్‌ సినిమాపై ఫోకస్‌ పెంచాడు.

చదవండి: కానిస్టేబుల్‌ పరీక్షలో బలగం ప్రశ్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement