Will Janhvi Kapoor Pair With Akhil Akkineni in His Next Movie - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor : మరో తెలుగు సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన జాన్వీ కపూర్‌!

Published Thu, May 11 2023 6:15 PM | Last Updated on Thu, May 11 2023 6:32 PM

Will Janhvi Kapoor Pair With Akhil Akkineni In His Next Movie - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్‌ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో జాన్వీకపూర్‌ టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ఈ అందాల తార ఇప్పుడు తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకుంది. 

అఖిల్‌ అక్కినేని లేటెస్ట్‌ మూవీలో జాన్వీని ఫైనల్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్‌ అఖిల్‌తో ఓ భారీ బడ్జెట్‌ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ధీర అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్‌ దాదాపుగా ఫిక్స్‌ అయ్యిందట.

త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్‌గా జాన్వీని ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన NTR30 రిలీజ్‌ అనంతరం ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదనే టాక్‌ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement