ramayam pet
-
విద్యార్థినికి మత్తు మందిచ్చి..అశ్లీల ఫొటోలు
రామాయంపేట: ఆటో ఎక్కిన విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి వాటిని తన స్నేహితులకు పంపించిన ఆటో డ్రైవర్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్ కథనం మేరకు.. కోనాపూర్‌కు ఎందిన ఓ విద్యార్థిని రామాయంపేటలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కోనాపూర్ వెళ్లడానికి రామాయంపేటలో ఆటో ఎక్కింది. డ్రైవర్ జాష్వా పథకం ప్రకారం.. ఆటోను కోనాపూర్ వద్ద ఆపకుండా నేరుగా నిజాంపేట గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఆమెకు మత్తుమందు ఇచ్చి అసభ్యకర రీతిలో తన సెల్ ఫోన్‌తో ఫొటోలు తీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి నిజాంపేటలో దింపి వెళ్లిపోయాడు. కాగా జాష్వా స్నేహితుడైన కుమార్ ఈ ఫొటోలను బ్లూటూత్ ద్వారా తన స్నేహితులకు పంపగా బాధితురాలైన విద్యార్థినికి విషయం తెలిసింది. ఈ మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
సమగ్ర సర్వే కొచ్చిన ఉద్యోగులపై దాడి!
రామాయంపేట: సమగ్ర సర్వే కోసం వచ్చిన ఉద్యోగులపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తాగిన మైకంలో యువకుడు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినట్టు తెలిసింది. దాడి చేసిన యువకుడిపై ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
ట్రాన్స్‌కో కార్యాలయం ముట్టడి
రామాయంపేట, న్యూస్‌లైన్: కరెంట్ కోతలపై రైతులు, ప్రజలు కన్నెర్రచేశా రు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో కార్యాలయంను ముట్టడించారు. కోతలను ఎత్తివేయాలంటూ ధర్నా చేపట్టారు. బుధవారం రామాయంపేట మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహం నుండి రైతులు, ప్రజలు ర్యాలీగా బయలుదే ట్రాన్స్‌కో కార్యాలయం ము ట్టడించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలతోపాటు పట్టణంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతులకు నిరంతరాయంగా ఏ డు గంటల కరెంటు సరఫరా చేయకుండా నాలుగు గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో ఉద యం 10 గంటల నుండి 12 గంటల వర కు, సాయంత్రం 4 గంటల నుండి 6 గం టల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. కాగా అదనంగా మరో రెండు గంటలు ఎల్సీల పేరిట కరెంటు కోతలు విధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రైతులకు, ప్రజలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని లేకుంటే త్వరలో డీఈ కార్యాలయం ముట్టడిస్తామని హె చ్చరించారు. అనంతరం ఎస్ఈతో ప ద్మా దేవేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడి కరెంటు సమస్యను అడిగి తెలుసుకున్నా రు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మాజీ ఎంపీపీలు పుట్టి విజయలక్ష్మీ, గుండా ఎల్లం, బిజ్జ సంపత్, టిఆర్ఎస్ జిల్లా యూత్ ప్రధా న కార్యదర్శి అందె కొండల్ రెడ్డి, రామాయంపేట, నిజాంపేట, తొనిగండ్ల, దం తేపల్లి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, జాన్సీలింగాపూర్ సర్పంచ్‌లు ప్రభావతి, తిర్మల్‌గౌడ్, పిట్ల శామయ్య, గొల్ల గాలవ్వ నారాయణ, మానెగల్ల రామకిష్టయ్య, రామాయంపేట ఉప సర్పంచ్ నాగేశ్వర్ రె డ్డి, చిలుక గంగాధర్, వార్డు సభ్యులు పోచమ్మల పద్మ, పోచమ్మల ఐలయ్య, చింతల ఏసుపాల్, బాదె చంద్రం, మల్లారెడ్డి, సుభాష్, అక్కన్నపేట మాజీ సర్పంచ్ జంగం సిద్ధరాంలు, ఉప సర్పంచ్ కమ్మరి ప్రభాకర్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కిరణ్‌ను బర్తరఫ్ చేయాలి పాపన్నపేట: కుట్రలు, కుతంత్రాలతో, నాటకాలు, బహురూపులతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. బుధవారం మండల పరిధిలోని మల్లంపేట, పాపన్నపేట గ్రామాల్లో జరిగిన బోనాల పండగ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముసాయిదా బిల్లుకు, ఒరిజనల్ బిల్లుకు తేడా తెలియని కిరణ్ స్పీకర్‌గా, ప్రభుత్వ విప్‌గా, ఎమ్మెల్యేగా పనిచేయడం దురదృష్టకరమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులిద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. వందమంది కిరణ్‌లు, చంద్రబాబులు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని, అక్కడ అన్ని పార్టీల అధినేతలు కలిసి తెలంగాణకు మద్దతు కూడగడతారని తెలిపారు. -
ఫిర్యాదు చేయగానే ఎఫ్ఐఆర్ నమోదు
రామాయంపేట, న్యూస్‌లైన్ : ఇకపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందని నిజామాబాద్, మెదక్ జిల్లాల రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను తని ఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట సర్కిల్ పరిధిలో చేగుంట పోలీస్ స్టేషన్లో ఎ క్కువగా నే రాలకు సంబంధించిన కేసు లు ఉన్నాయని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున వాటిని నియంత్రించేందుకు పెట్రోలింగ్‌ను పెంచడం జరుగుతుందన్నారు. పోలీస్ క్వార్టర్స్‌ను నిర్మించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేంజ్ పరిధిలోని రెండు జిల్లాల్లో 60 శాతం కేసుల రికవరీ ఉందన్నారు. గ్రామాల్లో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా శాంతిభద్రతలపై అవగాహన కల్గి ఉండాలన్నారు. ఇప్పటివరకు రోడ్డుపై తనిఖీల్లో 4,993 మందికి జరిమానాలు విధించడం జరిగిందన్నారు. రామాయంపేటలో ప్రభుత్వ అనుమతి లేని ఫైనాన్స్‌లు, జీరో చిట్టీలు నడిపిస్తున్నారని విలేకరులు తెలుపగా అలాంటి వారు ఉంటే పేపర్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఫైనాన్స్‌లు, జీరో చిట్టీలు నడిపిస్తే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, ఎస్‌లు ప్రవీణ్ బాబు, ప్రశాంత్, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రామాయంపేట, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం దామరచెర్వు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానిక ఏఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూనస్(43) సోమవారం తన కూతురిని అత్తగారింట్లో దింపేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి వెళ్లాడు. తిరిగి సరూర్‌నగర్ వెళ్తున్న క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట బైపాస్‌లో బస్సు దిగి, పట్టణ శివారులోని దామరచెర్వు 44వ జాతీయ రహదారిపై నడుచుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యూనస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఏఎస్ఐలు మురళి, బాలక్రిష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళి తెలిపారు. -
మహిళ దారుణ హత్య
రామాయంపేట, న్యూస్‌లైన్: గుర్తుతెలియని ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఈ సంఘటన రామాయంపేట పట్టణ శివారులో మంగళవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్ఐ ప్రవీణ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం...గుర్తుతెలియని ఓ మహిళ(35) మృతదేహాన్ని పట్టణ శివారులోని మల్లన్న గుట్ట వద్ద ఓ వెంచర్ మైదానంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన సీఐ గంగాధర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులను రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగి లాలు మహిళ మృతదేహం వద్ద నుంచి మల్లన్నగుట్ట, పెద్దమ్మ దేవాలయం గుట్ట చుట్టూ తిరిగి మళ్లీ మైదానంలోకి వచ్చాయి. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడిన సీఐ, గుర్తుతెలియని మహిళ మెడకు దుండగులు ప్లాస్టిక్ తాడు బిగించి ఉరివేశారని, అనంతరం సుమారు 50 కిలోల రాయితో తలపై బాదారని తెలిపారు. అందువల్లే మహిళ తల నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేని విధంగా తయారైందన్నారు. మృతురాలి ఒంటిపై పూలరంగు చీర, కుడి చేతిపై పచ్చబొట్టు పొడిచి ఉందన్నారు. ఎవరికైనా ఈ మహిళ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.